// // ఏసీ, కూలర్.. రెండూ ఆన్ చేయండి.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు! -->
E-Paper
Advertisement

ఏసీ, కూలర్ కాంబినేషన్.. ఒక్కసారి రెండూ ఆన్ చేసి చూడండి.. ఆ తర్వాత జరిగేది అస్సలు నమ్మలేరు!

ఏసీ, కూలర్ కాంబినేషన్.. ఒక్కసారి రెండూ ఆన్ చేసి చూడండి.. ఆ తర్వాత జరిగేది అస్సలు నమ్మలేరు!
Advertisement

AC and Air Cooler: సమ్మర్ లో ఏసీ, కూలర్ కు ఉండే డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేసవి తాపాన్ని తట్టుకోనేందుకు మెజారిటీ ప్రజలు ఈ రెండింటి మీదనే ఆధారపడుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఏసీ, కూలర్ రెండింటిని చాలా అరుదుగా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. ఒకటి ఉంటే రెండోదాని అవసరం ఉండదని చాలా మంది భావన. అయితే ఏసీ, కూలర్ రెండింటినీ కలిపి వాడటం వల్ల విద్యుత్ బిల్లులను భారీగా తగ్గించుకోవచ్చన్న ప్రచారం నెట్టింట గట్టిగానే జరుగుతోంది. స్మార్ట్ కూలింగ్ స్ట్రాటజీ వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏసీ + కూలర్ కాంబినేషన్

సాధారణంగా ఏసీలు.. వేడిని బయటకు పంపి గదిని చల్లబరుస్తాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున విద్యుత్ ను ఏసీలు వినియోగిస్తాయి. మరోవైపు ఎయిర్ కూలర్ కేవలం గాలిని చల్లబరుస్తూ తక్కువ విద్యుత్తును వాడుతుంది. ఈ రెండింటినీ ఒకేసారి ఆన్ చేసి వాడటం వల్ల నెలవారీ విద్యుత్ బిల్లును దాదాపు రూ.7,000 వరకు ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Advertisement

ఏసీ, కూలర్ రెండింటిని వ్యూహాత్మకంగా ఉపయోగించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఏసీని ఆన్ చేసి గదిని వేగంగా చల్లబరచండి. గది ఉష్ణోగ్రత కాస్త తగ్గగానే ఏసీని ఆపేయండి. లేకపోతే చాలా తక్కువ పవర్‌లో ఉంచినా సరిపోతుంది. అనంతరం ఎయిర్ కూలర్ ను ఆన్ చేస్తే.. అది ఏసీ సృష్టించిన చల్లని గాలిని గది అంతటా వ్యాపించేలా చేయడంతో పాటు గాలిలో తేమ మాయంకాకుండా చూస్తుంది.

వెంటిలేషన్ ముఖ్యం

అయితే కూలర్ వాడేటప్పుడు వెంటిలేషన్ చాలా ముఖ్యం. ఇందుకోసం కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచడం వల్ల గాలి సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. దీనివల్ల గదిలో ఉక్కపోత అనిపించదు. మరోవైపు ఏసీని మరీ 18°C – 16°C మధ్య కాకుండా 24°C నుండి 26°C మధ్య సెట్ చేస్తే బెటర్. దీనివల్ల ఏసీ కంప్రెషర్ తక్కువ ఒత్తిడితో పనిచేసి విద్యుత్ ను ఆదా చేస్తుంది.

Advertisement

Also Read: Pani Puri Incident: పానీపూరీ తిని బాలుడు మృతి.. ఆసుపత్రిలో మరో 18 మంది, ఏం జరిగింది?

మరిన్ని ప్రయోజనాలు..

ఏసీ కూలర్ రెండూ కలిపి వాడటం వల్ల విద్యుత్ ఆదాతోపాటు మరికొన్ని ప్రయోజనాలు సైతం ఉన్నాయంటూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏసీ వల్ల పొడిగా మారే గాలిని.. కూలర్ తేమగా ఉంచేందుకు సాయపడుతుంది. ఫలితంగా చర్మం, గొంతు పొడిబారే సమస్య ఉండదు. కూలర్ వేయడం వల్ల ఏసీపై ఒత్తిడి తగ్గి ఎక్కువ కాలం సమర్థవంతంగా, మన్నికతో పనిచేసేందుకు వీలు ఏర్పడుతుంది. మెుత్తంగా ఏసీ, కూలర్ కలిపి వాడే చిట్కాను పాటించడం ద్వారా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందటంతో పాటు మీ జేబుకు చిల్లుపడకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: LSG VS KKR: నిద్ర‌పోయిన అంపైర్..సిక్స‌ర్ వెళ్తే, బౌండ‌రీ ఇచ్చాడు, ద‌రిద్రం అంటే ల‌క్నోదే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×