E-Paper
Advertisement

కొత్త ఏసీ కొంటున్నారా? ఏఐ ఏసీ vs నార్మల్ ఏసీ.. ఏది బెస్ట్ ఛాయిస్?

కొత్త ఏసీ కొంటున్నారా? ఏఐ ఏసీ vs నార్మల్ ఏసీ.. ఏది బెస్ట్ ఛాయిస్?
Advertisement

AI Split AC vs Normal Split AC: జూన్ నెల వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇళ్లల్లో ఏసీల వాడకం ఇంకా కొనసాగుతోంది. అయితే కొత్తగా ఏసీ కొనాలనుకునే వారికి ప్రస్తుతం ఓ ప్రశ్న ప్రధానంగా వెంటాడుతోంది. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న లేటెస్ట్ ‘ఏఐ స్ప్లిట్ ఏసీ’ కొనాలా? లేదా ఎప్పటినుంచో వాడుతున్న ‘నార్మల్ స్ప్లిట్ ఏసీ’ సరిపోతుందా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండింటిలో ఏది బెస్ట్? విద్యుత్ ను ఏ ఏసీ బాగా ఆదా చేస్తుంది? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ధరల్లో చాలా తేడా

సాధారణ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే ఏఐ ఏసీల ధరలు కాస్త ఎక్కువనే చెప్పాలి. వీటిల్లో ఉండే అడ్వాన్స్‌డ్ సెన్సార్లు, స్మార్ట్ ఫీచర్ల వల్ల బడ్జెట్ కాస్త భారంగా అనిపించొచ్చు. కాబట్టి తక్కువ బడ్జెట్‌లో ఏసీ కొనాలనుకునే వారికి నార్మల్ స్ప్లిట్ ఏసీలే ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కరెంట్ బిల్లు ఆదా

Advertisement

విద్యుత్ ఆదా పరంగా చూస్తే ఏఐ ఏసీలు ముందంజలో ఉన్నాయి. నార్మల్ ఏసీలు మనం సెట్ చేసిన టెంపరేచర్ ప్రకారమే నడుస్తాయి. కానీ ఏఐ ఏసీలు గదిలో ఎంతమంది ఉన్నారు? బయట వాతావరణం ఎలా ఉంది? నిద్రపోయే విధానం ఏంటి? అనే విషయాలను అర్థం చేసుకొని.. దానికి అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని దానంతట అదే మార్చుకుంటాయి. ఫలితంగా సాధారణ ఏసీల కంటే దాదాపు 15 శాతం నుండి 20 శాతం వరకు కరెంట్ బిల్లును ఆదా చేస్తాయి.

రోజూవారీ వాడకానికి..

నార్మల్ ఏసీల్లో రిమోట్‌తో పదే పదే టెంపరేచర్ మార్చాల్సి వస్తుంది. రాత్రి పూట చలిగా అనిపిస్తే లేచి ఆఫ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏఐ ఏసీలు చాలా ప్రాక్టికల్ గా పనిచేస్తాయి. వ్యక్తులు గదిలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా పవర్ తగ్గించుకోవడం, వాతావరణానికి తగ్గట్టు కూలింగ్ ఇవ్వడం వంటివి ఇవి వాటంతట అవే చేస్తాయి. అంతేకాదు వీటిని వై-ఫై సపోర్ట్‌తో ఫోన్ ద్వారా ఎక్కడి నుండైనా కంట్రోల్ చేయవచ్చు.

Advertisement

Also Read: కళ్లు చెదిరేలా సికింద్రాబాద్ స్టేషన్ మేకోవర్, వరల్డ్ క్లాస్ ట్రాన్స్‌ పోర్ట్ హబ్‌ గా అభివృద్ధి!

ఫైనల్గా ఏది కొంటే బెటర్?

రోజుకు 8 నుండి 10 గంటలు ఏసీ వాడేవారైతే ఏఐ ఏసీ బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి ఏఐ స్ప్లిట్ ఏసీ కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్ అని స్పష్టం చేస్తున్నారు. అలాకాకుండా ఏసీ వాడకం తక్కువగా ఉండి.. బడ్జెట్ పరిమితులు ఉంటే నేరుగా నార్మల్ స్ప్లిట్ ఏసీని తీసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. మీ అవసరం, అభిరుచికి రెండింట్లో సరిగ్గా మ్యాచ్ అయ్యే దానిని మీరే ఎంచుకోండి.

Also Read: సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×