E-Paper
Advertisement

Airtel Offer: కపుల్స్ కు ఇక పండుగే, కొత్త ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్ టెల్!

Airtel Offer: కపుల్స్ కు ఇక పండుగే, కొత్త ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్ టెల్!
Advertisement

Airtel Infinity Family Plan: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్స్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కొత్త కస్టమర్లను ఆకర్షించేలా ఈ ప్లాన్స్ ను పరిచయం చేస్తుంది. అందులో భాగంగానే సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను పరిచయం చేసింది. ముఖ్యంగా కపుల్స్ కు బాగా ఉపయోగపడే ప్లాన్ ను ఇంట్రడ్యూస్ చేసింది.

కపుల్స్ కోసం ఎయిర్‌టెల్ ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్

భార్యా భర్తలు ఇద్దరూ ఎయిర్‌ టెల్ సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటే, ఈ ప్లాన్ నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎయిర్‌ టెల్ తీసుకొచ్చిన ఈ ప్రత్యేక పోస్ట్‌ పెయిడ్ ప్లాన్ బోలెడు బెనిఫిట్స్ అందిసతుంది. ఇంకా చెప్పాలంటే, జంటలకు ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. ఈ ప్లాన్ తీసుకున్న వాళ్లు ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్, తక్కువ ధరకు పలు OTT ప్లాట్‌ ఫామ్‌ లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో రెండు నంబర్‌లను ఒకే బిల్లు కింద ఉపయోగించుకునే ఫీచర్ కూడా ఉంది.  బడ్జెట్‌ లో ఉంటూనే మరిన్ని ప్రయోజనాలను కోరుకుంటే, ఈ ప్లాన్ ను తీసుకోవడం మంచిది. ఈ ప్లాన్ ధర ఎంత? డేటా ప్రయోజనాలు, ఇతర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రూ. 699తో ఇన్ఫినిటీ ఫ్యామిలీ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్

Advertisement

ఎయిర్‌ టెల్ రూ. 699 ధరతో ఇన్ఫినిటీ ఫ్యామిలీ పోస్ట్‌ పెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఒకే అకౌంట్ కింద రెండు సిమ్ కార్డులను అందిస్తుంది. మీరు ఈ ప్లాన్‌ కు ఇద్దరు కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇకపై అందరికీ ప్రత్యేక బిల్లులను పే చేయాల్సిన అవసరం లేదు. జంటలతో పాటు, ఈ ప్లాన్ వ్యక్తిగత నంబర్‌ తో పాటు ఆఫీస్ నంబర్ కూడా అవసరమైన వారికి కూడా మంచిది. అలా కూడా వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది ఎయిర్ టెల్.

ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి?

ఈ ప్లాన్ దేశం అంతటా అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఇందులో రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్ లు ఉంటాయి. డేటా పరంగా.. ఇది ప్రతి నెలా మొత్తం 105GB డేటాను అందిస్తుంది. మెయిన్ సిమ్ కోసం 75GB, సెకండరీ సిమ్ కోసం 30GB డేటాను అందిస్తుంది. వీడియో స్ట్రీమింగ్, వర్క్ ఫ్రమ్ హోం, లేదంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులకు ఈ డేటా సరిపోతుంది.

ప్లాన్‌ లో ఏ సబ్‌ స్క్రిప్షన్స్ ఉన్నాయి?   

Advertisement

ఎయిర్‌ టెల్ ఎక్స్‌ స్ట్రీమ్ ప్లే ప్రీమియం,  ఒక సంవత్సరానికి అడోబ్ ఎక్స్‌ ప్రెస్ ప్రీమియం, 6 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌ స్క్రిప్షన్,  ఒక సంవత్సరానికి జియో హాట్‌ స్టార్ మొబైల్ ప్లాన్, రీఛార్జ్ చేసిన తర్వాత 100GB క్లౌడ్ స్టోరేజ్‌తో గూగుల్ వన్ లాంటి సబ్‌ స్క్రిప్షన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పూర్తి వివరాల కోసం ఎయిర్ స్టోర్ ను సందర్శించండి. లేదంటే ఎయిర్ టెల్ అధికారిక వెబ్ సైట్ ను చూడండి.

Read Also: వాలెంటైన్స్ డే అదిరిపోయే ఆఫర్స్.. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్‌పై వేలల్లో డిస్కౌంట్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×