E-Paper
Advertisement

Washing Machine Tips: వాషింగ్ మిషన్‌లో.. బట్టలతో పాటు ఇవి కూడా వేస్తున్నారా? కొంపలు అంటుకుంటాయ్ జాగ్రత్త!

Washing Machine Tips: వాషింగ్ మిషన్‌లో.. బట్టలతో పాటు ఇవి కూడా వేస్తున్నారా? కొంపలు అంటుకుంటాయ్ జాగ్రత్త!
Advertisement

Washing Machine Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ వాషింగ్ మిషన్ తప్పనిసరిగా మారింది. అత్యాధునిక సాంకేతికతను రూపొందిన ఈ వాషర్లు.. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఎవరైనా తేలిగ్గా వాడే విధంగా వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి. అయితే వీటిని ఉపయోగించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వస్తువులను పొరపాటున కూడా మిషన్ లో వేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవీ? వాటి వల్ల కలిగే నష్టం ఏంటీ? ఈ కథనంలో పరిశీలిద్దాం.

నాణేలు – కీ చైన్లు

సాధారణంగా చాలా మంది తమ ప్యాంట్ జేబులో రూ.1, రూ.5, రూ.20 నాణేలను మర్చిపోతుంటారు. అలాగే బైక్ లేదా కారు కీలను కూడా ప్యాంటులో వదిలేస్తుంటారు. అలాంటి ప్యాంట్లను నేరుగా వాషింగ్ మిషన్ లో వేస్తే నష్టం తప్పదు. మెషీన్ వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ బలమైన లోహపు వస్తువులు తాకి.. డ్రమ్ వాల్స్ దెబ్బతింటాయి. ఒక్కోసారి ఇవి డ్రైన్ పంప్‌లో ఇరుక్కుపోయి నీరు బయటకు వెళ్లకుండా అడ్డుపడతాయి.

రన్నింగ్ షూస్ – లెదర్ వస్తువులు

Advertisement

రన్నింగ్ షూలు, లెదర్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మిషన్ లో వేయకూడదు. వేడి నీరు, మెషీన్ రాపిడి వల్ల షూస్ అడుగున ఉండే గమ్ దెబ్బకు కరిగిపోతుంది. లెదర్ (తోలు) వస్తువులైతే మెషీన్‌లో వేయగానే ముడతలు పడి వాటి మెరుపును కోల్పోయి పూర్తిగా పాడైపోతాయి.

పెంపుడు జంతువుల వస్త్రాలు

కుక్కలు లేద పిల్లుల కోసం వినియోగించే వస్త్రాలను (దుప్పట్లు లేదా బట్టలు) నేరుగా వాషింగ్ మిషన్ లో వేయవద్దు. వాటికి అంటిన వెంట్రుకలు సమస్యను సృష్టించొచ్చు. మిషన్ లో తడిసినప్పుడు ఈ వెంట్రుకలు ఒకదానికొకటి అంటుకుని ముద్దలా తయారవుతాయి. ఇవి వాషింగ్ మెషీన్ ఫిల్టర్లు, డ్రైన్ పైపులకు అడ్డుపడి.. మిషన్ పనితీరును దెబ్బతీస్తాయి.

రబ్బర్ చేసిన మ్యాట్లు

Advertisement

డోర్ మ్యాట్లను నేరుగా వాషింగ్ మిషన్ లో వేయవద్దు. ముఖ్యంగా రబ్బర్ గ్రిప్ తో తయారైన వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాషర్ల వేయకపోవడమే మంచింది. లేదంటే మెషీన్ లోపల ఉండే వేడి వల్ల ఆ రబ్బరు ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఆ చిన్న చిన్న రబ్బరు ముక్కలు డ్రైన్ పైపులో ఇరుక్కుపోయి.. సమస్యలకు కారణమవుతాయి.

హుక్స్ ఉన్న లోదుస్తులు

స్త్రీలు తమ హుక్స్ ఉన్న లోదుస్తుల (బ్రాలు)ను వాషింగ్ మిషన్ లో వేయకపోవడమే బెటర్. ఎందుకంటే లోదుస్తులకు ఉండే హుక్స్, స్టీల్ వైర్లు (Underwires) బయటకు వచ్చి మెషీన్ డ్రమ్‌ను గీరేసి దెబ్బతిస్తాయి. అంతేకాకుండా ఇతర దుస్తులకు ఆ హుక్స్ అంటుకుంటే స్పిన్ వేగానికి అవి చిరిగిపోయే ప్రమాదముంది. ఒకవేళ వాటిని ఉతకాలని భావిస్తే లాండ్రీ బ్యాగ్ లో వేసి అప్పుడు ఉతికితే మంచింది.

Also Read: CM Revanth Reddy: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. లక్ష్మీకి ఇందిరమ్మ ఇల్లు.. ఇవాళే గృహ ప్రవేశం

వాటర్‌ప్రూఫ్ దుస్తులు

రెయిన్ కోట్లు లేదా వాటర్‌ప్రూఫ్ జాకెట్లను వాషింగ్ మిషన్ లో వేయకండి. ఇవి నీటిని పీల్చుకోవు కాబట్టి స్పిన్ సైకిల్ సమయంలో మెషీన్ లోపల బ్యాలెన్స్ తప్పుతాయి. దీనివల్ల మెషీన్ విపరీతమైన శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఫలితంగా మోటారుపై అధిక ఒత్తిడి పడి.. దెబ్బతినే ప్రమాదం ఉంది.

Also Read: Iran Earthquake: యుద్ధంలో మునిగిన ఇరాన్‌పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×