E-Paper
Advertisement

Smartphones Launching in July: జులైలో రాబోతున్న ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే.. ఎంత ముద్దుగా ఉన్నాయో..!

Smartphones Launching in July: జులైలో రాబోతున్న ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే.. ఎంత ముద్దుగా ఉన్నాయో..!
Advertisement

Smartphones Launching in July: మీరు కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కొన్ని రోజులు ఆగండి. జులై నెల స్మార్ట్‌ఫోన్ ప్రియులకు చాలా ఉత్సాహాన్ని నింపబోతుంది. వచ్చే నెలలో చాలా కూల్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో టెక్నో స్పార్క్ 20 ప్రో 5Gతో పాటు సామ్‌సంగ్ గెలాక్సీ Z Fold6, Z Flip6, ఒప్పో Reno 12 Series, హానర్ 200 Series కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీరు పిచ్చెకించే కెమెరా సెటప్, ప్రాసెసర్‌తో పాటు మంచి డిస్‌ప్లేను చూడవచ్చు. వచ్చే నెలలో జరిగే టాప్ 5 లాంచ్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samsung Galaxy Z Fold 6,Z Flip 6
ఈ Samsung ఫోన్‌లు జూలై 10న జరిగే Galaxy Unpacked ఈవెంట్‌లో విడుదల కానున్నాయి. ఫోన్‌లు దీని మోడల్‌ను అప్‌డేటెడ్‌గా వస్తున్నాయి. Samsung ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌లో పని చేస్తాయి. వీటిలో కంపెనీ 12 GB వరకు ర్యామ్‌ను కూడా అందిస్తుంది. మీరు ఫోన్‌లో కొన్ని గెలాక్సీ AI ఫీచర్లను కూడా చూడవచ్చు. ఫోటోగ్రఫీ కోసం రెండు ఫోన్‌లలో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. కంపెనీ Z Flip 6లో 4000mAh బ్యాటరీని, Z Fold 6లో 4400mAh బ్యాటరీని తీసుకొస్తుంది.

Advertisement

Also Read: చారీ ఏందిరా ఇది.. రూ.8 వేలకే కొత్త ఫోన్.. త్వరగా లూట్ చేసేయండి!

Oppo Reno 12 Series
ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ వచ్చే నెలలో భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రెనో 12 సిరీస్‌ను టీజ్ చేసింది. అయితే దాని లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్‌లో కంపెనీ రెనో 12, రెనో 12 ప్రో అనే రెండు ఫోన్‌లను విడుుదల చేస్తుంది. మీరు కొత్త ఫోన్‌లలో అనేక AI ఫీచర్లను కూడా చూడవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ HD + OLED డిస్‌ప్లే చూస్తారు. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. అదే సమయంలో, సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ కెమెరా చూడొచ్చు.

Advertisement

Honor 200 Series
హానర్ 200 సిరీస్ ఫోన్‌లను వచ్చే నెలలో భారతదేశంలో కూడా విడుదల చేయవచ్చు. ఈ సిరీస్‌లో హానర్ 200, హానర్ 200 ప్రో అనే రెండు ఫోన్‌లు ఉంటాయి. ఇందులో  మీరు 1.5K రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల OLED కర్వ్డ్ డిస్‌ప్లే చూస్తారు. ఈ ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, ఫోటోగ్రఫీ కోసం 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సిరీస్ బేస్ వేరియంట్ Snapdragon 7 Gen 3 కలిగి ఉంటుంది. Pro వేరియంట్ Snapdragon 8s Gen 3లో రన్ అవుతుంది. బ్యాటరీ 5200mAh ఉంటుంది.

Also Read: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. 108 MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్ల మేళా..!

Tecno Spark 20 Pro 5G
కంపెనీ ఈ కొత్త ఫోన్ జూలైలో భారతదేశంలో విడుదల కానుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను తీసుకొస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డైమెన్షన్ 6080 ప్రాసెసర్‌పై రన్ అుతుంది. దీని మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్‌గా ఉంటుంది. మీరు ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ 5000mAh ఉంటుంది. ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×