E-Paper
Advertisement

AC Gas Tips: ఏసీ అడ్డదిడ్డంగా పనిచేస్తోందా? గ్యాస్ సమస్య ఉన్నట్లే.. ఇలా చేస్తే అంతా సెట్!

AC Gas Tips: ఏసీ అడ్డదిడ్డంగా పనిచేస్తోందా? గ్యాస్ సమస్య ఉన్నట్లే.. ఇలా చేస్తే అంతా సెట్!
Advertisement

AC Gas Tips: ఏసీకి వచ్చే ప్రధాన ఇబ్బందుల్లో గ్యాస్ సమస్య ఒకటి. ఇది పూర్తిగా అడుగంటకముందే వినియోగదారులకు కొన్ని లక్షణాలను చూపిస్తుంది. దానిని గుర్తించి వెంటనే గ్యాస్ రీఫిల్ చేసుకుంటే సకాలంలో సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే చల్లదనం లేకపోవడం, అధిక పవర్ బిల్లు, అనవసర రిపేర్లు వంటి సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముంది. మరి ఏసీలో గ్యాస్ తక్కువగా ఉందని తెలుసుకోవడం ఎలా? గ్యాస్ తగ్గడానికి కారణాలేంటి? అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

గ్యాస్ తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

తక్కువ కూలింగ్

Advertisement

ఏసీ ఆన్ చేసినా గది త్వరగా చల్లబడకపోవడం గ్యాస్ తగ్గిందని చెప్పేందుకు ప్రాథమిక లక్షణంగా చెబుతారు. ఏసీ నుంచి గాలి వస్తుంది కానీ అందులో ఉండాల్సిన చల్లదనం ఉండదు.

వేడి గాలి ప్రసారం

ఇండోర్ యూనిట్ నుండి చల్లని గాలికి బదులుగా గది ఉష్ణోగ్రతతో సమానమైన గాలి లేదా స్వల్పంగా వేడి గాలి రావడం గమనించవచ్చు.

పైపులపై మంచు పేరుకుపోవడం

Advertisement

అవుట్‌డోర్ యూనిట్ వద్ద ఉండే రాగి పైపుల (Copper pipes) మీద మంచు (Ice) పేరుకుపోయి తెల్లగా కనిపిస్తే అది గ్యాస్ తక్కువగా ఉందనడానికి స్పష్టమైన సంకేతం.

నీటి లీకేజీ

ఏసీ లోపల ఐస్ గడ్డకట్టి అది కరిగినప్పుడు ఇండోర్ యూనిట్ నుండి నీరు లీక్ అయ్యే అవకాశం ఉంది.

అసాధారణ శబ్దాలు

గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు కంప్రెషర్ పై ఒత్తిడి పడి ‘హిస్సింగ్’ (Hissing) లేదా ‘బబ్లింగ్’ వంటి శబ్దాలు వచ్చే అవకాశం ఉంది.

గ్యాస్ తగ్గడానికి ప్రధాన కారణాలు

 

పైపుల లీకేజీ

రాగి పైపులు పాతబడటం వల్ల లేదా వాటిపై తుప్పు పట్టడం వల్ల చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి గ్యాస్ లీక్  అయ్యే ఛాన్స్ ఉంది.

సరిగ్గా ఇన్‌స్టాలేషన్ చేయకపోవడం

ఏసీని అమర్చేటప్పుడు పైపుల జాయింట్లు సరిగ్గా బిగించకపోతే కాలక్రమేణా గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది.

ఏసీ తయారీ లోపాలు

ఏసీల్లో ఇలాంటి సమస్య చాలా అరుదుగా వస్తుంటుంది. ఇండోర్ లేదా అవుట్‌డోర్ కాయిల్స్‌ లో తయారీ సమయంలోనే ఉండే లోపాల వల్ల కూడా గ్యాస్ తగ్గుతుంది.

గ్యాస్ తగ్గితే ఏం చేయాలి?

 

ఫిల్టర్లను శుభ్రం చేయడం

కొన్నిసార్లు దుమ్ము వల్ల కూడా కూలింగ్ తగ్గుతుంది. కాబట్టి ముందుగా ఫిల్టర్లను శుభ్రం చేసి చూడండి. అప్పటికీ సమస్య ఉంటే అది గ్యాస్ సమస్యే అని నిర్ధారించుకోండి.

టెక్నీషియన్‌ను సంప్రదించడం

గ్యాస్ నింపడం (Gas Charging) అనేది నిపుణులు చేయాల్సిన పని. వెంటనే ఒక మంచి ఏసీ టెక్నీషియన్‌ను పిలిపించుకోండి.

లీకేజీని తనిఖీ చేయించండి

కేవలం గ్యాస్ నింపడమే కాకుండా అది ఎక్కడి నుండి లీక్ అవుతుందో గుర్తించి దాన్ని రిపేర్ చేయించడం చాలా ముఖ్యం. లేదంటే కొన్ని రోజులకే మళ్లీ గ్యాస్ అయిపోతుంది.

Also Read: Motorola AC: మధ్యతరగతి స్పెషల్.. మోటరోలా ఏసీలు వచ్చేసాయోచ్.. వై-ఫై, యాప్ కంట్రోల్ మరెన్నో ఫీచర్లు!

క్రమం తప్పకుండా సర్వీసింగ్

ఏసీని కనీసం సంవత్సరానికి రెండు సార్లు సర్వీసింగ్ చేయించడం వల్ల గ్యాస్ లీకేజీ, కూలింగ్ రాకపోవడం, వేడిగా వస్తుండటం వంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు వీలు ఏర్పడుతుంది.

Also Read: AI trading Profit: యూజర్ నిద్రపోతుండగా స్టాక్ ట్రేడింగ్ చేసిన ఏఐ.. ఒక్క రాత్రిలో రూ.29 లక్షల లాభం

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×