E-Paper
Advertisement

Best Portable Mini ACs: మార్కెట్లోకి అదిరిపోయే పోర్టబుల్ ఏసీలు.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు!

Best Portable Mini ACs: మార్కెట్లోకి అదిరిపోయే పోర్టబుల్ ఏసీలు.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు!
Advertisement

Best Portable Mini ACs: మరికొన్ని రోజుల్లో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక హైదరాబాద్ ఎండల గురించి మనందరికీ తెలిసిందే. భానుడు భగభగ మండుతుంటే బయటికి వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉండటం కూడా నరకంగానే అనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ లక్షలు పోసి పెద్ద ఏసీలు కొనుక్కోలేరు. పైగా అద్దె ఇళ్లలో ఉండేవారికి వాటిని ఫిక్స్ చేయడం మరో తలనొప్పి. అలాంటి వారి కోసం ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో, గదిని కూల్‌గా ఉంచే టాప్-5 పోర్టబుల్ ఏసీల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1) Blue Star 1 Ton Portable AC

భారతదేశంలో బ్లూ స్టార్ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ పోర్టబుల్ ఏసీ చిన్న గదులను చాలా వేగంగా చల్లబరుస్తుంది. ఇందులో కాపర్ పార్ట్స్ ఉండటం వల్ల ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. దీనికి చక్రాలు ఉంటాయి కాబట్టి.. ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టబుల్ ఏసీ ధర సుమారు రూ.30,000 నుండి రూ.35,000 మధ్య ఉంటుంది.

2) Cruise PortaQool 1 Ton Portable AC

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ కోరుకునే వారికి క్రూయిజ్ ఒక మంచి ఆప్షన్. దీనిలో డస్ట్ ఫిల్టర్స్ ఉండటం వల్ల గాలి చల్లగానే కాకుండా శుభ్రంగా కూడా వస్తుంది. హైదరాబాద్‌లోని విపరీతమైన వేడిని తట్టుకోవడానికి ఇది సరైన ఎంపిక అనే చెప్పాలి. దీని ధర సుమారు రూ.27,000 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: హీటింగ్ సమస్యతో మీ ల్యాప్‌టాప్ స్లో అవుతోందా? ఈ సెట్టింగ్స్ ఓసారి మార్చి చూడండి!

3) Haier 0.8 Ton Portable AC

Advertisement

మరీ చిన్న బెడ్‌రూమ్ లేదా ఆఫీస్ క్యాబిన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ హైయర్ 0.8 టన్ ఏసీ బాగా సెట్ అవుతుంది. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. తక్కువ ధరలో మెరుగైన పనితీరు అందించే ఏసీల కోసం చూస్తున్నవాళ్లు దీనిని కొనుగోలు చేయొచ్చు. దీని ధర సుమారు రూ.25,000 ఉంటుంది. దీనిలో డీహ్యూమిడిఫైయర్ సౌకర్యం కూడా ఉంది.

4) Lloyd 1 Ton Portable AC

లాయిడ్ కంపెనీ ఏసీలు సర్వీస్ పరంగా చాలా నమ్మకమైనవి. దీనిలో ఆటో స్వింగ్, క్లీన్ ఫిల్టర్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా అద్దె ఇళ్లలో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు దీన్ని ఎక్కడికైనా మీ వెంటే తీసుకెళ్లొచ్చు. ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ.35,000 పైన ఉంటుంది.

5) Midea Portable AC

మిడియా కంపెనీ తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచే ఏసీలను తయారు చేస్తుంది. ఇది పర్యావరణానికి మేలు చేసే గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. కొంచెం స్పేస్ ఉన్నవారికి, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఏసీ ధర సుమారు రూ.30,000 రేంజ్‌లో ఉంటుంది.

Also Read: మీ ఫ్రిడ్జ్.. ఫ్రీజర్ నిండా ఐసు పెట్టేసిందా? ఈ ఒక్క పని చేయండి.. ఇంకెప్పుడూ అలా జరగదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×