E-Paper
Advertisement

జియో vs ఎయిర్‌టెల్.. రూ.355 ప్లాన్ల మధ్య గట్టి పోటీ.. రెండింట్లో ఏది బెస్ట్ అంటే?

జియో vs ఎయిర్‌టెల్.. రూ.355 ప్లాన్ల మధ్య గట్టి పోటీ.. రెండింట్లో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Jio vs Airtel: ప్రస్తుతం దేశంలో అత్యధిక మంది యూజర్లను కలిగిన ప్రైవేటు టెలికాం రంగ సంస్థలుగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి. తమ కస్టమర్ల కోసం ఈ కంపెనీలు.. ఎన్నో రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఒకే ధరకు తీసుకొచ్చిన రూ.355 ప్లాన్.. ప్రస్తుతం బాగా పాపులర్ అవుతోంది. ఈ నేపథ్యంలో బెన్ ఫిట్స్ పరంగా ఏ కంపెనీ ప్లాన్ మరింత అత్యుత్తమమైనదో ఈ కథనంలో పరిశీలిద్దాం.

డేటా, వ్యాలిడిటీ పరంగా…

జియో, ఎయిర్ టెల్ రెండూ రూ.355 ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. డేటా విషయానికి వస్తే.. రెండింటిలోనూ 25 GB డేటా యూజర్ కు లభించనుంది. అయితే ఈ డేటాకు ఎలాంటి డైలీ లిమిట్ లేవు. అంటే.. అవసరమైతే ఒకే రోజులో 25GB వినియోగించుకోవచ్చు. లేదంటే నెలాఖరు వరకూ పొదుపుగా వాడుకుంటూ రావొచ్చు.

అపరిమిత కాల్స్

Advertisement

కాలింగ్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ లో రెండు నెట్‌వర్క్‌లలోనూ దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్ చేసుకోవచ్చు. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఎస్ఎంఎస్ ల విషయంలో మాత్రం రెండూ ప్లాన్స్ ల మధ్య స్వల్ప తేడా ఉంది. జియో తన యూజర్లకు రోజుకు 100 SMSలను అందిస్తుండగా.. ఎయిర్‌టెల్ రూ.355 ప్లాన్‌ ద్వారా మొత్తం వ్యాలిడిటీ కాలానికి 300 ఎస్ఎంఎస్ లను మాత్రమే ఆఫర్ చేస్తోంది.

జియో అదనపు ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాల పరంగా ఎయిర్ టెల్ పై జియో కాస్త పైచేయి సాధించింది. రూ.355 ప్లాన్ తో 3 నెలల పాటు జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు. దీంతో పాటు 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రీమియం సేవలను కూడా జియో అందిస్తోంది. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్ లకు యాక్సెస్ సైతం కస్టమర్లకు లభించనుంది.

ఎయిర్‌టెల్ అడిషనల్ బెన్ ఫిట్స్

Advertisement

ఎయిర్‌టెల్ తన రూ.355 ప్లాన్‌తో క్రియేటివ్ యూజర్లను ఆకర్షిస్తోంది. ఇందులో సుమారు రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా ఇస్తోంది. ఫొటోలు, వీడియోలను ఎడిటింగ్ చేసి నిత్యం సోషల్ మీడియాలో పెట్టేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో పాటు హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సేవలు కూడా ఫ్రీగా ఎయిర్ టెల్ యూజర్ పొందొచ్చు.

Also Read: AC Buying Guide: ఎండ నేరుగా పడే పైఅంతస్తులకు.. ఎలాంటి ఏసీ కొంటే బెస్ట్.. సూటిగా సూత్తి లేకుండా..!

ఫైనల్గా ఏ ప్లాన్ బెస్ట్?

ఎంటర్ టైన్ మెంట్, క్లౌడ్ స్టోరేజ్ కోరుకునేవారికి జియో రూ.355 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అంతేకాకుడా 3 నెలలపాటు హాట్ స్టార్ ను ఉచితంగా అందిస్తుండటం ఈ ప్లాన్ లో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను (ఎయిర్ టెల్ లో నెలకు 300 SMSలు మాత్రమే) సైతం జియో ప్లాన్ లో పొందవచ్చు. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారైతే.. ఎయిర్ టెల్ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఎందుకుంటే అడోబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ దీనిలో ఉచితంగా అందిస్తుంది. అలాగే నాణ్యమైన ఫోన్ కాల్స్, వేగవంతమైన డేటా స్పీడ్ కు సైతం ఎయిర్ టెల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

Also Read: LPG యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయ్.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×