E-Paper
Advertisement

రోజుకు 14-15 గంటలు కూలర్ వాడితే.. పవర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

రోజుకు 14-15 గంటలు కూలర్ వాడితే.. పవర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Air Cooler: వేసవిలో కూలర్లకు ఉండే డిమాండ్ అందరికీ తెలిసిందే. ఏసీ కంటే తక్కువ ధరలో లభించే కూలర్లను సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున వినియోగిస్తుంటారు. అయితే కూలర్ ను అతిగా వినియోగిస్తే.. విద్యుత్ బిల్లు ఎంత వస్తుందోనన్న భయం చాలామందిలో సహజంగానే ఉంటుంది. కాబట్టి రోజుకు 14 లేదా 15 గంటల పాటు కూలర్ ను వాడారని భావిస్తే.. పవర్ బిల్లు ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కూలర్ విద్యుత్‌ వినియోగం ఎంత?

ప్రస్తుతం మార్కెట్లో ప్రధానంగా రెండు వేరియంట్లలోని కూలర్లను ప్రజలు ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి డెజర్ట్ కూలర్లు (Desert Coolers) కాగా, రెండోది పర్సనల్ కూలర్లు (Personal Coolers). సాధారణంగా డెజర్ట్ కూలర్లు.. 180 నుంచి 250 వాట్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదే పర్సనల్ కూలర్స్ అయితే.. 100 నుంచి 150 వాట్స్ విద్యుత్ ను వినియోగిస్తుంటాయి.

రోజూవారి విద్యుత్ వినియోగం

Advertisement

పై లెక్కలను బట్టి సగటున ఒక కూలర్ గంటకు 220 వాట్స్ సామర్థ్యంతో పనిచేస్తే.. గంటకు 0.22 యూనిట్స్ విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే 14 గంటల పాటు పనిచేసిందని భావిస్తే 3.08 యూనిట్స్, 15 గంటలకు 3.30 యూనిట్ విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ రూ.6-7 ఉందని భావిస్తే.. 14 గంటలకు సుమారు రూ.21-24, 15 గంటలకు రూ.24-27 భారం పడుతుంది.

నెలవారీ విద్యుత్ ఖర్చు..

నెల లెక్కన తీసుకుంటే.. 220 watts సామర్థ్యం కలిగిన కూలర్ రోజుకు 14 గంటల చొప్పున 30 రోజులకు 92.4 యూనిట్ల విద్యుత్ ను ఖర్చు చేస్తుంది. 15 గంటల పరంగా చూస్తే 99 యూనిట్ వినియోగించుకుంటుంది. ఈ లెక్కన యూనిట్ ధర రూ.6-7 అనుకుంటే నెల పూర్తయ్యే సరికి రూ.600-650 మధ్య విద్యుత్ బిల్లు రావొచ్చు. దీన్నిబట్టి కూలర్ కోసమే రూ.700 వరకూ నెలకు పక్కన పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: 5 Star vs Inverter AC: మీకూ ఇదే డౌటా.. రెండిట్లో ఏది బెటరో.. పిచ్చక్లారిటీతో తెలుసుకోండి మచ్చా!

విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలంటే?

అయితే కూలర్ విషయంలో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా విద్యుత్ బిల్లును చాలా వరకూ తగ్గించుకోవచ్చు. కూలర్ ను ప్రతి 6-8 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం ద్వారా అది సమర్థవంతంగా పనిచేసి.. అధిక విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది. కూలర్ ను గరిష్ట వేగంతో కాకుండా మీడియం స్పీడ్ తో ఉపయోగిస్తే పవర్ ను ఆదా చేయవచ్చు. మరోవైపు నీటి ట్యాంకును నిండుగా నింపితే అది.. మోటారుపై భారాన్ని పెంచొచ్చు. కాబట్టి 70-80 శాతం నీరు మాత్రమే పోసి వినియోగిస్తే మంచిది. రాత్రివేళ సీలింగ్ ఫ్యాన్ తో పాటు కూలర్ ను ఆన్ చేస్తే బెటర్. కూలర్ కు టైమర్ సెట్ చేసి.. ఒక నిర్దిష్ట సమయానికి ఆగిపోయేలా చేయడం ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించుకోవచ్చు.

Also Read: ఏసీ, కూలర్ కాంబినేషన్.. ఒక్కసారి రెండూ ఆన్ చేసి చూడండి.. ఆ తర్వాత జరిగేది అస్సలు నమ్మలేరు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×