E-Paper
Advertisement

ఎయిర్ టెల్ vs జియో.. ఒకే ధరకు రూ.899 ప్లాన్‌.. బెన్‌ఫిట్స్ పరంగా దేనిది పైచేయి!

ఎయిర్ టెల్ vs జియో.. ఒకే ధరకు రూ.899 ప్లాన్‌.. బెన్‌ఫిట్స్ పరంగా దేనిది పైచేయి!
Advertisement

Airtel vs Jio plans: దేశంలోనే తిరుగులేని ప్రైవేటు టెలికాం సంస్థలుగా భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో నిలిచాయి. నాణ్యమైన సేవలకు, వేగవంతమైన 5G నెట్ వర్క్ కు ఈ రెండు నెట్ వర్క్స్ చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఎయిర్ టెల్ తాజాగా తన మోస్ట్ వాంటెడ్ ప్లాన్ రూ.859 ను రూ.899కి మార్చేసింది. అయితే జియోలో ఇప్పటికే రూ.899కే ఓ ప్లాన్ ఉండటంతో సహజంగానే రెండింటిలో ఏది బెస్ట్ అన్న చర్చ మెుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్స్ ప్రయోజనాలు ఏంటీ? వాటి మధ్య వ్యత్యాసాలు? రెండింటిలో ఏది బెస్ట్? వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జియో రూ. 899 ప్లాన్

జియో తన రూ. 899 ప్లాన్‌ను 90 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కింద యూజర్ కు ప్రతీరోజూ 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. కాలపరిమితి పూర్తయ్యే సరికి 180GB డేటాను యూజర్ పొదవచ్చు. అలాగే అదనంగా 20GB ఎక్స్‌ట్రా డేటాను కూడా బోనస్‌గా జియో ఆఫర్ చేస్తోంది. ఇవి కాకుండా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు చేసుకోవచ్చు. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ సైతం ఈ ప్లాన్ కింద లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 899 ప్లాన్

Advertisement

గతంలో రూ. 859గా ఉన్న ఈ ప్లాన్ ను ఎయిర్ టెల్ రూ. 899కి సవరించింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్.. ప్రతీరోజా 1.5 GB డేటాను అందిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100SMSలు యథావిధిగా యూజర్ పొందవచ్చు. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే.. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే (Xstream Play) యాక్సెస్‌ను పొందవచ్చు. దీని ద్వారా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోని సినిమాలను ఉచితంగా వీక్షించవచ్చు. అలాగే ఉచిత హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ సైతం యూజర్ కు లభిస్తుంది.

Also Read: Air Coolers: ప్లాస్టిక్ vs ఐరన్ కూలర్లు.. మెరుగైన కూలింగ్‌కు.. రెండింటిలో ఏది బెస్ట్?

జియో vs ఎయిర్‌టెల్.. ఏది బెటర్?

Advertisement

రూ. 899 ప్లాన్ విషయంలో ఎయిర్ టెల్ పై జియో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఎయిర్ టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ఇస్తే జియో 90 రోజులు అందిస్తోంది. అలాగే రోజూవారీ డేటా తీసుకున్నా 2 GBతో జియో పైచేయి సాధిస్తోంది. అయితే మీకు ఓటీటీ, ఎంటర్ టైన్ మెంట్ ముఖ్యమని భావిస్తే ఎయిర్ టెల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ వాలిడిటీ, డేటా కోరుకుంటే జియో లాభదాయకంగా ఉంటుంది.

Also Read: ‘చాలా క్యూట్‌ ఉన్నారు.. మీ వయసెంత’.. మహిళతో ర్యాపిడో డ్రైవర్ పిచ్చివేషాలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×