E-Paper
Advertisement

iPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 సంచలనం.. బడ్జెట్ ఫోన్లను వెనక్కి నెట్టి నెంబర్-1 స్థానానికి!

iPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 సంచలనం.. బడ్జెట్ ఫోన్లను వెనక్కి నెట్టి నెంబర్-1 స్థానానికి!
Advertisement

iPhone 16: ఒకప్పుడు భారతదేశంలో ఎక్కువ శాతం మంది బడ్జెట్ ధరలో వచ్చే స్మార్ట్‌ఫోన్లనే వినియోగించేవారు. బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు ఉన్న ఫోన్ల కోసం యువత తెగ వెతికేసేవారు. కానీ గతేడాది (2025) నుంచి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తక్కువ ధర ఫోన్ల కంటే క్వాలిటీ, మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న ప్రీమియం ఫోన్లకే మనవాళ్లు జై కొడుతున్నారు. దీనికి నిదర్శనమే iPhone 16 సాధించిన క్రేజీ సక్సెస్. గతేడాది భారతదేశంలో హాట్ కేకుల్లా అమ్ముడైన ఫోన్ ఏదైనా ఉందంటే.. అది ఐఫోన్ 16 బేస్ మోడలే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. యాపిల్ బ్రాండ్ ఐఫోన్ల ధరలను సైతం లెక్క చేయకుండా.. అధిక సంఖ్యలో కొనుగోలు చేయడమే.

రికార్డు స్థాయి అమ్మకాలు..

తాజాగా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్ట్ చూస్తే మైండ్ పోతుంది. గతేడాది ఇండియాలో మొత్తం 15.4 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడైతే.. అందులో ఒక్క ఐఫోన్ 16 మోడలే ఏకంగా 66.1 లక్షల యూనిట్లు అమ్ముడయ్యింది. అంటే.. మొత్తం మార్కెట్‌లో 4 శాతం వాటా ఈ ఒక్క ఫోన్‌దేనన్నమాట. 2024 సెప్టెంబర్‌లో రూ.71,000 ప్రారంభ ధరత మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్.. భారతీయులను అంతలా మెప్పించడం నిజంగా విశేషం.

Advertisement

Also Read: ఐకూ నుంచి రెడ్‌మీ వరకు.. రూ.30వేల బడ్జెట్‌లో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు!

ఈ క్రేజ్‌కు కారణమేంటి?

యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఒక ఎత్తయితే.. మధ్యతరగతి వాళ్లకు కూడా ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చిన Easy EMI ఆప్షన్లు మరో ఎత్తు. ప్రస్తుతం ప్రీమియం ఫోన్లు కొంటున్న వారిలో 10 మందిలో ఆరుగురు సులభ వాయిదాల పద్ధతినే ఎంచుకుంటున్నారు. దీనికి తోడు పాత ఫోన్లను ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకునే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా తోడవడంతో, ఐఫోన్ కొనడం ఇప్పుడు ఈజీ అయిపోయింది.

భారత్‌‌ను ఫోకస్ చేసిన యాపిల్..

Advertisement

యాపిల్ వ్యవస్థాపకుడు టిమ్ కుక్ కూడా ఇండియా మార్కెట్ మనకు చాలా ముఖ్యం అని చాలాసార్లు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే అక్టోబర్, డిసెంబర్ నెలల్లో యాపిల్ ఇండియాలో సరికొత్త రెవెన్యూ రికార్డులను సెట్ చేసింది. కేవలం అమ్మడమే కాదు.. ఐఫోన్ల తయారీకి కూడా ఇండియాను మెయిన్ సెంటర్‌గా మార్చేస్తోంది యాపిల్. ముంబైలో కొత్త స్టోర్ పెట్టడం, దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ పెంచడం చూస్తుంటే వాళ్ల ప్లాన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో అర్థమవుతుంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫీచర్లు లీక్.. కెమెరా, బ్యాటరీ, కీలక వివరాలు మీ కోసం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×