E-Paper
Advertisement

Ustaad Bhagath Singh Twitter Review : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ ఎట్లుంది..!

Ustaad Bhagath Singh Twitter Review : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ ఎట్లుంది..!
Advertisement

Ustaad Bhagath Singh Twitter Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి ఒక రేంజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఆయన సినిమా థియేటర్లోకి రాబోతుంది అంటే ఫాన్స్ చేస్తే హంగామా అంతా ఇంతా కాదు.. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. చివరగా వచ్చిన ఓజీ మూవీ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ కోసం ఫాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఉగాది కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది .. ఫ్యాన్స్ కు ఉగాది సర్ప్రైజ్ ఇచ్చిందో లేదో చూడాలి..

మాస్ సినిమాలకు పెట్టింది పేరు హరిష్ శంకర్.. గతంలో విడుదల గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమా రావడంతో ఈ సినిమాకి కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ శంకర్ వచ్చింది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమా మాత్రం మొదటి నుంచి మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశి ఖన్నా ఇందులో హీరోయిన్ గా నటించారు.. ఇవాళ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంది.. పబ్లిక్ ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ను ఇచ్చారో ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సూపర్ అంతే. అమ్మతోడు చచ్చిపోతారు. ఏంట్రా సినిమా అస్సలు ఊహించలేదు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను ఇలా చూపిస్తాడని అస్సలు అనుకోలేదు.. పేర్మినెంట్ గా పవన్ కళ్యాణ్ ఇతన్నే డైరెక్టర్ గా పెట్టుకోవాలి. థమన్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ, పవర్ స్టార్ టాప్ క్లాస్ మోడ్ లో ఉన్నాడు. సినిమా మొత్తం ఓ రేంజులో ఉంది. ప్రీ-ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ పీక్స్. థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.. మాస్ డైలాగులు కెవ్వు కేక అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్.. డ్యూటీ మాత్రం గట్టిగానే చేశాడు. ప్రతి సీన్ అదిరింది.. ప్రీ క్లైమాక్స్ మాములుగా లేదు. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అని ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం వచ్చేసింది. పవర్ బ్యాక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఉస్తాద్భగత్ సింగ్ మూవీ గ్రాండ్ థియేటర్లోకి వచ్చేసింది.. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్లు ఏమాత్రం వసూల్ అవుతాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×