E-Paper
Advertisement

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం
Advertisement

Airtel Clarifies: ఎయిర్‌టెల్ తమ అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్లలో హాట్‌స్పాట్ ద్వారా డేటా షేరింగ్‌ను బ్లాక్ చేసిందంటూ గత 2, 3 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో యూజర్లలో గందరగోళం ఏర్పడింది. ఇది నిజమా? కాదా? అన్న కన్ఫ్యూజన్ లో ఎయిర్ టెల్ యూజర్లు పడిపోయారు. ఈ నేపథ్యంలో సదరు టెలికాం సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమిత 5G డేటాను అర్హులైన యూజర్లు వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ వివాదం ఎలా మొదలైంది?

ఎయిర్ టెల్ 5G టర్మ్స్ అండ్ కండిషన్స్ లోని ఓ నిబంధనను తీసుకొచ్చి 5G అపరిమిత సేవలకు ఆపాదించారని ఎయిర్ టెల్ పేర్కొంది. ఆ నిబంధనకు సంబంధించి నెట్టింట పోస్ట్ చేసిన ఓ స్క్రీన్ షాట్.. ఈ గందరగోళానికి దారితీసినట్లు ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి. సదరు నిబంధన.. హాట్ స్పాట్ ద్వారా డేటా షేరింగ్ కు ఏమాత్రం వర్తించదని.. యూజర్లు గందరగోళానికి గురికావాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఎయిర్ టెల్ అధికారికంగా వెల్లడించింది. దీంతో గత రెండ్రోజులుగా జరుగుతున్న ఫేక్ ప్రచారానికి ఎయిర్ టెల్ చెక్ పెట్టినట్లైంది. అటు యూజర్లు సైతం ఎయిర్ టెల్ ఇచ్చిన క్లారిటీతో ఊపిరిపీల్చుకుంటున్నారు.

Advertisement

Also Read: ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

నిబంధన తొలగింపు..

వాస్తవానికి ఫేక్ ప్రచారం జరుగుతున్న సమయంలోనూ ఎయిర్ టెల్ యూజర్లు.. 5G నెట్ వర్క్ ను హాట్ స్పాట్ ద్వారా షేర్ చేసుకున్నారు. ల్యాప్ టాప్, టాబ్లెట్లు, ఇతర మెుబైల్స్ ను హాట్ స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకున్నారు. 5G వాడకం విషయంలో ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొలేదని పలువురు ఎయిర్ టెల్ యూజర్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు వివాదం తలెత్తిన తర్వాత ఎయిర్‌టెల్ తన అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ నిబంధనల నుంచి ఆ నిర్దిష్ట హాట్‌స్పాట్ క్లాజ్‌ను తొలగించింది. కాబట్టి ఈ ప్రచారానికి ముందు హాట్ స్పాట్ ఎలా పనిచేసిందో.. ఇకమీదట కూడా అలాగే డేటా షేరింగ్ ను ఎయిర్ టెల్ అనుమతిస్తుందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×