E-Paper
Advertisement

కూలర్ విసిగిస్తోందా? ఈ 4 పనులు చేస్తే చాలు.. రూమ్ చిల్ అయిపోద్ది!

కూలర్ విసిగిస్తోందా? ఈ 4 పనులు చేస్తే చాలు.. రూమ్ చిల్ అయిపోద్ది!
Advertisement

Air Cooler: జూన్ నెల వచ్చినా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇళ్లల్లోని ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు కూలర్ల ద్వారా ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే కూలర్ ను ఆన్ చేసినప్పుడు అని సరిగ్గా పనిచేయకపోతే.. ఇక అది వేస్ట్ అన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చేస్తుంటారు. కొత్త కూలర్ కొనేందుకు సిద్దమైపోతుంటారు. కానీ పాత కూలర్ నే కొత్తగా, సరికొత్తగా మార్చేసే అద్భుతమైన చిట్కాలు ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై లుక్కేయండి.

కూలింగ్ ప్యాడ్ల క్లీనింగ్

కూలర్ సరిగ్గా చల్లటి గాలిని ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అందులోని కూలింగ్ ప్యాడ్లు అని నిపుణులు అంటున్నారు. వాటిపై ధూళి, ఉప్పు పేరుకుపోయి గాలి సరిగ్గా లోపలికి రాలేకపోతున్నట్లు అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి ప్యాడ్లపై మట్టి ఎక్కువగా పేరుకుపోయి ఉంటే వెంటనే దాన్ని వాటర్ పైపు సాయంతో క్లీన్ చేయాలని హితవు పలుకుతున్నారు. ఒకవేళ కూలింగ్ ప్యాడ్లు తిరిగి వాడటానికి పనికిరావని భావిస్తే.. మార్కెట్లో దొరికే కొత్త హనీకోంబ్ ప్యాడ్లను తెచ్చి ఫిక్స్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే కూలర్ కూలింగ్ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

వాటర్ పంప్, పైపుల చెకింగ్

Advertisement

కూలర్ మోటార్ తిరుగుతున్నా గాలి చల్లగా రావడం లేదంటే.. నీరు ప్యాడ్ల వరకు చేరడం లేదని అర్థం. కూలర్ కింది భాగంలో ఉండే వాటర్ పంప్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందు చెక్ చేయాలని నిపుణులు అంటున్నారు. పంప్ నుండి ప్యాడ్లకు నీటిని తీసుకెళ్లే చిన్న చిన్న పైపుల్లో ఒక్కోసారి నాచు లేదా ఉప్పు పేరుకుపోయి బ్లాక్ అవుతుంటాయని తెలియజేస్తున్నారు. ఒక పిన్ సహాయంతో ఆ రంధ్రాలను క్లీన్ చేస్తే నీటి సరఫరా సాఫీగా సాగి.. ఒకప్పటిలా కూలింగ్ బాగా వస్తుందని సూచిస్తున్నారు.

క్రాస్ వెంటిలేషన్

చాలామంది ఏసీ తరహాలో కూలర్ రూమ్‌ను కూడా మొత్తం క్లోజ్ చేసి ఉంచుతుంటారు. దీనివల్ల గదిలో తేమ, ఉక్కపోత పెరిగిపోతాయి. ఫలితంగా కూలర్ ఎంత బాగా పనిచేస్తున్నా చల్లదనం అనిపించదని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి గదిలోని వేడి గాలి బయటకు వెళ్లడానికి కూలర్‌కు ఎదురుగా ఉండే మరో కిటికీని కొద్దిగా తెరిచి ఉంచాలని సూచిస్తున్నారు. ఈ క్రాస్ వెంటిలేషన్ చిట్కా పాటిస్తే.. కూలర్ అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నారు.

Advertisement

Also Read: కూలర్ + ఎగ్జాస్ట్ ఫ్యాన్.. క్రేజీ కాంబినేషన్ భయ్యా.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

ఐస్ వాటర్ ట్రిక్

రూమ్ ఏసీ తరహాలో చల్లగా ఉండాలని భావిస్తే.. ఐస్ వాటర్ చిట్కాను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కూలర్ ట్యాంకులో సాధారణ నీటితో పాటు కొన్ని ఐస్ క్యూబ్స్ లేదా బాగా చల్లటి నీటిని వేయాలని పేర్కొంటున్నారు. అప్పుడు కూలర్ ను వచ్చే గాలి.. చాలా చల్లగా ఉంటూ ఏసీని గుర్తుకు తెస్తుందని తెలియజేస్తున్నారు. కొత్త ఏసీ లేదా కూలర్ ను కొనే బదులు.. ఈ చిన్న చిన్న చిట్కాలతో పాత కూలర్ నే కొత్తగా మార్చుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: భూ కబ్జా ఆరోపణలు.. కోర్టులో పవన్‌కు బిగ్ రిలీఫ్.. సంచలన ఉత్తర్వులు జారీ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×