E-Paper
Advertisement

Air Cooler Tips 2026: కూలర్‌తో ఏసీ రేంజ్ చల్లదనం కావాలా? ఈ 6 చిట్కాలు ఫాలో అయిపోండి!

Air Cooler Tips 2026: కూలర్‌తో ఏసీ రేంజ్ చల్లదనం కావాలా? ఈ 6 చిట్కాలు ఫాలో అయిపోండి!
Advertisement

Air Cooler Tips 2026: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మెుదలయ్యాయి. దీంతో కాస్త బడ్జెట్ ఉన్న వాళ్లు ఏసీలను కొనుగోలు చేస్తుంటే.. అంతగా ఆర్థిక స్తోమత లేని వారు కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ కూలర్ ద్వారా వేసవిలో మంచి కూలింగ్ పొందడానికి, అతి సమర్థవంతంగా అది పనిచేయడానికి దోహదం చేసే సులభమైన 6 చిట్కాలను ఇక్కడ అందించడం జరుగుతోంది. దీనిని పాటించడం ద్వారా ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా గడిపేయవచ్చు.

సరైన చోట ఉంచడం..

కూలర్ ను ఉంచే ప్రదేశాన్ని బట్టి కూడా దాని పనితీరు ఆధారపడి ఉంటుంది. కూలర్ ను ఎప్పుడైన గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి. మరీ ముఖ్యంగా కిటికీ దగ్గర లేదా తలుపు ఉన్న ప్రదేశంలో ఉంచితే బెటర్. అలా చేయడం ద్వారా గదిలోని వేడి గాలిని బయటకు పంపడం తేలిగ్గా మారుతుంది. లేదంటే గదిలో తేమ (Humidity) పెరిగి గాలి ఉమ్మరంగా లేదా ఉక్కగా అనిపిస్తుంది.

ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ ప్యాక్స్

Advertisement

కూలర్ ను మెజారిటీ ప్రజలు సాధారణ నీటితో వినియోగిస్తుంటారు. అలా కాకుండా మెరుగైన చల్లదనం కావాలనుకుంటే ఆ నీటిలో ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ ప్యాక్ వేయండి. ఇది గాలిని తక్షణమే చల్లబరచడానికి దోహదం చేస్తుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి. ఐస్ క్యూబ్స్ లేదా ప్యాక్స్ కరిగిపోయిన వెంటనే చల్లదనంలో మార్పులు రావొచ్చు.

ప్యాడ్లను శుభ్రంగా ఉంచడం.

కూలర్‌లోని ప్యాడ్లు పాతబడినా లేదా వాటిలో దుమ్ము, ఉప్పు పేరుకుపోయినా చల్ల గాలి సరిగ్గా రాదు. మీ దగ్గర పాత కూలర్ ఉంటే సీజన్ ప్రారంభంలోనే ప్యాడ్లను ఒకసారి నీటితో శుభ్రం చేయండి. మరీ పాడైపోయి ఉంటే కొత్తవి మార్చడం ఉత్తమం. లేదంటే మీరు ఆశించిన చల్లదనాన్ని కూలర్లు అందిచలేవు.

నీటిని తరుచూ మార్చడం

Advertisement

కొందరు ట్యాంక్ లోని నీటిని అలాగే వదిలేస్తుంటారు. ముఖ్యంగా ఇతర ఊర్లకు వెళ్లిన సమయంలో నీటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావొచ్చు. కాబట్టి ప్రతీ 2-3 రోజులకు ఒకసారి కూలర్ లోని నీటి ట్యాంక్ ను శుభ్రం చేసుకుంటే మంచిది. ట్యాంక్ ను పూర్తిగా ఖాళీ చేసి.. శుభ్రమైన నీటిని అందులో పోయడం ద్వారా సమ్మర్ లో చల్లగానూ, ఆరోగ్యంగానూ ఉండవచ్చు.

పంపు – ఫ్యాన్‌ను చెక్ చేయండి

కూలర్ కు అమర్చిన నీటి పంపు (Water Pump) ప్యాడ్లకు నీటిని సమానంగా పంపిస్తుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. పంపులో అడ్డంకులు ఉంటే వెంటనే క్లీన్ చేయండి. అలాగే ఫ్యాన్ రెక్కల మీద పేరుకుపోయిన దుమ్మును తుడవండి. దీనివల్ల గాలి ప్రవాహం (Airflow) మెరుగుపడుతుంది.

Also Read: AC Electricity Bill: ఏసీని అతిగా వాడేస్తున్నారా? నో ప్రాబ్లం.. ఈ టిప్స్‌తో పవర్ బిల్ తగ్గించుకోండి!

క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరి

కూలర్ ఉంచిన గదిలో వెంటిలేషన్ (గాలి, రాకపోకలకు మార్గం) ఉండేలా చూడండి. కూలర్ చల్లగాలిని లోపలికి పంపినప్పటికీ.. గదిలోని వేడి గాలి బయటకు పోకపోతే టెంపరేచర్ హాయిగా అనిపించదు. కాబట్టి గదిలో మరొక కిటికీని లేదా వెంటిలేటర్‌ను కొద్దిగా తెరిచి ఉంచితే గాలి బయటకు పోయి గది ఎప్పుడూ తాజాగా, చల్లగా ఉంటుంది.

Also Read: Washing Machine: వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నారా? ఈ 10 సెకన్ల టెస్ట్ చేయండి.. లేదంటే నష్టపోతారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×