E-Paper
Advertisement

Apple : ‘బాధ్యతగా వ్యవహరించండి, అలా జరిగితే చాలా ప్రమాదం!’ – యాపిల్​పై ప్రముఖ మీడియా ఫైర్..​!!

Apple : ‘బాధ్యతగా వ్యవహరించండి, అలా జరిగితే చాలా ప్రమాదం!’ – యాపిల్​పై ప్రముఖ మీడియా ఫైర్..​!!
Advertisement

Apple : ఆలస్యంగానైనా యాపిల్‌ సంస్థ కృత్రిమ మేధ సమ్మేళనానికి నడుం బిగించి, తమదైన యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ యాపిల్​ ఏఐ ఫిర్యాదును ఎదుర్కొంది. యాపిల్​ ఇంటెలిజెన్స్ ఫీచర్​ను తొలిగించాలంటూ యాపిల్​ను, రిపోర్టర్స్​ వితౌట్​ బోర్డర్స్​ (ఆర్​ఎస్​ఎఫ్​) అనే ప్రెస్ ఫ్రీడమ్​ ఆర్గనైజేషన్ కోరింది. ఎందుకంటే? రీసెంట్​గానే యాపిల్ ఏఐ ఇంటెలిజెన్స్ ఫీచర్స్​.. తన సమ్మరైజెస్​ న్యూస్ స్టోరీస్​లో ఫాల్స్​ న్యూస్ హెడ్​లైన్స్​ను చూపించింది. బీబీసీ రిపోర్ట్​ చేసిన కథనానికి, సమ్మరైజ్డ్​ న్యూస్ స్టోరీస్​లో తప్పుడు హెడ్​లైన్​ను జనరేట్​ చేసింది.

ఇంతకీ ఆ తప్పుడు కథనం ఎంటంటే? – రీసెంట్​గానే అమెరికా (USA)లో ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థ యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ (United Health Care CEO) హత్య కేసు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో హిల్టన్‌ హోటల్ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో బ్రియాన్‌ ప్రాణాలు కోల్పోయారు. బీబీసీ ఈ కథనాన్ని ప్రచురించింది. అయితే బీబీసీ ప్రచురించిన ఈ కథనానికి సంబంధించిన పుష్ నోటిఫికేషన్​ను యాపిల్ ఏఐ టూల్​ ఇచ్చింది. అయితే ఇందులో బ్రియాన్ షాట్ హిమ్​సెల్ఫ్​ (తనకు తానే కాల్చుకున్నట్లు) తప్పుగా అని చూపించింది. ఆ తర్వాత యాపిల్​ ఏఐ పుష్​ చేసిన ఈ తప్పుడు హెడ్​లైన్​ను గుర్తించిన బీబీసీ, యాపిల్​కు ఈ విషయాన్ని తెలిపింది.

Advertisement

అయితే రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఆర్​ఎస్​ఎప్​ టెక్నాలజనీ అండ్ జర్నలిజం డెస్క్​ చీఫ్​ విన్​సెంట్​ బెర్​థియర్​, ఈ తప్పుడు హెడ్​లైన్​ విషయమై యాపిల్​కు ఓ సూచన చేశారు. బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ ఏఐ ఫీచర్​ను తొలిగించాలని కోరారు.

“AIలు ప్రాబబిల్టీ యంత్రాలు. అందుకే వాస్తవాలను డైస్​ రోల్​ ద్వారా నిర్ణయించలేము. మీడియా సమాచారాన్ని ఆటోమేటెడ్​గా ప్రచురించడం, మీడియా విశ్వసనీయతను దెబ్బ తీస్తుంది. పైగా విశ్వసనీయ సమాచారాన్ని, ప్రజల హక్కును ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ కొత్త A.I ద్వారా జర్నలిస్ట్ సంఘం మీడియాకు ఎదురయ్యే ప్రమాదాల గురించి చాలా ఆందోళన చెందుతోంది. ప్రజల కోసం నమ్మదగిన సమాచారాన్ని అందించడానికి ఏఐ సరిగ్గా లేదు. కాబట్టి ఇటువంటి ఏఐని మార్కెట్లో అనుమతించకూడదు” అని విన్​సెంట్ అన్నారు.

Advertisement

అంతకుముందు కూడా యాపిల్​ ఏఐ టూల్​ మరో కాంట్రవర్సీలోనూ ఇరుక్కుంది. ఈ ఏఐ సమ్మరైజేషన్​ న్యూస్​లో ఇజ్రాయెల్​ ప్రైమ్​మినిస్టర్​ బెంజమిన్ నెతాన్యహు అరెస్ట్​ అయినట్లు చూపించింది. కానీ వాస్తవానికి ఇంటర్నేషన్ క్రిమినల్ కోర్ట్​ బెంజమిన్​పై వారంజ్ మాత్రమే జారీ చేసింది. అయితే దీనినే యాపిల్ ఏఐ అరెస్ట్ అయినట్లు తప్పుగా చూపించి ఇరకాటంలో పడింది. ఏదేమైనా యాపిల్​ మాత్రం ఈ ఫిర్యాదులపై అధికారికంగా స్పందించలేదు.

ఇక యాపిల్ త్వరలోనే తీసుకురాబోతున్న లేటెస్ట్ గ్యాడ్జెట్స్ లో సైతం సొంత యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ను వాడాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే నిర్ణయాన్ని ఇప్పటికే యాపిల్ వర్గాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వీటిపై వస్తున్న ఫిర్యాదులతో యాపిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ALSO READ : దుమ్మురేపుతున్న క్రిస్మస్ డీల్స్.. ఆఫర్స్ మామ్మూలుగా లేవుగా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×