E-Paper
Advertisement

ఏసీ సర్వీసింగ్ చేయిస్తున్నారా? టెక్నీషియన్లు చెప్పే ఈ అబద్ధాలతో జాగ్రత్త.. లేదంటే కొంప ముంచుతారు!

ఏసీ సర్వీసింగ్ చేయిస్తున్నారా? టెక్నీషియన్లు చెప్పే ఈ అబద్ధాలతో జాగ్రత్త.. లేదంటే కొంప ముంచుతారు!
Advertisement

AC servicing tips: రోజు రోజుకీ ఎండలు ముదిరిపోతుండటంతో ప్రతి ఇంట్లో ఏసీల వాడకం పెరిగిపోయింది. ఈ తరుణంలో చాలామంది తమ ఏసీలను సర్వీసింగ్ చేయిస్తుంటారు. అయితే, సర్వీసింగ్ కోసం వచ్చే కొందరు టెక్నీషియన్లు ఏసీ చూడగానే ‘సార్.. గ్యాస్ అయిపోయింది, వెంటనే రీఫిల్ చేయించాలి’ అని చెబుతుంటారు. గాలి చల్లగా రాదనే భయంతో మనం కూడా వెనుకాడకుండా వేలకు వేలు ఇచ్చేస్తుంటాం. కానీ, నిజంగానే ఏసీలో గ్యాస్ అంత త్వరగా అయిపోతుందా? అసలు ఈ ఫాంటమ్ గ్యాస్ లీక్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజంగానే ఏసీ గ్యాస్ అయిపోతుందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏసీలో ఉండే రిఫ్రిజిరెంట్ (గ్యాస్) అనేది దానంతట అదే ఎప్పటికీ అయిపోదు. పైపుల్లో గానీ, కాయిల్స్‌లో గానీ ఏదైనా రంధ్రం పడి లీకేజీ ఏర్పడితే తప్ప గ్యాస్ తగ్గదు. సర్వీసింగ్‌కు ముందు వరకు బాగానే పనిచేసిన ఏసీ, టెక్నీషియన్ వచ్చిన కొద్ది నిమిషాలకే గ్యాస్ అయిపోయిందని చెబితే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఎలాంటి లీక్ టెస్ట్ చేయకుండానే నేరుగా గ్యాస్ నింపాలని ఒత్తిడి తెస్తే అది మోసమని గ్రహించాలి.

కొందరు టెక్నీషియన్ల మాయాజాలం:

Advertisement

సోషల్ మీడియాలో చాలామంది కస్టమర్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. కొందరు కేటుగాళ్లు కస్టమర్ల కళ్లు గప్పి ఏసీలో ఉన్న గ్యాస్‌ను కొద్దిగా బయటకు వదిలేస్తుంటారు. ఆ తర్వాత మీటరు పెట్టి ప్రెజర్ తక్కువగా ఉందని చూపిస్తారు. ఏసీ పాడైపోతుందనే భయంతో కస్టమర్లు కూడా వారు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తుంటారు. ఇలాంటి ఫేక్ లీకేజీల ద్వారా కస్టమర్ల నుంచి వేలాది రూపాయలు గుంజుతున్నారు.

Also Read: జస్ట్ రూ.1,799కే Itel Aqua వాటర్ ప్రూఫ్ ఫోన్.. అరగంట పాటు నీటిలో ఉన్నా ఏం కాదు!

గ్యాస్ ప్రెజర్‌ను ఇలా చెక్ చేయండి:

Advertisement

టెక్నీషియన్ గ్యాస్ తక్కువగా ఉందని చెబితే.. వెంటనే మిమ్మల్ని ప్రెజర్ రీడింగ్ చూపించమనండి. సాధారణంగా కొత్త తరం ఏసీల్లో వాడే R32 లేదా R410 గ్యాస్ రన్నింగ్ ప్రెజర్ 130 నుంచి 140 PSI వరకు ఉండాలి. అదే పాత మోడల్ ఏసీల్లో వాడే R22 గ్యాస్ రీడింగ్ 60 నుంచి 65 PSI వరకు ఉంటుంది. ఈ రీడింగ్స్ కనుక కరెక్ట్‌గా ఉంటే మీ ఏసీలో గ్యాస్ నింపాల్సిన అవసరమే లేదని అర్థం.

మోసపోకుండా ఉండాలంటే?

ఏసీ సర్వీసింగ్ చేయించేటప్పుడు టెక్నీషియన్‌ను ఒంటరిగా వదిలేయకూడదు. వారు ఏం చేస్తున్నారో దగ్గరుండి గమనించాలి. ఒకవేళ గ్యాస్ లీక్ అయిందని చెబితే.. ఆ లీకేజీ ఎక్కడ ఉందో ఖచ్చితంగా చూపించమని అడగాలి. అలాగే సర్వీసింగ్ కోసం గుర్తింపు పొందిన లేదా అధీకృత కంపెనీల సర్వీస్ సెంటర్ల నుంచి మాత్రమే టెక్నీషియన్లను పిలిపించుకోవడం ఎంతో సురక్షితం.

Also Read: త్వరలో మార్కెట్‌లోకి Nvidia ల్యాప్‌టాప్స్.. మైక్రోసాఫ్ట్, ఆసస్ డివైజ్‌ల ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×