E-Paper
Advertisement

అబ్బా ఏం ఐడియా గురూ.. చీపురుకు అల్యూమినియం ఫాయిల్ చుడితే ఇన్ని బెనిఫిట్సా!

అబ్బా ఏం ఐడియా గురూ.. చీపురుకు అల్యూమినియం ఫాయిల్ చుడితే ఇన్ని బెనిఫిట్సా!
Advertisement

Aluminum Foil Hacks: ప్రతి ఇంట్లోనూ ఉండే సాధారణ సమస్య ఏమిటంటే.. ఇంటిని ఎంత ఊడ్చినా సరే.. కాసేపటికే మళ్లీ దుమ్ము, వెంట్రుకలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువ. అయితే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక క్రేజీ క్లీనింగ్ ట్రిక్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మనం ఇల్లు ఊడ్చే చీపురుకు అల్యూమినియం ఫాయిల్ చుట్టాలన్నమాట. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుందని చాలామంది చెబుతున్నారు.

దీని వెనుకున్న రహస్యం ఏమిటంటే?

చీపురుకు అల్యూమినియం ఫాయిల్ చుట్టడం వెనుక ఒక చిన్న సైన్స్ దాగి ఉంది. సాధారణంగా ఇల్లు ఊడ్చేటప్పుడు నేలపై ఉండే ఘర్షణ వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ (స్థిర విద్యుత్) ఏర్పడుతుంది. తద్వారా సన్నటి ధూళి కణాలు, జుట్టు నేలకే అతుక్కుపోయి సరిగ్గా రావు. కానీ చీపురుకు అల్యూమినియం ఫాయిల్ చుట్టడం వల్ల ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రభావం తగ్గిపోతుంది. ఇది ఒక అయస్కాంతంలా పనిచేసి, కంటికి కనిపించని సన్నటి దుమ్మును, వెంట్రుకలను కూడా సులభంగా ఆకర్షిస్తుంది.

Advertisement

Also Read: సామాన్యుల కోసం చౌకైన ధరకే OnePlus N6.. భారత మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే!

ఈ ట్రిక్‌ను ఎలా ఉపయోగించాలి?

ఈ చిట్కాను ఫాలో అవ్వడం చాలా తేలిక. దీనికోసం మన ఇంట్లో ఉండే సాధారణ చీపురును తీసుకోవాలి. ఒక పెద్ద అల్యూమినియం ఫాయిల్ ముక్కను కట్ చేసి, చీపురు కింద ఊడ్చే భాగానికి లేదా కుంచెలకు బాగా చుట్టేయాలి. ఊడ్చేటప్పుడు ఆ ఫాయిల్ ఊడిపోకుండా గట్టిగా నొక్కి పెట్టాలి. ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే ఇల్లు ఊడిస్తే సరిపోతుంది.

క్లీనింగ్ ఎంత తేలికవుతుందంటే?

Advertisement

ఈ పద్ధతి వల్ల టైల్స్, గ్రానైట్ లేదా మార్బుల్ ఫ్లోర్స్‌పై ఉండే సన్నటి ఇసుక రేణువులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. దుమ్ము గాల్లోకి లేవకుండా ఒకేచోటికి చేరుతుంది. అలాగే వెంట్రుకలు, పీచులు చీపురుకు చిక్కుకుపోకుండా నేరుగా కుప్పగా మారిపోతాయి. దీనివల్ల చీపురు పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతుంది.

ఎన్ని రోజులు వాడొచ్చు?

అల్యూమినియం ఫాయిల్ చుట్టాం కదా అని దాన్నే నెలల తరబడి వాడకూడదు. ఇల్లు ఊడ్చే కొద్దీ ఆ ఫాయిల్ నలిగిపోవడం లేదా చిరిగిపోవడం జరుగుతుంది. అందుకే అది బాగా నలిగిపోయినా, లేదంటే మురికిగా మారినా వెంటనే తీసేసి, కొత్త ఫాయిల్ చుట్టుకోవాలి. ఇంటి ఫ్లోరింగ్‌ను బట్టి వారానికి ఒకసారి దీన్ని మార్చుకుంటే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది.

Also Read: ఇంత తక్కువ ధరలో అలాంటి ఫీచర్లా? మార్కెట్‌లోకి సైలెంట్‌గా వచ్చి రచ్చలేపుతున్న Vivo Y6a!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×