E-Paper
Advertisement

Air Cooler vs Air Conditioner: సమ్మర్‌లో ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? మీకు ఏది సరైనది!

Air Cooler vs Air Conditioner: సమ్మర్‌లో ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? మీకు ఏది సరైనది!
Advertisement

Air Cooler vs Air Conditioner: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మెుదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీలు, కూలర్ల వైపునకు ప్రజల దృష్టి మళ్లింది. అయితే ఈ వేసవి నుంచి గట్టేక్కేందుకు ఏది కొంటే బెటర్ అన్న సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏసీ లేదా కూలర్ కొంటే లాభనష్టాల గురించి బేరీజు వేసుకుంటున్నారు. అటువంటి వారి కోసం ఈ ప్రత్యేక కథనం అందించడం జరుగుతోంది.

బడ్జెట్ ఆధారంగా

సమ్మర్ లో ఏసీ బెస్ట్ కూలింగ్ ఆప్షన్ అయినప్పటికీ.. బడ్జెట్ పరంగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం మార్కెట్ రూ.25,000 – 75,000 మధ్య ఏసీలు ఉన్నాయి. బడ్జెట్ లో మంచి చల్లదనాన్ని కోరుకునే వారికి కూలర్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. రూ.5,000 – 15,000 మధ్య కూలర్ ధర పలుకుతోంది. కాబట్టి మీ బడ్జెట్, అవసరానికి అనుగుణంగా కూలర్ లేదా ఏసీని ఎంపిక చేసుకోవచ్చు.

నిర్వహణ బట్టి చూస్తే..

Advertisement

ఏసీ కొనడంతో పాటు దాని నిర్వహణ కూడా భారంతో కూడుకున్నది. కొత్త ఏసీని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇన్ స్టాలేషన్ తో పాటు నిర్వహణ కోసం నిపుణుల సాయం అవసరం. వార్షిక సర్వీసింగ్ వల్ల అదనపు భారం పడుతుంది. అదే ఎయిర్ కూలర్ తక్కువ ధరకు లభించడంతో పాటు సులభంగా వాడుకోవచ్చు. కూలర్ లోకి నీరు పోసి ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే కూలింగ్ ప్రక్రియ మెుదలైపోతుంది. ఒక గది నుంచి మరో గదికి సులభంగా తరలించుకోగలగడం కూలర్ కు ఉన్న మరో అడ్వాంటేజ్.

రోజుకు రూ.150.. నెలకు రూ.4,500!

కూలర్ తో పోలిస్తే ఏసీ అధిక మెుత్తంలో విద్యుత్ ను వినియోగిస్తుంది. 1 టన్ AC గంటపాటు పనిచేయాలంటే 1.5 KW విద్యుత్ అవసరమవుతుంది. అంటే దాదాపు 1.5 యూనిట్ల పవర్ ను ఖర్చు అవుతుంది. మీరు ఒక ఏసీని రోజుకు 10 గంటల పాటు వినియోగిస్తే 15 యూనిట్ల విద్యుత్ వినియోగింపబడుతుంది. ఉదాహరణకు ఒక యూనిట్ ఖర్చు రూ.10 అనుకుంటే రోజుకు రూ.150 ఒక్క ఏసీకే ఖర్చు అవుతుంది. నెలకు రూ.4,500 వరకూ ఏసీ కోసం సమర్పించాల్సి ఉంటుంది.

కూలర్‌‌తో రూ.18 మాత్రమే..

Advertisement

ఎయిర్ కూలర్ విషయానికి వస్తే.. ఇది గంటకు 0.18 యూనిట్ల విద్యుత్ ను వినియోగిస్తుంది. ఒక యూనిట్ ఖర్చు రూ.10 అనుకుంటే రోజుకు రూ.18 చెల్లిస్తే సరిపోతుంది. నెలకు వచ్చే సరికి రూ.540 ఖర్చు అవుతుంది. కాబట్టి విద్యుత్ వినియోగం పరంగా చూస్తే కూలర్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

ఆరోగ్యపరంగా ఏది బెస్ట్..

ఎయిర్ కూలర్లను సరిగ్గా ఉపయోగించకపోతే ఎయిర్ కూలర్ల కంటే అరోగ్యానికి ఎక్కువ హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీలో ఎక్కువ సేపు ఉంటే చర్మం, కళ్లు, గొంతు పొడి బారడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. గదిలోని గాలిని రీసైక్లింగ్ చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం కావొచ్చు. వీటితో పోలిస్తే ఎయిర్ కూలర్ కాస్త బెటర్ అయినవిగా నిపుణులు చెబుతున్నారు. కూలర్లు స్వచ్ఛమైన గాలిని ఉపయోగించి గదిని చల్లబరుస్తాయి. గది వాతావరణానికి తేమను జోడిస్తాయి. అయితే కూలర్లను సైతం క్రమం తప్పకుండా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోయి అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

Also Read: Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?

ఓవరాల్‌‌గా ఏది మంచిది?

బడ్జెట్, తక్కువ నిర్వహణ ఖర్చు, పరిమితమైన విద్యుత్ వినియోగం, ఆరోగ్యకరమైన గాలిని కోరుకునే వారు ఎయిర్ కూలర్ సరైన ఎంపికగా నిలుస్తోంది. అయితే కూలర్ల నిర్వహణలో మానవ ప్రమేయం అధికంగా ఉంటడం వల్ల వృద్ధులు, పిల్లలకు కష్టంగా మారొచ్చు. ఇక బడ్జెట్ తో సంబంధం లేకుండా ఈ సమ్మర్ లో మరింత కూల్ గా ఉండాలని భావించే వారు నేరుగా ఏసీని కొనుగోలు చేయవచ్చు. కూలర్లతో పోలిస్తే ఇది సౌకర్యాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి.

Also Read: Summer Best AC: సమ్మర్‌ను చల్లగా మార్చే.. వర్ల్‌పూల్ 3D Cool Pro+ ఏసీ.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు బ్రో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×