E-Paper
Advertisement

ఏసీ ఆఫ్ చేసినా గది చల్లగా ఉండాలా? ఈ 6 ట్రిక్స్ పాటిస్తే.. రోజంతా కూల్ కూల్!

ఏసీ ఆఫ్ చేసినా గది చల్లగా ఉండాలా? ఈ 6 ట్రిక్స్ పాటిస్తే.. రోజంతా కూల్ కూల్!
Advertisement

AC Cooling Tips: వేసవి కాలంలో ఏసీ ఆన్ చేసిన కాసేపటికే గది చల్లగా మారుతుంది. కానీ ఏసీ ఆఫ్ చేయగానే ఆ కూలింగ్ క్షణాల్లో మాయమైపోతుంటుంది. దీని వల్ల వెంట వెంటనే ఏసీ ఆన్ చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఫలితంగా కరెంట్ బిల్లు పెరగడమే కాకుండా ఏసీపై కూడా భారం పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏసీ ఆఫ్ చేసినా.. కూలింగ్ ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేసే 6 సులువైన చిట్కాలు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కూలింగ్ లీకేజీకి అడ్డుకట్ట

గదిలోని చల్లటి గాలి బయటకు వెళ్లకుండా.. బయట ఉన్న వేడి గాలి లోపలికి రాకుండా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి తలుపులు, కిటికీల సందులను ‘డోర్ సీల్స్’ లేదా ‘ఫోమ్ టేప్’ సహాయంతో పూర్తిగా మూసివేయండి. దీనివల్ల కూలింగ్ ఎక్కువసేపు గదిలో నిలిచి ఉంటుంది.

సన్‌ కంట్రోల్ ఫిల్మ్‌

Advertisement

సూర్యరశ్మి నేరుగా గదిలోకి పడితే ఏసీ కూలింగ్ త్వరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి పగటిపూట కిటికీలకు మందపాటి తెరలు లేదా సన్‌ కంట్రోల్ ఫిల్మ్‌లను వాడాలని నిపుణులు సూచిన్నారు. ఇవి వేడిని లోపలికి రానివ్వకుండా.. ఏసీ కూలింగ్ ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

సీలింగ్ ఫ్యాన్‌ చిట్కా

ఏసీ ఆన్ చేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ను 1 లేదా 2 స్పీడ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఏసీ ఇచ్చే చల్లటి గాలిని గది నలుమూలలా సమానంగా వ్యాపించేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ఫలితంగా ఏసీ ఆఫ్ చేసినా కూలింగ్ ఎక్కువసేపు ఉంటుందని తెలియజేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ వస్తువులు

Advertisement

గదిలో ఉండే టీవీ, కంప్యూటర్, ఫ్రిజ్ లేదా బల్బుల వల్ల వేడి విడుదల అవుతుంది. కాబట్టి ఏసీ నడుస్తున్నప్పుడు అవసరం లేని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల గది ఉష్ణోగ్రత త్వరగా పెరగకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.

సరైన ఉష్ణోగ్రత

ఏసీని ఎప్పుడూ 24 డిగ్రీల వద్ద సెట్ చేయడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది గదిని సౌకర్యవంతంగా ఉంచడమే కాకుండా గోడలు మరీ చల్లబడిపోకుండా చూస్తుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల ఏసీ ఆఫ్ చేసినా గది వాతావరణం స్థిరంగా ఉంటుందని వివరిస్తున్నారు.

Also Read: వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం

ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్

ఏసీ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే చల్లటి గాలి సరిగ్గా రాదని నిపుణులు చెబుతున్నారు. వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం వల్ల ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. తద్వారా గదిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: 25 పైసల ఖర్చుతో నడిచే.. పోర్టబుల్ ఏసీ వచ్చిందోచ్.. సామాన్యులకు పండగే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×