E-Paper
Advertisement

వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు ఆదా, ఇల్లూ ప్రశాంతం!

వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు ఆదా, ఇల్లూ ప్రశాంతం!
Advertisement

Rainy Season AC Tips: ఎండకాలం ముగిసి వర్షాలు పడుతుంటే వాతావరణం చల్లబడుతుంది కానీ, దాంతో పాటే ఇంట్లో జిగటగా, ఉక్కపోతగా అనిపిస్తుంది. బయట ఉష్ణోగ్రత తగ్గినా, గాలిలో తేమ (హ్యుమిడిటీ) పెరిగిపోవడం వల్ల ఇల్లంతా కాస్త అసౌకర్యంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఎండకాలంలో వాడినట్టే ఏసీని వాడితే గది సరిగ్గా చల్లబడదు సరే కదా.. కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. అందుకే వర్షాకాలంలో ఏసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం అవసరం.

డ్రై మోడ్‌తో జిగట వాతావరణానికి చెక్:

వర్షాలు పడేటప్పుడు గదిలోని జిగటదనాన్ని వదిలించుకోవడానికి Dry Mode అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ కూలింగ్ మోడ్ కంటే ఈ మోడ్‌ను ఆన్ చేయడం వల్ల ఏసీ గదిలోని అదనపు తేమను పూర్తిగా లాగేస్తుంది. దీనివల్ల గది చల్లగా అవ్వడమే కాకుండా.. చాలా ఫ్రెష్‌గా మారుతుంది. పైగా ఇది నార్మల్ మోడ్ కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది.

Advertisement

Also Read: Samsung మెగా సేల్ షురూ.. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌, రూ.99కే మూడేళ్ల వారంటీ!

ఆటో ఫ్యాన్ స్పీడ్, స్వింగ్ ఫీచర్:

ఈ సీజన్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఫ్యాన్ స్పీడ్‌ను Autoలో పెట్టడం మంచిది. ఇది గదిలోని తేమ, ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాన్ వేగాన్ని దానంతట అదే సర్దుబాటు చేస్తుంది. అలాగే Swing Mode ఆన్ చేయడం వల్ల చల్లటి, పొడిగాలి గదిలోని అన్ని మూలలకూ సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీపై అదనపు భారం పడదు.

రాత్రి పూట స్లీప్ మోడ్ లేదా టైమర్:

Advertisement

వర్షాకాలంలో రాత్రులు చాలా చల్లగా ఉంటాయి. కాబట్టి రాత్రంతా ఏసీ ఒకే కూలింగ్‌లో నడవాల్సిన అవసరం లేదు. ఏసీలోని Sleep Mode ఆన్ చేస్తే, అది రాత్రి గడిచేకొద్దీ ఉష్ణోగ్రతను కొద్దికొద్దిగా పెంచుతూ మన శరీరానికి తగినట్టుగా సర్దుబాటు చేస్తుంది. లేదా కొన్ని గంటల తర్వాత ఆగిపోయేలా Timer పెట్టుకుంటే నిద్రకు ఇబ్బంది లేకుండా కరెంట్ ఆదా అవుతుంది.

టర్బో మోడ్‌కు దూరంగా ఉండాలి:

గదిని త్వరగా చల్లబరిచే Turbo లేదా Powerful Mode కేవలం మే నెల ఎండలకే పనికొస్తుంది. వర్షాకాలంలో దీని అవసరం అస్సలు ఉండదు. ఈ మోడ్‌ను ఆన్ చేయడం వల్ల గది మరీ ఎక్కువ చల్లగా అయిపోయి ఇబ్బంది పెట్టడమే కాకుండా.. కరెంట్ విపరీతంగా కాలిపోతుంది. అందుకే ఈ సీజన్‌లో టర్బో మోడ్‌ను వాడకపోవడమే మంచిది.

Also Read: YouTubeను సోషల్ మీడియాగా మార్చే భారీ ప్లాన్.. ఇక యాప్‌లోనే చాటింగ్, వీడియో షేరింగ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×