E-Paper
Advertisement

ఏంటీ, ల్యాప్‌టాప్‌ Type-C పోర్ట్‌తో.. ఇన్ని అద్భుతాలు చేయెుచ్చా? ఇన్నాళ్లు ఛార్జింగ్‌కే అనుకున్నామే!

ఏంటీ, ల్యాప్‌టాప్‌ Type-C పోర్ట్‌తో.. ఇన్ని అద్భుతాలు చేయెుచ్చా? ఇన్నాళ్లు ఛార్జింగ్‌కే అనుకున్నామే!
Advertisement

Laptop Type-C Port: ల్యాప్‌టాప్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ దానికున్న టైప్-సి (Type-C) పోర్ట్ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది దీనిని కేవలం ల్యాప్‌టాప్ ఛార్జ్ చేయడానికో లేదా మొబైల్ నుండి డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికో మాత్రమే వాడుతుంటారు. కానీ ఈ చిన్న పోర్ట్ వెనుక తెలియని ఎన్నో అద్భుతమైన ఫీచర్లు దాగున్నాయి. రోజువారీ పనిని మరింత సులువుగా, వేగంగా మార్చే ఆ 5 సీక్రెట్ ఫీచర్లు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

మల్టిపుల్ డిస్‌ప్లేలు

ల్యాప్‌టాప్ స్క్రీన్ చిన్నదిగా అనిపిస్తే.. టైప్-సి పోర్ట్ ద్వారా అదనపు మానిటర్ లేదా స్మార్ట్ టీవీని సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా HDMI కేబుల్ అవసరం లేదు. ‘డిస్‌ప్లే పోర్ట్ (DP)’ సపోర్ట్ ఉన్న టైప్-సి కేబుల్ ద్వారా హై-డెఫినిషన్ (4K) విజువల్స్‌ను వేరే స్క్రీన్ పైకి టెలికాస్ట్ చేయవచ్చు.

రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ

Advertisement

సీ-పోర్ట్ ద్వారా ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయడమే కాకుండా అవసరమైనప్పుడు ల్యాప్‌టాప్ నుండి ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ లేదా బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు టైప్-సి కేబుల్ ద్వారా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి పవర్‌బ్యాంక్‌లా వాడుకోవచ్చు. ల్యాప్‌టాప్ స్లీప్ మోడ్‌లో ఉన్నా కూడా కొన్ని మోడల్స్ ఈ రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

సూపర్ ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్

సాధారణ USB పోర్ట్‌లతో పోలిస్తే టైప్-సి పోర్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ వేగం చాలా ఎక్కువ. ముఖ్యంగా మీ ల్యాప్‌టాప్‌లో ‘థండర్‌బోల్ట్’ లేదా USB 3.2 సపోర్ట్ ఉన్న టైప్-సి పోర్ట్ ఉంటే కేవలం కొన్ని సెకన్లలోనే జీబీలలో ఉన్న భారీ ఫైళ్లను, సినిమాలను ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల మీ సమయం ఎంతో ఆదా అవుతుంది.

ఎక్స్‌టర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ కనెక్ట్

Advertisement

హెవీ గేమింగ్ ఆడేవారు, వీడియో ఎడిటింగ్ చేసేవారు తమ ల్యాప్ టాప్ లో గ్రాఫిక్స్ సామర్థ్యం తక్కువగా ఉందని భాదపడుతుంటారు. అయితే టైప్-సి (Thunderbolt) పోర్ట్ సాయంతో బయట నుండి ఎక్స్‌టర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ (eGPU)ను కనెక్ట్ చేయవచ్చు. దీనివల్ల సాధారణ ల్యాప్‌టాప్ కూడా హై-ఎండ్ గేమింగ్ బీస్ట్‌లా మారిపోతుంది.

Also Read: ఇన్వర్టర్ ఏసీలు నిజంగానే కరెంట్ బిల్లును ఆదా చేస్తాయా? కొనేముందు తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు!

‘ఆల్ ఇన్ వన్’ హబ్ కనెక్టివిటీ

టైప్-సి పోర్ట్ ఉన్న ఒకే ఒక్క ‘టైప్-సి డాంగిల్ లేదా హబ్’ (Type-C Hub) కొనుగోలు చేస్తే చాలు. ఆ ఒక్క పోర్ట్ నుండి మీరు పెన్‌డ్రైవ్‌లు, మౌస్, కీబోర్డ్, ప్రొజెక్టర్, ఈథర్‌నెట్ (ఇంటర్నెట్ కేబుల్), ఎస్‌డీ కార్డ్‌లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను స్లిమ్ గా మార్చేందుకు కంపెనీలు మిగతా పోర్టులను తీసేసినా.. ఈ ఒక్క పోర్ట్‌తో అన్ని అవసరాలనూ తీర్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Also Read: ఏసీ వేసినా ఇల్లు వేడెక్కుతోందా? కూలింగ్‌ను దోచేస్తున్న.. ఆరుగురు దొంగలు వీళ్లే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×