E-Paper
Advertisement

Amazon Sale 2026: రూ.30 వేలకే 4K స్మార్ట్ టీవీ.. అమెజాన్ సేల్‌లో టాప్-5 మోడల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు!

Amazon Sale 2026: రూ.30 వేలకే 4K స్మార్ట్ టీవీ.. అమెజాన్ సేల్‌లో టాప్-5 మోడల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు!
Advertisement

Amazon Sale 2026: మారుతున్న టెక్నాలజీతో పాటు మన లైఫ్‌స్టైల్ కూడా క్రమంగా మారుతోంది. ఒకప్పుడు టీవీ అంటే కేవలం సినిమాలు, సీరియల్స్ చూడటానికి మాత్రమే ఉపయోగించేవాళ్లం. కానీ ఇప్పుడు చాలామంది ఇంట్లోనే చిన్న థియేటర్ లాంటి అనుభూతి పొందాలని కోరుకుంటున్నారు. అందుకే నేటి టీవీలు మంచి సౌండ్, క్లియర్ పిక్చర్ క్వాలిటీ, అలాగే ఎన్నో స్మార్ట్ ఫీచర్స్‌తో వినోదాన్ని మరింత ఎంజాయ్ చేసేలా రూపొందుతున్నాయి.

ఇలాంటి సమయంలో మన గాడ్జెట్స్‌ను కూడా టెక్నాలజీకి తగ్గట్టు అప్‌డేట్ చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్ లవర్స్ కోసం అమెజాన్ తీసుకొచ్చింది ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ 2026’. ముఖ్యంగా రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య మంచి స్మార్ట్ టీవీ కొనాలని భావిస్తున్నవారికి ఈ సేల్ మంచి అవకాశం. ఈ ధర పరిధిలో లభిస్తున్న కొన్ని మంచి టీవీలను ఇప్పుడు చూసేద్దాం.

సోనీ బ్రావియా 4K ఆల్ట్రా హెచ్‌డీ

Advertisement

టీవీల విషయంలో సోనీ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బడ్జెట్‌లో సోనీ బ్రావియా సిరీస్ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.దీనిలో ఉండే ఎక్స్ రియాలిటీ ప్రో ఫీచర్ ప్రతి దృశ్యాన్ని ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. మూవీ లవర్స్‌కు ఈ టీవీ చాలా బాగా నచ్చుతుంది. దీని సౌండ్ క్వాలిటీ కూడా చాలా సహజంగా ఉంటుంది.

శాంసంగ్ క్రిస్టల్ 4K నియో

శాంసంగ్ టీవీలు వాటి డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీకి పేరుగాంచాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ క్రిస్టల్ 4K నియో మోడల్ ఎంతో స్లిమ్‌గా ఉండి, చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిలో రంగులు ఎంతో విభిన్నంగా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులోని స్మార్ట్ ఫీచర్లు వాడటం చాలా సులభంగా ఉంటుంది. గేమింగ్, ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూసేవారైతే ఈ టీవీని ఎంపిక చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మండుటెండల్లోనూ ఎక్కువ కూలింగ్ ఇచ్చే విండో ఏసీలు.. రూ.30వేల లోపే!

ఎల్జీ 4K ఆల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ

ఎల్జీ టీవీలలో ఉండే వెబ్ ఓఎస్ ప్లాట్‌ఫాం యూజర్లను ఆకట్టుకుంటుంది. దీనిలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పిక్చర్ క్వాలిటీని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల మన కళ్లకు అలసట లేకుండా స్పష్టమైన విజువల్స్ చూడొచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఎల్జీ ఇచ్చే మ్యాజిక్ రిమోట్ ఫీచర్ టీవీ ఆపరేటింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

వన్ ప్లస్ యూ సిరీస్ 4K

తక్కువ కాలంలోనే టీవీ మార్కెట్‌లో వన్ ప్లస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఈ టీవీ కనెక్టివిటీ చాలా బాగా నచ్చుతుంది. బెజెల్ లెస్ డిజైన్‌తో వచ్చే ఈ టీవీ హాల్‌కు సరికొత్త లుక్ ఇస్తుంది. దీనిలోని కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంటుంది. క్వాలిటీతో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ వన్ ప్లస్ టీవీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

షావోమీ ఎక్స్ ప్రో సిరీస్

బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడంలో షావోమీ ముందుంటుంది. ఈ ఎక్స్ ప్రో సిరీస్‌లో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఇంట్లోనే ఒక మినీ థియేటర్ ఉన్నట్లు అనిపిస్తుంది. రూ.30వేల లోపు లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటే ఈ షావోమీ ఎక్స్ ప్రో సిరీస్ టీవీని కొనుగోలు చేయొచ్చు. ఆఫర్లు ముగిసేలోపే మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోండి.

Also Read: టీవీ అవసరం లేదు.. ఈ మినీ ప్రొజెక్టర్‌తో ఇంటి గోడనే సినిమా థియేటర్ చేసేయండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×