E-Paper
Advertisement

ఏసీ వాడుతున్నారా? ఈ ‘3 మినిట్ రూల్’ తెలుసా? లేదంటే కష్టమే!

ఏసీ వాడుతున్నారా? ఈ ‘3 మినిట్ రూల్’ తెలుసా? లేదంటే కష్టమే!
Advertisement

AC 3 Minute Rule: అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఇళ్లలో, ఆఫీసుల్లో ఎయిర్ కండిషనర్లు (AC) నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఏసీని ఉపయోగించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల విద్యుత్ బిల్లులు భారీగా పెరగడమే కాకుండా ఏసీ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సాంకేతిక నిపుణులు ఏసీల లైఫ్ పెంచడానికి ‘3 మినిట్ రూల్’ (3-Minute Rule) పాటించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ రూల్? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఏమిటి ఈ ‘3 నిమిషాల రూల్’?

ఏసీని ఒకసారి ఆపిన తర్వాత (Turn Off), తిరిగి దానిని ఆన్ చేయడానికి మధ్య కనీసం 3 నిమిషాల సమయం గ్యాప్ ఇవ్వడాన్నే ‘3-మినిట్ రూల్’ అంటారు. ఏసీని వెంటనే ఆన్ అండ్ ఆఫ్ చేయకుండా.. కంప్రెసర్‌కు తగినంత విశ్రాంతి ఇవ్వడం ఈ రూల్ ముఖ్య ఉద్దేశం.

కంప్రెసర్‌పై పడే ఒత్తిడి

Advertisement

సాధారణంగా ఏసీ రన్నింగ్‌లో ఉన్నప్పుడు దానిలోని కంప్రెసర్ గదిని చల్లబరచడానికి హై-ప్రెజర్ తో కూడిన రిఫ్రిజెరెంట్ గ్యాస్‌ను పంప్ చేస్తుంది. మనం ఏసీని హఠాత్తుగా ఆపేసినప్పుడు ఆ సిస్టమ్‌లో ఒత్తిడి అలాగే ఉండిపోతుంది. అది సాధారణ స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఒకవేళ ఏసీని ఆపిన వెంటనే మళ్లీ ఆన్ చేస్తే.. ఆ ఒత్తిడిని అధిగమించి కంప్రెసర్ మోటార్ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల మోటార్‌పై తీవ్రమైన లోడ్ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

పాటించకపోతే వచ్చే నష్టాలు

పదే పదే ఏసీని ఆన్, ఆఫ్ చేయడం వల్ల కంప్రెసర్ మోటార్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఒత్తిడిలో ఉన్న కంప్రెసర్‌ను బలవంతంగా స్టార్ట్ చేయడానికి.. ఏసీ సాధారణం కంటే 3 నుండి 5 రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఖర్చు చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కరెంట్ బిల్లు తడిసి మోపెడు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ఎక్కువ కరెంట్ లాగడం వల్ల ఇంట్లోని ఎంసీబీ (MCB) ట్రిప్ అవ్వడం, వైరింగ్ దెబ్బతినడం వంటివి కూడా జరగొచ్చని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: మోటో నుంచి కొత్త ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 3 రోజులు పక్కా!

ఆటోమేటిక్ అయినా.. జాగ్రత్త తప్పనిసరి

ప్రస్తుతం వస్తున్న అత్యాధునిక ఇన్వర్టర్ ఏసీలలో ఈ ‘3 మినిట్ డిలే ప్రొటెక్షన్’ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. ఒకవేళ పొరపాటున వెంటనే ఆన్ చేసినా, కంప్రెసర్ మాత్రం 3 నిమిషాల తర్వాతే స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ పవర్‌కట్ అయినప్పుడు, పాత మోడల్ ఏసీలు వాడుతున్నప్పుడు మాన్యువల్‌గా ‘3 మినిట్ రూల్’ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: వర్షాకాలం కష్టాలకు చెక్.. మీ లైఫ్ ఈజీ చేసే.. 6 అద్భుతమైన స్మార్ట్ గ్యాడ్జెట్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×