E-Paper
Advertisement

చిన్న ఫ్లాట్స్ కోసం బెస్ట్ టూ-ఇన్-వన్ వాషింగ్ మెషీన్లు.. ఫీచర్లు ఇవే!

చిన్న ఫ్లాట్స్ కోసం బెస్ట్ టూ-ఇన్-వన్ వాషింగ్ మెషీన్లు.. ఫీచర్లు ఇవే!
Advertisement

Space-Saving Washer-Dryers 2026: మెట్రో సిటీస్ లో హైరైజ్ అపార్ట్‌మెంట్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. అయితే ఈ ఫ్లాట్స్‌లో ఉండే ప్రధాన సమస్య.. స్పేస్ క్రంచ్ , బట్టలు ఆరబెట్టుకోవడానికి సరైన బాల్కనీ స్పేస్ లేకపోవడం. ఈ సమస్యకు వన్-స్టాప్ సొల్యూషన్ ‘వాషర్-డ్రైయర్ కాంబో’ మెషీన్లు. ఇవి ఒకే డివైజ్‌లో బట్టలను పర్ఫెక్ట్‌గా ఉతకడమే కాకుండా.. 100% డ్రై చేసి ఇస్తాయి. అపార్ట్‌మెంట్‌లలో తక్కువ స్థలాన్ని ఆక్రమించే టాప్ 5 బ్రాండెడ్ వాషర్-డ్రైయర్ కాంబోల ఫీచర్లు, వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.LG 9 Kg/5 Kg Washer Dryer:

మార్కెట్లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల విభాగంలో.. ఎల్‌జీ నంబర్ వన్ రేటింగ్‌లో కొనసాగుతోంది. ఈ మోడల్ 9 కేజీల వాషింగ్ కెపాసిటీ , 5 కేజీల డ్రైయింగ్ కెపాసిటీతో వస్తుంది. దీనిలోని ‘AI DD’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ డ్రైవ్) టెక్నాలజీ బట్టల ఫాబ్రిక్‌ను గుర్తించి, దానికి తగినట్లుగా డ్రమ్ మూవ్‌మెంట్‌ను సెట్ చేస్తుంది. దీని వల్ల బట్టలు పాడవకుండా ఉంటాయి. ఇందులోని ‘టర్బో వాష్’ ఫీచర్ తక్కువ సమయంలోనే.. వాషింగ్ పూర్తి చేస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.45,990 నుంచి రూ.48,500 వరకు అందుబాటులో ఉంది.

2.Samsung 8 Kg/6 Kg Wi-Fi Enabled:

Advertisement

సామ్‌సంగ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ వాషర్ డ్రైయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , వై-ఫై కనెక్టివిటీతో పనిచేస్తుంది. అంటే మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే దీనిని ఆపరేట్ చేయవచ్చు. దీనిలోని ‘ఎకోబబుల్’ టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి, బట్టల లోపలి వరకు క్లీన్ చేస్తుంది. దీని హైజీన్ స్టీమ్ ఫీచర్ బట్టలలోని 99.9% బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చిన్న ఫ్యామిలీస్ ఉన్న అపార్ట్‌మెంట్‌లకు ఇది పర్ఫెక్ట్ స్పేస్ సేవర్‌గా అని చెప్పొచ్చు. మార్కెట్లో దీని ప్రస్తుత ధర సుమారుగా రూ.42,990 నుంచి రూ.46,000 వరకు ఉంది.

3. IFB 8.5 Kg/5.5 Kg Turbo Dry:

క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఐఎఫ్బీ.. అపార్ట్‌మెంట్ వాసుల కోసం ఈ బెస్ట్ కాంబోను డిజైన్ చేసింది. ఇందులోని ‘టర్బో డ్రై’ ఫీచర్ వర్షాకాలం, చలికాలంలో కూడా బట్టలను 100% ఆరబెట్టి, నేరుగా ఐరన్ చేసుకునేలా ఇస్తుంది. హార్డ్ వాటర్‌ను సాఫ్ట్ వాటర్‌గా మార్చే ‘ఆక్వా ఎనర్జీ’ టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది డిటర్జెంట్‌ను బాగా కరిగిస్తుంది. అంతే కాకుండా బట్టలపై ఉన్న మరకలను తొలగించడంలో ఇది టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.48,990 నుంచి రూ. 52,490 వరకు పలుకుతోంది.

Advertisement

Also Read: రూ.1,500 లోపే బెస్ట్ స్మార్ట్‌వాచ్.. బోట్ ఎక్స్‌టెండ్ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

4.Bosch 9 Kg/6 Kg Inverter Combo:

జర్మన్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో.. వచ్చే బాష్ వాషింగ్ మెషీన్లు నిశ్శబ్దంగా పని చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అపార్ట్‌మెంట్‌లలో పక్క పక్కనే ఫ్లాట్స్ ఉండటం వల్ల ఎక్కువ శబ్దం వచ్చే మెషీన్లు ఇబ్బంది కలిగిస్తాయి. కానీ.. ఇందులోని ‘ఎకోసైలెన్స్ డ్రైవ్’ మోటార్ ఎలాంటి వైబ్రేషన్ లేదా సౌండ్ లేకుండా క్లీన్ చేస్తుంది. దీని ‘స్పీడ్ పర్ఫెక్ట్’ ఆప్షన్ ద్వారా 65% తక్కువ సమయంలోనే.. బట్టలు ఉతకవచ్చు. దీని కూల్ అండ్ హాట్ డ్రైయింగ్ సిస్టమ్ బట్టల క్వాలిటీని కాపాడుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.54,000 నుంచి రూ,58,500 వరకు ఉంటుంది.

5.Lloyd 8 Kg/5 Kg Combo:

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఆశించే వారికి హ్యావెల్స్ సంస్థకు చెందిన లాయిడ్ వాషర్ డ్రైయర్ ఒక మంచి ఆప్షన్. ఇందులో 1400 ఆర్పీఎమ్ స్పీడ్ ఉండటం వల్ల బట్టలలోని నీరు చాలా వేగంగా పిండబడుతుంది. ఆ తర్వాత డ్రైయర్ బట్టలను పూర్తిగా ఆరబెడుతుంది. ఇన్వర్టర్ మోటార్ కావడం వల్ల పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. దీని కాంపాక్ట్ సైజ్ డిజైన్ కిచెన్ కింద లేదా చిన్న వాష్ ఏరియాలో ఈజీగా సెట్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.37,990 నుంచి రూ.41,000 వరకు లభిస్తోంది.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న ధరలు ఆన్‌లైన్ ఇ-కామర్స్ పోర్టల్స్ (Flipkart/Amazon), బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, సేల్స్ ఆఫర్లను బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొనే ముందే లేటెస్ట్ ఆఫర్లను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×