// // BLDC Motor 1200 mm Ceiling Fan: బడ్జెట్ ధరలో.. రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్ -->
E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో.. రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్, ఫుల్ కరెంట్ సేవ్ !

బడ్జెట్ ధరలో.. రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్, ఫుల్ కరెంట్ సేవ్ !
Advertisement

BLDC Motor 1200 mm Ceiling Fan: పెరిగే కరెంట్ బిల్లుల టెన్షన్‌కు చెక్ పెట్టే టైం వచ్చేసింది. మీ ఇంటికి అదిరిపోయే గాలిని ఇస్తూనే, కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించే.. సూపర్ గ్యాడ్జెట్ 30W BLDC మోటార్ 1200 mm సీలింగ్ ఫ్యాన్. కేవలం 30 వాట్ల కరెంట్‌ను మాత్రమే వాడుకునే ఈ స్మార్ట్ ఫ్యాన్, 3 ఏళ్ల వారంటీతో వస్తుంది. స్టైలిష్ లుక్, రిమోట్ కంట్రోల్ ఫీచర్లతో.. పాతకాలపు ఫ్యాన్లకు గుడ్ బై చెప్పి, ఈ ట్రెండీ ఫ్యాన్‌ను మీ ఇంట్లోకి తెచ్చుకోవడానికి ఇదే బెస్ట్ టైమ్.

30W BLDC 1200 mm సీలింగ్ ఫ్యాన్:

Advertisement

ఈ రోజుల్లో ఇంట్లో ఏ వస్తువు కొన్నా స్మార్ట్‌గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా రోజంతా తిరిగే ఫ్యాన్ల వల్ల కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్‌కు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తోంది కొత్త తరం 30W BLDC 1200 mm సీలింగ్ ఫ్యాన్. నార్మల్ ఫ్యాన్లతో పోలిస్తే.. ఇది చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

BLDC టెక్నాలజీ అంటే ఏంటి?

Advertisement

సాధారణ ఫ్యాన్లు 70 నుంచి 80 వాట్ల కరెంట్ వాడుకుంటే.. ఈ BLDC ఫ్యాన్ కేవలం 30 వాట్లు మాత్రమే తీసుకుంటుంది. అంటే.. మీ పాత ఫ్యాన్ తిరిగే కరెంట్‌తో.. ఈ ఫ్యాన్లు రెండు వాడుకోవచ్చు. దీని వల్ల ప్రతి నెల మీ కరెంట్ బిల్లులో భారీగా సేవ్ అవుతుంది.

1200 mm స్వీప్:

ఈ ఫ్యాన్ 1200 mm (48 ఇంచులు) బ్లేడ్ సైజ్‌తో వస్తుంది. ఇది బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ లేదా హాల్‌ లాంటి మీడియం, పెద్ద సైజ్ గదులకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. హై-స్పీడ్ ఎయిర్ డెలివరీ వల్ల గదిలో ప్రతీ మూలకు గాలి సమానంగా అందుతుంది. ఇన్వర్టర్‌పై వాడినా కూడా ఇది చాలా ఎక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంది.

రిమోట్ కంట్రోల్ & స్మార్ట్ ఫీచర్స్:

ఈ ఫ్యాన్‌తో పాటు ఒక స్మార్ట్ రిమోట్ వస్తుంది. పడుకున్న చోటు నుండే.. స్పీడ్ పెంచడం, తగ్గించడం చేయవచ్చు. ఇందులో ఉండే ‘టైమర్ మోడ్’ ద్వారా నైట్ టైమ్ ఫ్యాన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే.. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ఈ మోటార్ పాడవకుండా స్థిరంగా తిరుగుతుంది.

3 ఇయర్స్ వారంటీ:

కంపెనీ ఈ ఫ్యాన్ మోటార్‌పై ఏకంగా 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. లాంగ్ లైఫ్, ప్రీమియం డిజైన్, నోయిస్-లెస్ (శబ్దం లేని) ఆపరేషన్, 3 ఏళ్ల వారంటీ.. ఇవన్నీ చూస్తుంటే మీ పాత ఫ్యాన్‌ను మార్చేసి ఈ స్మార్ట్ BLDC ఫ్యాన్‌ను ఇంటికి తెచ్చుకోవడం బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×