E-Paper
Advertisement

Ai+ Nova 2 సిరీస్ రిలీజ్, రూ. 8,999 కే 6000mAh బ్యాటరీ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?

Ai+ Nova 2 సిరీస్ రిలీజ్, రూ. 8,999 కే 6000mAh బ్యాటరీ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?
Advertisement

Ai+ Nova 2 Ultra 5G: హే గాయ్స్. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉండే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా ? అయితే Ai+ నుంచి వచ్చిన లేటెస్ట్ Nova 2 సిరీస్ పై ఒక  లుక్కేయండి. 6,000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, ఇంకా స్టైలిష్ లుక్.. అబ్బో. ఫీచర్లు వింటేనే పిచ్చెక్కిపోతుంది. తక్కువ ప్రైస్ లోనే గెమింగ్ , మల్టీ టాస్కింగ్‌‌కి సెట్ అయ్యేలా ఈ ఫోన్లను డిజైన్ చేశారు. ముఖ్యంగా.. కాలేజీ స్టూడెంట్స్, ఎక్కువగా ఫోన్ వాడే వారికి ఇది క్రేజీ అప్‌డేట్ అనే చెప్పాలి. ఈ ఫోన్లలో ఏది బెస్ట్ ? ధర ఎంత ? అనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Ai+ Nova 2 సిరీస్ లాంచ్: బడ్జెట్ ధరలో ఫీచర్ల జాతర!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తూ Ai+ Nova 2 5G, Ai+ Nova 2 Ultra 5G మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

Advertisement

అదిరిపోయే డిస్ప్లే, పర్ఫార్మెన్స్:
Nova 2 Ultra 5G: ఇందులో 6.78-ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ , 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్‌తో గేమింగ్ , మూవీ ఎక్స్‌ పీరియన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఇది MediaTek Dimensity 7400 చిప్‌ సెట్‌తో వస్తుంది.

Nova 2 5G: బేస్ మోడల్‌లో 6.745-ఇంచ్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. దీనిలో Unisoc T8200 చిప్‌సెట్‌ను వాడారు.

Advertisement

6,000mAh బ్యాటరీ బీస్ట్:
ఈ సిరీస్ లోని ప్రధాన హైలైట్ బ్యాటరీ. రెండు ఫోన్ల లోనూ 6,000mAh భారీ బ్యాటరీని అందించారు. అల్ట్రా మోడల్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ మోడల్ 18W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. చార్జింగ్ త్వరగా అయిపోతుందనే టెన్షన్ లేకుండా రోజంతా వాడుకోవచ్చు.

కెమెరా క్లారిటీ:
ఫోటో గ్రఫీ ఇష్టపడే వారి కోసం 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను జత చేశారు. అల్ట్రా మోడల్‌లో సోనీ IMX752 సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కూడా ఉంది. దీని వల్ల ఫోటోలు , వీడియోలు స్పష్టంగా వస్తాయి. దీనిలో అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా , 13MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి.

Also Read: ఛార్జింగ్ టెన్షన్ ఇక లేదు! వారం రోజుల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఇచ్చే బెస్ట్ హెడ్‌ఫోన్స్

ధర :
Ai+ ఈ ఫోన్లను అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే ఉంచింది.

Ai+ Nova 2 5G: దీని ధర రూ. 8,999 (4GB+64GB) నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 14 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయి.

Ai+ Nova 2 Ultra 5G: దీని బేస్ వేరియంట్ (6GB+128GB) ధర రూ. 16,999. ఏప్రిల్ 17 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

ఇవి బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ వంటి ఐదు అద్భుత మైన రంగుల్లో లభిస్తాయి. ఐపి64 (IP64) రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము , నీటి తుంపర్ల నుంచి రక్షణ లభిస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×