E-Paper
Advertisement

Airtel vs Jio Fiber: ఇంటికి హై స్పీడ్ Wi-Fi కనెక్షన్ కావాలా? ఎయిర్‌టెల్, జియో.. ఏది తీసుకుంటే లాభం?

Airtel vs Jio Fiber: ఇంటికి హై స్పీడ్ Wi-Fi కనెక్షన్ కావాలా? ఎయిర్‌టెల్, జియో.. ఏది తీసుకుంటే లాభం?
Advertisement

Airtel vs Jio Fiber: నేటి ఈ ఆధునిక యుగంలో ప్రతి ఇంట్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి అయిపోయింది. ఇంటర్నెట్ లేకపోతే ఏ పనీ ముందుకు సాగదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. వర్క్ ఫ్రం హోం చేయాలన్నా, పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా, చివరకు తీరిగ్గా కూర్చుని ఓటీటీలో సినిమా చూడాలన్నా Wi-Fi ఉండి తీరాల్సిందే. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అత్యవసరంగా మారిపోయింది. అయితే మార్కెట్లో చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ, చాలామందికి మొదట గుర్తొచ్చేవి జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మాత్రమే.

కానీ సామాన్యుల విషయానికి వస్తే.. తక్కువ ధరలో ఎక్కువ స్పీడ్ ఇచ్చే ప్లాన్ ఏది? అసలు ఈ రెండింటిలో మన అవసరాలకు ఏది సరిపోతుంది? నెలవారీ ఖర్చు తక్కువగా ఉంటూనే అదనపు ప్రయోజనాలు ఎందులో ఎక్కువగా ఉన్నాయి? ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఆ కన్ఫ్యూజన్‌కు చెక్ పెడుతూ.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం..

బడ్జెట్ ప్లాన్‌లలో ఏది బెస్ట్?

Advertisement

తక్కువ బడ్జెట్‌తో ఇంటికి Wi-Fi కనెక్షన్ తీసుకోవాలనుకుంటే.. జియో ఫైబర్ అన్నిటికంటే ముందు వరుసలో ఉంటుంది. జియోలో బేసిక్ ప్లాన్ నెలకు కేవలం రూ.399 నుంచే ప్రారంభమవుతుంది. దీనిలో 30 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఈ డేటా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేవారికి, సోషల్ మీడియా వాడేవారికి ఇది సరిపోతుంది. ఇక ఎయిర్‌టెల్ విషయానికి వస్తే.. ప్రారంభ ప్లాన్ ధర రూ.499గా ఉంది. అంటే.. జియో కంటే రూ.100 ఎక్కువ. అయితే, ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా 40 Mbps స్పీడ్ లభిస్తుంది. ఒకవేళ ధర ముఖ్యం అనుకుంటే, జియో వై-పే కనెక్షన్ తీసుకోవడం ఉత్తమం.

Also Read: బంపర్ ఆఫర్ మావా.. డాల్బీ అట్మాస్ స్మార్ట్ టీవీలు సగం ధరకే వచ్చేస్తున్నాయ్!

ఇంటర్నెట్ స్పీడ్  కావాలంటే..

Advertisement

చాలామంది 100 Mbps స్పీడ్ ఉండే ప్లాన్లనే ఇష్టపడతారు. జియోలో 100 Mbps ప్లాన్ రూ.699కే లభిస్తుంటే.. ఎయిర్‌టెల్‌లో దీని ధర రూ.799గా ఉంది. ఒకవేళ ఓటీటీ కంటెంట్ కూడా కావాలనుకుంటే రూ.999 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ధరలో జియో 150 Mbps స్పీడ్ ఇస్తుంటే, ఎయిర్‌టెల్ ఏకంగా 200 Mbps వేగంతో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇంటర్నెట్ స్పీడ్ కావాలనకుంటే.. ఎయిర్‌టెల్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

 ప్రాంతాన్ని బట్టి ఎంపిక..

ఒకవేళ తక్కువ ధరలో బేసిక్ వై-ఫై కావాలనుకునే వారికి జియో రూ.399 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. లేదంటే ఎక్కువ స్పీడ్, అదనంగా ఓటీటీ సేవలు కావాలంటే మాత్రం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే అన్నిటి కంటే ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం.. మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ సిగ్నల్, సర్వీస్ బాగుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ధరతో పాటు క్వాలిటీ కూడా ముఖ్యం కదా.

Also Read: మీ ఫోన్ మీ సీక్రెట్స్ వింటోందా? ఈ చిన్న గ్యాడ్జెట్‌తో ఆడియో రికార్డింగ్‌కు చెక్ పెట్టండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×