E-Paper
Advertisement

Sundar Pichai: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ జీతం.. ఒక దేశాన్నే కొనేయచ్చు భయ్యా!

Sundar Pichai: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ జీతం.. ఒక దేశాన్నే కొనేయచ్చు భయ్యా!
Advertisement

Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు జాక్ పాట్ కొట్టారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీని ప్రకారం రాబోయే మూడేళ్లలో గరిష్టంగా 692 మిలియన్ డాలర్లను సుందర్ పిచాయ్ అందుకోనున్నారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 6,361 కోట్లు కావడం విశేషం. ఇందులో ఆయన వార్షిక వేతనం (Base Salary) 2 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గత కొన్నేళ్లుగా స్థిరంగా కొనసాగుతూ వస్తోంది.

కొత్త వేతన ప్యాకేజీలో ఎక్కువ భాగం పర్ ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ కింద (126 మిలియన్ డాలర్లు) సుందర్ పిచాయ్ పొందనున్నారు. అలాగే పరిమిత స్టాక్ వెస్టింగ్ ద్వారా 84 మిలియన్ డాలర్లు.. ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థలైన వ్యోమో, వింగ్ ఏవియేషన్లలో 175 డాలర్ల విలువైన షేర్లను కేటాయించారు. అయితే లక్ష్యాలను మించి రాణిస్తే ఈ వాటాల విలువ రెట్టింపు పెరగవచ్చని లేదా లక్ష్యాలు చేరుకోలేకపోతే ఏమీ రాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

సాధారణ ఉద్యోగిగా గూగుల్ లో చేరిన సుందర్ పిచాయ్.. 2015లో కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. సుమారు 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక సామ్రాజ్యం విస్తరించింది. సుందర్ నాయకత్వాన్ని, భవిష్యత్తులో కంపెనీ ఎదుర్కోబోయే కొత్త సాంకేతిక సవాళ్లను (ఏఐ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మొదలైనవి) దృష్టిలో ఉంచుకుని సుందర్ పిచాయ్ ఈ భారీ ప్యాకేజీని నిర్ణయించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలతో పోలిస్తే.. ఇది అత్యంత భారీ ప్యాకేజీలలో ఒకటిగా నిలిచింది. అయితే రూ. 6,361 కోట్లు ప్యాకేజీతో ఒక చిన్న పేద దేశాన్ని కొనేయచ్చన్న అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Loco Pilot: డ్యూటీ అయిపోంది.. రైలు నడపను.. ప్రయాణికులకు లోకో పైలెట్ ఝలక్

Advertisement

సుందర్ పిచాయ్ నేపథ్యానికి వస్తే ఆయన అసలు పేరు పి. సుందరరాజన్. 1972 జూన్ 10న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి ఎంఎస్, వార్టన్ స్కూల్ (పెన్సిల్వేనియా యూనివర్సిటీ) నుండి ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్‌లో చేరకముందు ఆయన మెకిన్సే అండ్ కంపెనీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి సంస్థల్లో పనిచేశారు. 2004 నుంచి గూగుల్ లో సేవలు అందిస్తూ వస్తున్నారు.

Also Read: Alappuzha Railway Station: రైలు కోచ్ కింద.. మానవ శరీర భాగాలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×