E-Paper
Advertisement

AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!

AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!
Advertisement

AC Buying Guide 2026: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో పలువురు దృష్టి ఏసీలపైకి మళ్లింది. మార్కెట్ లోని మంచి ఏసీల కోసం తెగ వెతుకుతున్నారు. అయితే ఏసీలను కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. లేదంటే భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ కీలక విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గది పరిమాణం

ఏసీ కొనే ముందు దానిని అమర్చాల్సిన గది పరిమాణాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. గది పరిమాణం పెరిగే కొద్ది ఏసీ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కు 80-120 చదరపు అఢుగుల గదికి 1 టన్ ఏసీ సరిపోతుంది. అలాగే 1.5 టన్ (120 – 180 sq.ft), 1.8 – 2 టన్ (180 – 240 sq.ft), 2.5 – 3 టన్ (240 – 300+ sq.ft) ఏసీలను గది సామర్థ్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

Inverter vs non-inverter AC

Advertisement

ఇన్వర్టర్ ఏసీలు కూలింగ్ డిమాండ్ ఆధారంగా కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. కొనే ముందు వీటి ధర ఎక్కువ అనిపించినా.. నిర్వహణను మాత్రం తెలిక చేస్తాయి. ఎక్కువ సమయం ఏసీపై ఆధారపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇక నాన్ ఇన్వర్టర్ ఏసీలు.. స్థిర వేగంతో పనిచేస్తాయి. కూలింగ్ అవసరమైనప్పుడు కంప్రెసర్ ఆన్ అవుతుంది. అనంతరం కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇది అధిక విద్యుత్ వినియోగం, కూలింగ్ లో అసమానతలకు దారితీస్తుంది.

ఏసీ స్టార్ రేటింగ్స్..

ఏసీకి ఉండే స్టార్ రేటింగ్స్.. అది ఎంత శక్తి వంతమైనదో సూచిస్తుంది. ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీలు.. సమర్థవంతంగా పనిచేయడంతో పాటు తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. ప్రస్తుతం భారత్ లో 1 స్టార్ నుంచి 5 స్టార్ వరకూ రేటింగ్ ఉన్న ఏసీలు ఉన్నాయి. 5 స్టార్ ఏసీ ఖరీదు ఎక్కువ అయినప్పటికీ తక్కువ రేటింగ్ ఏసీలతో పోలిస్తే విద్యుత్ బిల్లును చాలా వరకు పరిమితం చేస్తుంది.

Split AC vs Window AC

Advertisement

ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్ప్లిట్ ఏసీలనే కొనుగోలు చేస్తున్నారు. ఇవి శబ్దం తక్కువ చేయడంతో ఆకర్షణీయమైన లుక్ ను కలిగి ఉంటాయి. సమర్థవంతమైన కూలింగ్ టెక్నాలజీతో మార్కెట్ లో లభిస్తున్నాయి. ఇక విండో ఏసీ విషయానికి వస్తే.. వీటి ఇన్ స్టాలేషన్ చాలా సులభం. పైగా స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే ధర కాస్త తక్కువ. కానీ అధిక శబ్దం ప్రధాన సమస్యగా చెబుతుంటారు.

ఇండోర్ ఎయిర్ క్వాలిటీ (IAQ)

ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించాల్సిన మరో ముఖ్యమైన అంశం గాలి నాణ్యత. కొత్త ఏసీలో శుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలిని అందించే HEPA లేదా PM2.5 ఫిల్టర్లు, అయోనైజర్లు, UV స్టెరిలైజేషన్ ఆటో – క్లీన్ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి.

కాపర్ vs అల్యూమినియం కాయిల్స్

ప్రస్తుతం మార్కెట్ లోని ఏసీలు కాపర్, అల్యూమినియం కాయిల్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 100 శాతం కాపర్ కాయిల్స్ ఉన్నవి ఎంచుకుంటే బెటర్. ఇవి ఎక్కువ హీట్ ను కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తాయి. అల్యూమినియం కాయిల్స్ తో పోలిస్తే.. వీటికి తుప్పు సమస్య తక్కువ. అలాగే లాంగ్ లైఫ్ సర్వీసును ఈ కాపర్ కాయిల్స్ అందిస్తాయి.

Also Read: Air Cooler vs Air Conditioner: సమ్మర్‌లో ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? మీకు ఏది సరైనది!

ఏసీలోని స్మార్ట్ ఫీచర్లు..

ఈ రోజుల్లో, Samsung , LG, Havells ఇతర పెద్ద బ్రాండ్లు స్మార్ట్ ఫీచర్లతో కూడిన వివిధ రకాల ఏసీలను అందిస్తున్నాయి. ఈ ACలు మీ సౌకర్యానికి అనుగుణంగా కూలింగ్ ను ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాయి. ప్రోగ్రామబుల్ టైమర్‌లు, స్మార్ట్ యాప్ కంట్రోల్, Wi-Fi కనెక్టివిటీ, ఏఐ ఆధారిత వాతావరణ ఆప్టిమైజేషన్, ప్రిడిక్టివ్ కూలింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కొత్త ఏసీలో ఉండేలా జాగ్రత్త పడండి.

Also Read: Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×