E-Paper
Advertisement

Mars Rocks : 54 కోట్ల ఏళ్ల నాటి అంగారక శిల

Mars Rocks : 54 కోట్ల ఏళ్ల నాటి అంగారక శిల
Advertisement
Mars Rocks

Mars Rocks : భూమిపైకి అంతరిక్ష శిలలు దూసుకొస్తుంటాయి. మన పొరుగునే ఉన్న అంగారక గ్రహం నుంచి రాలి పడిన ఉల్కలూ వాటిలో ఉన్నాయి. అలా 360 వరకు అరుణ గ్రహం నుంచి భూగోళానికి చేరాయి. వీటి వయసు ఎంతనేది నిర్థారించడం ఎంతో సంక్లిష్టం. అయితే అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిలో ఈ చిక్కుముడిని విప్పారు.

వాస్తవానికి ఆ శిలలు ఇటీవలి కాలానివేనని.. అంటే వందల మిలియన్ల సంవత్సరాల నాటివేనని తేలడం వారిని విస్మయపరిచింది. దీనిని బట్టి అంగారక శిలలు భూమిపైకి చేరడానికి పట్టిన సమయం, ఆ గ్రహం జియెలాజికల్ ప్రక్రియ గురించి తాజా సమాచారం ద్వారా ఓ అవగాహనకు రావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

కొన్ని శిలల రసాయనిక లక్షణాలను బట్టి అవి కచ్చితంగా అంగారక శిలలేనని చెప్పొచ్చని పరిశోధనకు సారథ్యం వహించిన వోల్కనాలజిస్ట్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్త బెన్ కోహెన్ స్పష్టం చేశారు. అంగాకర గ్రహాన్ని భారీ ఆస్టరాయిడ్ల వంటివి ఢీకొన్నట్టు.. దాని ఉపరితలంపై వేల సంఖ్యలో ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల ద్వారా స్పష్టమవుతోంది. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని శిలలు ఎగసి.. సౌరవ్యవస్థ ద్వారా ప్రయాణించి భూమిపై పడినట్టు చెబుతున్నారు.

అయితే రాలి పడిన ఉల్కలు అంగారకుడివా? లేక వేరొక గ్రహానివా? అన్న విషయంలో మీమాంస ఉండేది. ఆ శిలల వయసును లెక్కించడం ద్వారా అవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది తెలుసుకునే వీలుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు సేకరించిన మార్టియన్ శిలల్లో 302 వరకు షెర్‌గాటైట్ రకానికి చెందినవే. ఈ రకం శిలల్లో లోహధాతువులు అధికం. మార్స్‌పై అగ్నిపర్వత పేలుళ్ల ప్రక్రియ కారణంగా ఏర్పడిన శిలలను షెర్‌గాటైట్ రకంగా వర్గీకరించారు.

Advertisement

అరుణగ్రహంపై క్రేటర్లను బట్టి చూస్తే.. ఈ శిలలు చాలా పురాతనమైనవనే భావన ఉండేది. కానీ ఆగాన్-ఆగాన్ డేటింగ్‌ సాయంతో వాటి వయసు చాలా తక్కువేనన్న నిర్థారణకు వచ్చారు. రిసెర్చికి ఉద్దేశించిన ఓ న్యూక్లియర్ రియాక్టర్‌లో అంగారక శిలలకు చెందిన ఏడు చిన్న చిన్న శాంపిళ్లను ఉంచారు. తద్వారా ఆ శాంపిళ్లలో ఆగాన్ రసాయనక మూలకం ఎంత ఉందన్నదీ కచ్చితంగా లెక్కించారు.

ఆ శిలలు 16-54 కోట్ల సంవత్సరాల క్రితం భూమికి చేరినట్టుగా ఆగాన్-ఆగాన్ డేటింగ్ ద్వారా ధ్రువీకరించుకున్నారు. రోదసిలో ఉండగా శిలకు అదనంగా ఆగాన్ ఏదైనా చేరిందా? అన్నది కూడా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. యురేనియం-లెడ్ డేటింగ్ వంటి ఇతర పద్ధతులతో వచ్చిన ఫలితాలతో పోల్చి చూసినప్పుడు ఆగాన్-ఆగాన్ ఫలితాలు సరిపోలాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×