E-Paper
Advertisement

ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పేలకుండా ఉండాలా? ఈ 6 జాగ్రత్తలు మీ కోసమే!

ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పేలకుండా ఉండాలా? ఈ 6 జాగ్రత్తలు మీ కోసమే!
Advertisement

AC Outdoor Unit: వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఏసీలను నిరంతరాయంగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏసీ అవుట్‌డోర్ యూనిట్లు సైతం పేలిపోతున్నాయనే వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను ముందే అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రెగ్యులర్ సర్వీసింగ్ తప్పనిసరి

ఏసీని వేసవి ప్రారంభంలోనే కాకుండా.. క్రమంతప్పకుండా సర్వీసింగ్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లలో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం వల్ల కంప్రెసర్‌పై అదనపు భారం పడదని పేర్కొంటున్నారు.. ఇది ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తుందని స్పష్టం చేస్తున్నారు. .

నీడ పడేలా జాగ్రత్తలు

Advertisement

అవుట్‌డోర్ యూనిట్‌ను నేరుగా ఎండపడే చోట కాకుండా కాస్త నీడ ఉండే ప్రదేశంలో అమర్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండ వేడికి తోడు కంప్రెసర్ వేడి కూడా తోడైతే యూనిట్ పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

గాలి ఆడేలా ఉంచడం

చాలామంది అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ వస్తువులు పెట్టేస్తుంటారు. అలా కాకుండా యూనిట్ చుట్టూ కనీసం రెండడుగుల ఖాళీ స్థలం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కంప్రెసర్ విడుదల చేసే వేడి గాలి బయటకు సులభంగా వెళ్ళిపోతుందని స్పష్టం చేస్తున్నారు.

వోల్టేజ్ స్టెబిలైజర్

Advertisement

సాధారణంగా కరెంట్ హెచ్చుతగ్గులు ఏసీ కంప్రెసర్‌ను దెబ్బతీస్తాయి. నాణ్యమైన స్టెబిలైజర్‌ను ఉపయోగించడం ద్వారా షార్ట్ సర్క్యూట్ కాకుండా, కంప్రెసర్ ఓవర్‌హీట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు.

గ్యాస్ లీకేజీలపై నిఘా

ఏసీలో ఉండే రిఫ్రిజెరెంట్ గ్యాస్ లీక్ అయితే కంప్రెసర్ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఏసీ సరిగ్గా కూలింగ్ ఇవ్వకపోయినా, అవుట్‌డోర్ యూనిట్ దగ్గర ఏవైనా విచిత్ర శబ్దాలు వచ్చినా వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి తనిఖీ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!

మధ్య మధ్యలో గ్యాప్

ఏసీని రోజంతా ఆపకుండా వాడటం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని గంటలు వాడిన తర్వాత కనీసం అరగంట పాటు ఏసీకి విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తున్నారు. దీనివల్ల అవుట్‌డోర్ యూనిట్ చల్లబడి, సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: షాపింగ్ మీది.. బ్యాగుల బరువు మాది.. స్టార్టప్ కంపెనీ క్రేజీ ఐడియా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×