E-Paper
Advertisement

ఏసీ గదిలో హాయిగా నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

ఏసీ గదిలో హాయిగా నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే!
Advertisement

AC safety tips: సమ్మర్ హీట్ నుండి తప్పించుకోవడానికి చల్లగా ఏసీ వేసుకొని పడుకుంటున్నారా ..? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు వేసుకున్న ఆ ఏసీ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే AC లు ఏ నిమిషంలోనైనా పేలిపోయే అవకాశాలు ఉన్నాయ్  కాబట్టి. ఇక ఈ మధ్య అలాంటి సంఘటనలు  ఈ మధ్య ఎక్కువయ్యాయ్ కూడా. మరి మీ AC సరిగ్గా ఉందో లేదో మనమూ ఒకసారి చెక్ చేద్దామా !

AC మీ గదికి సరిపడా కెపాసిటీ ఉన్నదా

Advertisement

మొదటగా మీరు చేయాల్సిన పని మీరు బిగించిన AC మీ గదికి సరిపడా కెపాసిటీ ఉన్నదా లేదా అని చెక్ చేయడమే. మామూలుగా 150 చదరపు అడుగుల గదికి 1.5 టన్ను ఏసీ అవసరం. అంతకంటే తక్కువ వాడితే మాత్రం  కంప్రెసర్‌పై ఒత్తిడి పడి ‘బ్లాస్ట్’ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ.

కక్కుర్తి తో AC కి మామూలు స్విచ్‌లు

ఇక చాలా మంది కక్కుర్తి తో AC కి మామూలు స్విచ్‌లు వాడుతుంటారు. ఇది చాలా తప్పు! మీరు వాడాల్సింది 2-పోల్ MCB . ఇది గనుక వాడితే  షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఫేజ్ మరియు న్యూట్రల్ రెండింటినీ  కట్ చేసి ప్రమాదాన్ని ఆపుతుంది. కాబట్టి కాస్త రేట్ ఎక్కువైనా ఇవి వాడటం ఉత్తమం.

మంచి క్వాలిటీ ఔట్-సైడ్ స్టెబిలైజర్

Advertisement

ఇక ఈ రోజుల్లో ఏసీలకు ఇన్-బిల్ట్ స్టెబిలైజర్ ఉంటుంది. కానీ మన ఊర్లలో కరెంట్ ఒక్కోసారి ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. సొ ఆ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ల నుండి రక్షించుకోవడానికి మంచి క్వాలిటీ ఔట్-సైడ్ స్టెబిలైజర్ వాడటం మంచిది.

also read:దళపతి విజయ్‌ని టార్గెట్ చేశారా? TN 2026’రిలీజ్ ముందే పెద్ద వివాదం!

కనీసం 16 ఆంపియర్స్ కెపాసిటీ ఉన్న వైరింగ్

ఇక ఏసీకి కనీసం 16 ఆంపియర్స్ కెపాసిటీ ఉన్న వైరింగ్ వాడటం మంచిది. ఎందుకంటే పాత ఇళ్లలోని సన్నని వైర్లపై ఏసీ లోడ్ పడితే వైర్లు కరిగిపోయి మంటలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. సొ మీటర్ నుంచి ఏసీ వరకు విడిగా కొత్త వైరింగ్ వేయించుకోవడం బెస్ట్.

అవుట్‌డోర్ యూనిట్‌ను గోడకు అతుక్కోకుండా

ఇక AC కి అటువైపు గా బిగించే అవుట్‌డోర్ యూనిట్‌ను గోడకు అతుక్కోకుండా కనీసం 2-3 అడుగుల దూరంలో ఉంచితే చాలా మంచిది. అది ఎంత చల్లగా ఉంటే మీ ఏసీ అంత బాగా పనిచేస్తుందన్న మాట. ఇక ఎండ డైరెక్ట్ గా పడకుండా  నీడలో ఉంచితే ఇంకా మంచిది.

చీఫ్ గా వస్తున్నాయని తక్కువ రేటులోAC

ఇక చాలా మంది చీఫ్ గా వస్తున్నాయని తక్కువ రేటులోAC లని కొనేస్తుంటారు. అలా లిమిటెడ్ బడ్జెట్ లో AC తీసుకోవాలని అనుకుంటే మాత్రం పాత కాపర్ పైపులు, గ్యాస్ లీకేజీలను ఎక్స్ పర్ట్స్ అయిన  టెక్నీషియన్‌తో చెక్ చేయించాకే ఇంట్లో బిగించడం మేలు.

ఏడాదికి కనీసం రెండుసార్లు సర్వీసింగ్

ఇక అన్నింటికన్నా ముఖ్యం  సర్వీసింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదికి కనీసం రెండుసార్లు సర్వీసింగ్ చేయించాలి. ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే గాలి సరిగ్గా రాక కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుందన్నది గుర్తుంచుకోండి. కుదిరితే బద్దకించకుండా ఫిల్టర్లను మీరే తీసి శుభ్రం చేసుకోవడం మంచిది

ఎప్పుడూ 24°C లేదా అంతకంటే ఎక్కువ టెంపరేచర్

ఇక చివరిగా ఏసీని ఎప్పుడూ 24°C లేదా అంతకంటే ఎక్కువ టెంపరేచర్ వద్ద సెట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఏకదాటిగా  16°C లేదా 18°C లో పెడితే కంప్రెసర్ ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది.దీని వల్ల కళ్ళు తేలేసేలా కరెంట్ బిల్లే కాదు AC కూడా త్వరగా షెడ్డుకు వెళ్ళడం ఖాయం. సొ అర్థమైందిగా చల్లగా AC ని on  చేసేముందు ఏం చేయాలో !

also read :ఆపిల్ సామ్రాజ్యాన్ని శాసించే ఆ ఒక్క చిన్న అక్షరం: ‘i’ వెనుక ఉన్న అసలు సిసలు కథ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×