E-Paper
Advertisement

20 రోజుల బ్యాటరీ లైఫ్, కళ్లు జిగేల్మనే డిస్‌ప్లే.. Amazfit Cheetah 2 Pro ఫీచర్లు చూశారా?

20 రోజుల బ్యాటరీ లైఫ్, కళ్లు జిగేల్మనే డిస్‌ప్లే.. Amazfit Cheetah 2 Pro ఫీచర్లు చూశారా?
Advertisement

Amazfit Cheetah 2 Pro: నేటి యువతలో అమేజ్‌ఫిట్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా స్మార్ట్‌వాచ్ విడుదలైందంటే చాలు.. ఎగబడుతుంటారు టెక్ లవర్స్. ముఖ్యంగా ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం అదిరిపోయే వాచ్‌లను తీసుకొచ్చే ఈ సంస్థ.. ఇప్పుడు Cheetah 2 Pro పేరుతో మరో సూపర్ ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి వదిలింది. రన్నర్లు, అథ్లెట్లను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ వాచ్‌లో ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఎండలోనూ మెరిసిపోయే డిస్‌ప్లే..

ఈ వాచ్‌ను చూడగానే మొదట మనల్ని ఆకట్టుకునేది దీని డిస్‌ప్లేనే. ఇందులో 1.32 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను వాడారు. దీని హైలైట్ ఏంటంటే.. ఇది 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. దీంతో మండుటెండలో బయట రన్నింగ్ చేస్తున్నా సరే, స్క్రీన్ మీద ఉన్న నంబర్లు, మెసేజ్‌లు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. స్క్రీన్‌కు గీతలు పడకుండా సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. చూడటానికి పెద్దగా అనిపించినా, బరువు మాత్రం జస్ట్ 46 గ్రాములే కాబట్టి రోజంతా పెట్టుకున్నా ఇబ్బందిగా అనిపించదు.

Advertisement

Also Read: 6500mAh బ్యాటరీ, AI కెమెరాతో Motorola Edge 70 Pro ఎంట్రీ.. ధర ఎంతంటే?

20 రోజుల బ్యాటరీ బ్యాకప్..

స్మార్ట్‌వాచ్ వాడేవాళ్లకు ఉన్న పెద్ద తలనొప్పి ఛార్జింగ్. కానీ ఈ Cheetah 2 Pro విషయంలో ఆ భయం అక్కర్లేదు. ఇందులో 540 mAh బ్యాటరీ ఉంది. మామూలుగా వాడుకుంటే 20 రోజుల పాటు బ్యాటరీ వస్తుంది. అదే పనిగా జీపీఎస్ ఆన్ చేసి వాడుకున్నా కూడా 29 గంటల పాటు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి.. వారానికో, పది రోజులకో ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది.

హెల్త్ ట్రాకింగ్‌లో తోపు..

Advertisement

ఆరోగ్యం విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా ఉండటానికి ఇందులో అడ్వాన్స్‌డ్ హార్ట్ రేట్ సెన్సార్‌ను పెట్టారు. మనం పరిగెడుతున్నా, రెస్ట్ తీసుకుంటున్నా మన గుండె వేగాన్ని ఇది పక్కాగా లెక్క పెడుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. దీనిలో బిల్ట్‌ఇన్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ ఉంది. చీకట్లో రన్నింగ్ చేసే వాళ్లకు, పొద్దున్నే వాకింగ్‌కు వెళ్లే వాళ్లకు ఇది బాగా పనికొస్తుంది. అలాగే మైక్, స్పీకర్ ఉన్నాయి కాబట్టి.. వాచ్ నుంచే ఫోన్ కాల్స్ కూడా మాట్లాడేయొచ్చు.

ధర ఎంతంటే?

ఫీచర్లు భారీగా ఉన్నాయి కాబట్టి.. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర సుమారు రూ.37,000 పైమాటే. పాత మోడల్ Cheetah Proతో పోలిస్తే ఇది కొంచెం ఖరీదైనదే అయినా.. ఇందులో ఇచ్చిన అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే, టార్చ్ లైట్, బ్యాటరీ లైఫ్ చూస్తుంటే.. క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది.

Also Read: కొత్త ఏసీ కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ డబ్బులు వృధానే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×