E-Paper
Advertisement

ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!

ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!
Advertisement

5G Network Issue: మొబైల్ స్క్రీన్ పైభాగంలో ‘True 5G’ అని ఫుల్ సిగ్నల్ చూపించినప్పటికీ.. కొందరు ఇంటర్నెట్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. బ్రౌజర్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ప్లే చేసినా కనీసం గూగుల్ పేజీ కూడా లోడ్ అవ్వని సందర్భాలు.. చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అయితే ‘సిగ్నల్ ఫుల్’ ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక తమలో తామే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వింత సమస్య వెనుకు ఉన్న సాంకేతిక కారణాలు, దానికి గల పరిష్కారాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఫేక్ 5G మాయాజాలం

సాధారణంగా మనం చూసే 5G సిగ్నల్స్ అన్నీ ఒకేలా ఉండవు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు ‘నాన్-స్టాండ్‌అలోన్’ (NSA) నెట్‌వర్క్‌ను ఎక్కువగా వాడుతున్నాయి. అంటే 4G నెట్‌వర్క్ మౌలిక వసతులపైనే 5G సిగ్నల్‌ను అందిస్తున్నాయి. మీ ఫోన్ 4G టవర్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పటికీ అక్కడ 5G లభ్యత ఉంటే ఫోన్ స్క్రీన్‌పై ‘5G’ అని చూపిస్తుంది. కానీ బ్యాక్‌ఎండ్‌లో డేటా బదిలీ సరిగ్గా జరగనప్పుడు సిగ్నల్ చూపిస్తున్నా 5G ఇంటర్నెట్ మాత్రం రాదని నిపుణులు పేర్కొంటున్నారు.

నెట్‌వర్క్ రద్దీ

Advertisement

ఒకే ప్రాంతం లేదా ఒకే టవర్ పరిధిలో చాలా మంది వినియోగదారులు ఒకేసారి 5G నెట్‌వర్క్‌ను వాడుతున్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. టవర్ నుంచి మీ ఫోన్‌కు సిగ్నల్ అందుతుంది కాబట్టి బార్స్ ఫుల్‌గా చూపిస్తాయి. కానీ డేటా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ పడిపోయి ఏ పేజీ కూడా లోడ్ అవ్వదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఐపీ అడ్రస్ లోపాలు

మీ ఫోన్.. టవర్‌కు కనెక్ట్ అయినప్పటికీ, టెలికాం ఆపరేటర్ సిస్టమ్ మీ ఫోన్‌కు ఐపీ (IP) అడ్రస్‌ను కేటాయించడంలో ఫెయిలైతే నెట్ రాదని నిపుణులు తెలియజేస్తున్నారు. సిగ్నల్ బార్స్ అనేవి కేవలం టవర్‌తో మీ ఫోన్‌కు ఉన్న కనెక్షన్ బలాన్ని మాత్రమే సూచిస్తాయి కానీ ఇంటర్నెట్ డేటా వస్తోందా లేదా అనేదాన్ని కాదని పేర్కొంటున్నారు.

సాఫ్ట్‌వేర్ బగ్‌లు

Advertisement

కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉండే చిన్న చిన్న బగ్‌ల వల్ల 5G మోడెమ్ సరిగ్గా స్పందించదని నిపుణులు అంటున్నారు. 4G నుంచి 5Gకి నెట్‌వర్క్ మారే క్రమంలో.. ఫోన్ సాఫ్ట్‌వేర్ హ్యాంగ్ అవ్వడం వల్ల సిగ్నల్ చూపిస్తూనే డేటాను బ్లాక్ చేస్తుందని వివరిస్తున్నారు.

Also Read: ఒకే ఒక్క గ్యాడ్జెట్.. నాలుగు అద్భుతాలు.. బుర్ర బద్దలయ్యే డివైజ్ భయ్యా!

ఇలా చెక్ పెట్టండి

5G సిగ్నల్స్ ఉన్నా నెట్ రాని పక్షంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముందుగా ఫ్లైట్ మోడ్ ను ఆన్ చేసి కొద్దిసేపటి తర్వాత ఆఫ్ చేయాలని హితవు పలుకుతున్నారు. ఒక 10 సెకన్ల పాటు ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేస్తే.. నెట్‌వర్క్ మళ్లీ కొత్తగా టవర్‌తో కనెక్ట్ అవుతుందని పేర్కొంటున్నారు. ఫోన్ సాఫ్ట్‌వేర్ బగ్‌ల వల్ల సమస్య వస్తే.. రీస్టార్ట్ చేయడం ద్వారా మొబైల్ మోడెమ్ రీఫ్రెష్ అవుతుందని సూచిస్తున్నారు. ఒకవేళ 5G సిగ్నల్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ మోడ్‌ను ‘5G’ నుంచి కేవలం ‘4G/LTE’ కి మార్చితే బెటర్. 5G కంటే 4G చాలా వేగంగా పనిచేసే ఛాన్స్ ఉంటుంది.

Also Read: సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×