E-Paper
Advertisement

AC Maintenance: ఏసీ ఇలా వాడితే మీరు షెడ్డుకెళ్లడం ఖాయం.. ఏముందిలే అనుకుంటే పొరపాటే..

AC Maintenance: ఏసీ ఇలా వాడితే మీరు షెడ్డుకెళ్లడం ఖాయం.. ఏముందిలే అనుకుంటే పొరపాటే..
Advertisement

AC Maintenance: వేసవి వచ్చిందంటే చాలు.. బయట ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మధ్యతరగతి ఇళ్లలో కూడా ఏసీలు దర్శనమిస్తున్నాయి. అయితే, ఏసీని ఆన్ చేయడం, చల్లని గాలిని ఆస్వాదించడం మాత్రమే మనకు తెలుసు. కానీ, దాని నిర్వహణను విస్మరిస్తే మనం పీల్చే గాలి విషతుల్యంగా మారుతుంది. అపరిశుభ్రమైన ఏసీల వల్ల శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. మీ ఏసీని సురక్షితంగా, సమర్థవంతంగా ఉంచుకోవడానికి మీరు ఏం చెయ్యాలి అంటే?

ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి..

ఏసీలో గాలిని వడపోసే ‘ఎయిర్ ఫిల్టర్లు’ ఉంటాయి. ఇవి దుమ్ము, ధూళిని పీల్చుకుంటాయి. ఎక్కువగా మైక్రో ఫిల్టర్లు ఉన్న ఏసీలను ప్రిఫర్ చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను తీసి శుభ్రం చేయాలి. వీటిని టాప్ వాటర్ కింద ఉంచి కడిగితే సరిపోతుంది. దీంతో గాలి నాణ్యత పెరుగుతుంది విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలర్జీలు రాకుండా ఉంటాయి.

Advertisement

Read also-Air Cooler Cleaning Tips: మీ కూలర్ కూలింగ్ ఇవ్వట్లేదా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. ఇక అంతా కూల్ కూల్!

ఇండోర్ యూనిట్ కాయిల్స్ జాగ్రత్త

ఏసీ లోపల ఉండే కాయిల్స్ మీద తేమ వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఏసీ నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే.. ఏసీని ఆపే ముందు ఒక 5 నిమిషాల పాటు కేవలం ‘ఫ్యాన్ మోడ్’లో ఉంచితే లోపల ఉన్న తేమ ఆరిపోయి ఫంగస్ చేరకుండా ఉంటుంది.

సర్వీసింగ్ అస్సలు మర్చిపోవద్దు..

Advertisement

చాలామంది ఏసీ సరిగ్గా పని చేయనప్పుడు మాత్రమే మెకానిక్‌ను పిలుస్తారు. ఇది తప్పు. ఏడాదికి కనీసం రెండు సార్లు ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించాలి. గ్యాస్ లీకేజీలు, వైరింగ్ సమస్యలను వారు ముందే గుర్తించగలరు. దీంతో గాలి నాణ్యత పెరుగుతుంది. ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

గాలి వెలుతురు ముఖ్యం

రోజంతా ఏసీ గదిలోనే తలుపులు మూసి ఉండటం వల్ల లోపల కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుంది. దీనిని నివారించాలంటే రోజుకు కనీసం ఒకటి లేదా రెండు సార్లు తలుపులు, కిటికీలు తెరిచి తాజా గాలి లోపలికి వచ్చేలా చూడాలి. దీనివల్ల గదిలోని గాలి మారుతుంది.

Read also-Cooler Tips: కూలర్ మీ ఇంట్లో అక్కడ పెడితే పొరపాటే?.. వాడేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకండి..

సరైన ఉష్ణోగ్రతను పాటిస్తే..

చాలామంది త్వరగా చల్లబడాలని 16°C లేదా 18°C లో పెడతారు. ఇది ఆరోగ్యానికి యంత్రానికి కూడా మంచిది కాదు. ఏసీని ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచండి. ఇది మానవ శరీరానికి సౌకర్యవంతంగా ఉంటుంది విద్యుత్ బిల్లును కూడా తగ్గిస్తుంది.

ఒకవేళ మీ ఏసీ నుంచి వచ్చే గాలి వల్ల తరచూ జలుబు, దగ్గు, తుమ్ములు లేదా చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తుంటే, వెంటనే ఏసీ సర్వీసింగ్ చేయించి, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఏసీ వాడటం ఓక్కటే కాదు వాటి మేంటెనస్ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వారు ఖచ్చితంగా ఇవి పాటించాల్సిందే. లేదంటే ఏసీలో ఉన్న పిల్లలకు శ్వాస సంబంధ వ్యాదులు వచ్చే అవకాశం ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×