E-Paper
Advertisement

రూ.549 ప్లాన్‌కు ఎయిర్‌టెల్ చెక్.. రేసులోకి రూ.449, రూ.699.. ఏది బెస్ట్ ఛాయిస్?

రూ.549 ప్లాన్‌కు ఎయిర్‌టెల్ చెక్.. రేసులోకి రూ.449, రూ.699.. ఏది బెస్ట్ ఛాయిస్?
Advertisement

Airtel Postpaid: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. తన లైనప్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన రూ. 549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను సైలెంట్ గా తొలగించింది. దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి ఈ ప్లాన్‌ను పూర్తిగా తొలగించారు. ఈ నేపథ్యంలో రూ.549 ప్లాన్ కు ప్రత్యామ్నయంగా ఉన్న ప్లాన్లు ఏవి? వాటిలో దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ? ఈ కథనంలో చూద్దాం.

రూ. 549 ప్లాన్‌ సంగతేంటి?

పోస్ట్ పెయిడ్ విభాగంలో ఎయిర్ టెల్ తీసుకొచ్చి ఈ బడ్జెట్.. యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఈ ప్లాన్ కింద లభించేవి. అంతేకాకుండా నాన్ స్టాప్ 4G, 5G డేటా సౌకర్యం కూడా దీనిలో ఉండేది. వీటితో పాటు అదనపు ప్రయోజనాల కింద 6 నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో, కస్టమర్లు దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న రూ. 449, రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవాల్సి వచ్చింది.

రూ. 449 ప్లాన్ బెనిఫిట్స్

Advertisement

తక్కువ బడ్జెట్‌లో పర్శనల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి రూ. 449 ప్లాన్ మంచి ప్రత్యామ్నాయం. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత 4G, 5G డేటాను ఆస్వాదించవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఉంది. దీంతో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కింద.. ఫ్రాడ్ లింక్ బ్లాకింగ్, స్పామ్ ప్రొటెక్షన్, ఓటీపీ (OTP) అలర్ట్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఈ ప్లాన్‌తో పాటు ఉచితంగా ఎయిర్ టెల్ అందిస్తోంది.

ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్

ఈ ప్లాన్ కింద 6 నెలల అమెజాన్ ప్రైమ్, ఏదాడి పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను ఫ్రీగా అందిస్తున్నారు. వీటితో పాటు గూగుల్ వన్ 100GB స్టోరేజ్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్ బ్యాగ్ ట్రాకింగ్, ఎయిర్‌టెల్ సెక్యూరిటీ ఫీచర్లు యూజర్లకు అందనున్నాయి. ఈ ప్లాన్ కింద ప్రైమరీ మెంబర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇద్దరికీ విడివిడిగా అపరిమిత డేటా, కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఒక్కో సభ్యునికి దాదాపు రూ. 350 చొప్పున ఖర్చు కానుంది.

Advertisement

Also Read: ‘విక్రమ్‌-1’ సక్సెస్ వెనుక తెలుగు కుర్రాళ్లు.. ఆకాశానికెత్తిన మోదీ.. మనోళ్లదే ఇదంతా..!

ఏ ప్లాన్ ఎంచుకుంటే బెటర్?

ఇప్పటివరకు రూ. 549 ప్లాన్ వాడుతూ.. ఇప్పుడు కొత్త ప్లాన్‌కు మారాలనుకునే వారు తమ అవసరాలను బట్టి రూ.449, రూ.699 ప్లాన్ ఎంచుకోవచ్చు. ఓటీటీతో పనిలేకుండా, తక్కువ ధర ప్లాన్ కావాలనుకుంటే రూ. 449 ప్లాన్ బెస్ట్. అలా కాకుండా అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ తో పాటు ఫ్యామిలీ మెంబర్‌ను కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే రూ.699 ప్లాన్ లాభదాయకంగా ఉంటుంది.

Also Read: పోలీసులను వీడియో తీయెుచ్చా? ఫోన్ లాక్కునే హక్కు వారికి లేదా? చట్టం ఏం చెబుతోంది?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×