E-Paper
Advertisement

Amazfit Bip 5 Unity Launched: అమాజ్‌ఫిట్ నుంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌వాచ్.. అబ్బబ్బ ఏమి ఫీచర్లు..!

Amazfit Bip 5 Unity Launched: అమాజ్‌ఫిట్ నుంచి ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌వాచ్.. అబ్బబ్బ ఏమి ఫీచర్లు..!
Advertisement

Amazfit Bip 5 Unity Smart Watch Launched: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌వాచ్‌లు స్టైల్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయాయి. అందువలనే కంపెనీలు మార్కెట్‌లో కొత్తకొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. కొనుగోలుదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. కాల్ ఫంక్షన్‌, బీపీ, హార్ట్‌బీట్, స్లీప్ ట్రాక్ వంటి వాటిని వాచ్‌లోనే అందిస్తున్నాయి. అలాంటి స్మార్ట్‌వాచ్‌‌నే తాజాగా ఫేమస్ స్మార్ట్‌వాచ్ కంపెనీ అమాజ్‌ఫిట్ తన వినియోగదారుల కోసం విడుద చేసింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Amazfit స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా విస్తరిస్తోంది. ఈక్రమంలోనే కొత్తకొత్త స్మార్ట్‌వాచ్‌లను తీసుకొస్తుంది. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ Amazfit Bip 5 Unity స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.91-అంగుళాల LCD డిస్‌ప్లే, 26 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ, 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. 120 స్పోర్ట్స్ మోడ్‌లతో కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Amazfit Bip 5 ధర గురించి మాట్లాడితే ప్రస్తుతం ఇది UK, US దేశాల్లో విడుదల చేశారు. UKలో దీని ధర 59.99 డాలర్లుగా ఉంది. అంటే భారత్ కరెన్సీలో రూ.5000.  USలో దీని ధర 69.99 యూరోలుగా నిర్ణయించారు. దీని ప్రకారం మన దేశంలో రూ. 7400గా ఉండొచ్చు. దేశంలో కూడా ఈ స్మార్ట్‌వాచ్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Also Read: ఇవేం ఆఫర్లు రా నాయానా.. ఐఫోన్ 15 మరి ఇంత చీపా..? ఏది కొనాలో తెలియడం లేదే..!

Advertisement

అమాజ్‌ఫిట్ బిప్ 5 యూనిటీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది 320 x 280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.91-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ వాచ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉంది.
ఇది కాకుండా ఈ స్మార్ట్‌వాచ్ IP68 రేటింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అంటే 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల వరకు నీటిలో మునిగిపోయినప్పుడు కూడా వాచ్ పని చేస్తుంది.

స్మార్ట్‌వాచ్‌లో Amazfitక బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ సెన్సార్ ఉంటుంది.  ఇది మీ హార్ట్‌ బీట్‌ను, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది. సెన్సార్ అసాధారణ హృదయ స్పందన రీడింగ్‌లు, అధిక రక్తపోటు లేదా తక్కువ ఆక్సిజన్ స్థాయిల కోసం హెచ్చరికలను కూడా ఇస్తుంది. Amazfit Bip 5 Unityని 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో లోడ్ చేసింది.

Also Read : అమెజాన్ కళ్లు చెదిరే డిస్కౌంట్.. రూ. 194లకే Oppo Enco Air 3 Pro ఇయర్‌బడ్స్‌..!

ఇది కాకుండా స్మార్ట్‌వాచ్ వాయిస్ కమాండ్‌ల కోసం అమెజాన్ అలెక్సా ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇది దాని స్మార్ట్‌ఫోన్ యాప్ నుండి సుమారు 70 యాప్‌లకు ససోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 300mAh బ్యాటరీ ఉంది. దీన్ని అధికంగా వినియోగిస్తే 5 రోజులు, 11 రోజుల సాధారణ లేదా బ్యాటరీ-సేవర్ మోడ్‌లో 26 రోజుల వరకు బ్యాటరీ లైప్‌ను అందిస్తుంది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×