E-Paper
Advertisement

Psychological Thriller OTT : పరేషాన్ చేసే ముగ్గురు ప్రాణ స్నేహితుల స్టోరీ… మర్డర్ మిస్టరీతో ఊహించని మలుపులు… ఓటీటీలోకి మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Psychological Thriller OTT : పరేషాన్ చేసే ముగ్గురు ప్రాణ స్నేహితుల స్టోరీ… మర్డర్ మిస్టరీతో ఊహించని మలుపులు… ఓటీటీలోకి మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Psychological Thriller OTT : ఓటీటీలోకి ఒక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ కథ అంతా లాస్ ఏంజిల్స్ నగరంలో ఉన్న ముగ్గురు హై క్లాస్ లేడీస్ చుట్టూ తిరుగుతుంది. ఒక హత్య చుట్టూ తిరిగే ఈ డ్రామాలో, చివరి నిమిషం వరకు అసలు హంతకుడు ఎవరనేది ఉత్కంఠగా ఉంటుంది. అంతేకాకుండా, స్నేహం పేరుతో ఒకరి జీవితాల్ని ఒకరు ఎలా నాశనం చేసుకున్నారో ఈ సిరీస్ లో చూడొచ్చు.

ఆపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్

‘ఇంపర్‌ఫెక్ట్ విమెన్’ (Imperfect Women) అనేది ఎలిసబెత్ మోస్, కెర్రీ వాషింగ్టన్, కేట్ మారా, జోయెల్ కిన్నమన్ మరియు కోరీ స్టోల్ నటించిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. యానీ వీస్మాన్ రూపొందించిన ఈ సిరీస్, అరామింటా హాల్ రాసిన అదే పేరు గల నవల ఆధారంగా రూపొందింది. ఇది 2026 మార్చి 18 నుంచి ఆపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ప్రతి బుధవారం ఒక కొత్త ఎపిసోడ్ తో వస్తుంది. ఇక ఇది ఒక లిమిటెడ్ సిరీస్, అంటే కథ మొత్తం ఈ 8 ఎపిసోడ్లలోనే ముగుస్తుంది, రెండో సీజన్ ఉండదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎలియనోర్, మేరీ, నాన్సీ అని ముగ్గురు ప్రాణ స్నేహితురాళ్లు ఉంటారు. పైకి చూస్తే వీళ్ల ముగ్గురిది విడదీయలేని బంధం, చాలా పద్ధతిగా బతుకుతున్నట్టు కనిపిస్తారు. కానీ లోలోపల ఒకరి మీద ఒకరికి అసూయలు, భర్తల దగ్గర దాచిన సీక్రెట్లు బోలెడు ఉంటాయి. ఇలా ఉంటే వీళ్ళల్లో ఒకరోజు నాన్సీ అనే మహిళ శవమై కనిపిస్తుంది. దాంతో వీళ్ళ ప్రశాంతమైన జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టేసరికి, వీళ్ల ముగ్గురి మధ్య ఉన్న అసలు రంగులు బయటపడతాయి. నాన్సీని చంపింది ఎవరో తెలియదు కానీ, ఆ ఇన్వెస్టిగేషన్‌లో వీళ్ల సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతాయి. ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ఎవరికి ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయి? అన్న విషయాలు బయటపడుతుంటే, వీళ్లు అసలు స్నేహితులేనా లేక శత్రువులా అనే డౌట్ వస్తుంది. చివరికి నాన్సీ హత్య వెనుక ఉన్నది ఎవరు ? వీళ్ళ సీక్రెట్స్ ఏమిటి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also :  అలల మీద విరబూసిన అందమైన ప్రేమ…కొసరి కొసరిగా ప్రియుడి మత్తులో…

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×