E-Paper
Advertisement

ఏసీ కొనేముందు ఈ పొరపాటు చేయకండి! మీ కరెంట్ బిల్లును సగం చేసే స్మార్ట్ టిప్స్

ఏసీ కొనేముందు ఈ పొరపాటు చేయకండి! మీ కరెంట్ బిల్లును సగం చేసే స్మార్ట్ టిప్స్
Advertisement

3-star Vs 5-star AC: మండుతున్న ఎండల నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఏసీ తప్పనిసరి. అయితే.. ఏసీ వాడకం పెరిగే కొద్దీ కరెంట్ బిల్లు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మార్కెట్లో 3 స్టార్ ఏసీ తక్కువ ధరకు దొరుకుతుంటే.. 5-స్టార్ ఏసీ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి ముందే ఎక్కువ ఖర్చు పెట్టి 5-స్టార్ ఏసీ కొనడం లాభమా? లేక తక్కువ ధరలో 3-స్టార్ ఏసీ సరి పోతుందా? ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? మీ వాడకాన్ని బట్టి ఏది తక్కువ ఖర్చుతో కూడుకుందో వివరంగా తెలుసుకుందాం.

ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో సమ్మర్ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏసీ కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. అది మన నెలవారీ బడ్జెట్‌లో ఒక పెద్ద ఖర్చుగా మారుతుంది.

ISEER రేటింగ్ అంటే ఏంటి?

Advertisement

ఏసీ సామర్థ్యాన్ని కొలవడానికి మన దేశంలో ISEER (Indian Seasonal Energy Efficiency Ratio) ఉపయోగిస్తారు. స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ ఏసీ కరెంట్ ఖర్చు తగ్గుతుంది.

3-స్టార్ ఏసీ (1.5 టన్): గంటకు సుమారు 1.5 యూనిట్ల కరెంట్ వాడుకుంటుంది.

Advertisement

5-స్టార్ ఏసీ (1.5 టన్): గంటకు సుమారు 1.2 యూనిట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటుంది.

ఖర్చుల లెక్కలివే! (నెలవారీ అంచనా):
యూనిట్ కరెంట్ ధర రూ. 7 అని అనుకుందాం. రోజుకు 8 గంటలు ఏసీ వాడితే..

3-స్టార్ ఏసీ: రోజుకు రూ.84 ఖర్చవుతుంది. అంటే నెలకు సుమారు రూ. 2,520.

5-స్టార్ ఏసీ: రోజుకు రూ. 67.20 ఖర్చవుతుంది. అంటే నెలకు సుమారు రూ. 2,016.

నెలవారీగా మీరు 5-స్టార్ ఏసీ ద్వారా దాదాపు రూ. 500 సేవ్ చేయవచ్చు. ఏడాదిలో (సుమారు 200 రోజులు వాడితే) రూ. 3,360 పైగా సేవ్ చేయవచ్చు.

కొనేటప్పుడు ధరలో తేడా:
సాధారణంగా 3-స్టార్ ఏసీ కంటే 5-స్టార్ ఏసీ ధర రూ. 10,000 వరకు ఎక్కువగా ఉంటుంది.

3-స్టార్ ఏసీ: రూ.32,000-40,000.

5-స్టార్ ఏసీ:రూ. 42,000-55,000.

పెట్టిన పెట్టుబడి ఎప్పుడు వెనక్కి వస్తుంది?:
మీరు పెట్టిన అదనపు రూ. 10,000 పెట్టుబడి, కరెంట్ బిల్లుల ఆదా ద్వారా 3 నుంచి 4 ఏళ్లలో తిరిగి వచ్చేస్తుంది. అంటే 4వ సంవత్సరం నుంచి మీరు నిజంగా డబ్బు ఆదా చేయడం ప్రారంభిస్తారు. ఒక ఏసీ సగటు జీవితకాలం 8-10 ఏళ్లు అనుకుంటే.. 5-స్టార్ ఏసీ ఎల్లప్పుడూ లాభదాయకమే.

మీ వాడకాన్ని బట్టి నిర్ణయించుకోండి:
తక్కువ వాడకం: మీరు రోజుకు 3-4 గంటలు మాత్రమే ఏసీ వాడితే లేదా కేవలం రాత్రి పూట మాత్రమే వేసుకుంటే 3-స్టార్ ఏసీ బెస్ట్. ఎందుకంటే ఆ తక్కువ వాడకానికి 5-స్టార్ ఏసీ కోసం పెట్టిన అదనపు ఖర్చు రికవరీ అవ్వడానికి చాలా కాలం పడుతుంది.

ఎక్కువ వాడకం: మీరు రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడితే కళ్ళు మూసుకుని 5-స్టార్ ఏసీ తీసుకోండి. ఇది మీ కరెంట్ బిల్లును భారీగా తగ్గిస్తుంది.

చివరగా.. 5-స్టార్ ఏసీ కేవలం డబ్బునే కాదు, పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది. ఇది తక్కువ శక్తిని వాడుకోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది. మీ బడ్జెట్ అనుమతిస్తే 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీయే బెస్ట్ ఆప్షన్. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను కూడా తక్కువ స్పీడ్‌లో వాడితే.. ఏసీ ఉష్ణోగ్రతను 24-26°C వద్ద ఉంచుకోవచ్చు. దీని వల్ల మరో 20% కరెంట్ ఆదా అవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×