E-Paper
Advertisement

Michael Review : ‘మైఖేల్’ మూవీ రివ్యూ.. మైఖేల్ జాక్సన్‌ బయోపిక్ ఎలా ఉందంటే..?

Michael Review : ‘మైఖేల్’ మూవీ రివ్యూ.. మైఖేల్ జాక్సన్‌ బయోపిక్ ఎలా ఉందంటే..?
Advertisement

Michael Review : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య బయోపిక్ లో ట్రెండు నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్స్ జీవితాల ఆధారంగా కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రమే పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తాజాగా మరో బయోపిక్ థియేటర్లలోకి వచ్చేసింది. మ్యూజిక్ వరల్డ్‌కే బాద్‌షా, డ్యాన్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్దులు బ్రేక్ అవుతాయి.. ‘మైఖేల్’ సిని మా ఒక ‘హాఫ్ హార్టెడ్ ట్రిబ్యూట్’ అని తేలిపోయింది! ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అసలు కథ ఏంటో ఇక్కడ బాక్సాఆఫీస్ వద్ద ఇలాంటి టాక్ ను అందుకుంది..? జనాల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి రివ్యూలో చూసేద్దాం..

కథ:

1988 దగ్గరే బ్రేక్ పడింది! తమ్మి.. బయోపిక్ అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చూపిస్తారని అందరం ఆశపడ్డారు.. కానీ ఇక్కడ మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. 1966లో ‘జాక్సన్ 5’ బ్యాండ్ మొదలైనప్పటి నుండి, 1988 వరకు మాత్రమే కథను చూపించి.. ‘His Story Continues’ అని ఎండ్ చేశారు. అంటే సెకండ్ పార్ట్ ఉంటుందా? లేదా? అనే క్లారిటీ లేదు. మైఖేల్ పూర్తి జీవితాన్ని చూడాలనుకున్న ఫ్యాన్స్‌కి ఇది పెద్ద నిరాశే!

ప్లస్ పాయింట్లు: 

Advertisement

జాఫర్ జాక్సన్ విశ్వరూపం! “తమ్మి.. సినిమాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే: జాఫర్ జాక్సన్: మైఖేల్ మేనల్లుడు జాఫర్ అచ్చం వాళ్ల బాబాయ్‌లాగే జీవించేశాడు. డ్యాన్స్ మూవ్స్, మేనరిజమ్స్ అదిరిపోయాయి.. ఇమిటేషన్ లా కాకుండా ఒరిజినల్ లా అనిపించాడు.

ఎమోషన్స్: 

మైఖేల్ తన పెంపుడు జంతువులతో (జిరాఫీ, చింపాంజీ) గడిపే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. ‘నా వయసు వాళ్ళు నాతో కేవలం ఫోటోలు దిగడానికే వస్తారు, వీళ్లే నా నిజమైన ఫ్రెండ్స్’ అని చెప్పే డైలాగ్ నిజంగా హార్ట్ టచింగ్. జనాలను ఇది మెప్పించింది అనే టాక్ జనాల నుంచి వినిపిస్తుంది. MTV లో పాటలు వేయకపోవడం, దానికి మైఖేల్ టీమ్ ఇచ్చిన కౌంటర్ సీన్ మాస్ అప్పీల్ ఇచ్చింది. డైలాగులు: ‘నీ వాయిస్ ఒక అద్భుతం’, ‘నీ లాంటి వాడు పుట్టడు’ వంటి డైలాగులు మైఖేల్ రేంజ్‌ని బాగా ఎలివేట్ చేశాయి..

మైనస్ పాయింట్లు: 

Advertisement

ఒకే యాంగిల్.. డెప్త్ లేదు! “తమ్మి.. అసలు సమస్య ఎక్కడంటే: తండ్రీ కొడుకుల గొడవ.. సినిమా అంతా కేవలం తండ్రి జోసెఫ్ జాక్సన్ కి, మైఖేల్ కి మధ్య ఉన్న గొడవ చుట్టూనే తిరుగుతుంది. ఇది వన్-డైమెన్షనల్ గా అనిపిస్తుంది.

నో కాంట్రవర్సీ: 

మైఖేల్ లైఫ్ లో ఉన్న వివాదాలను అసలు టచ్ చేయలేదు. మేకర్స్ కావాలనే మైఖేల్ ఫ్యామిలీ పర్మిషన్ కోసం కొన్ని విషయాలను దాచిపెట్టారని క్లియర్ గా తెలుస్తోంది. PR డ్రైవెన్: ‘నా పని మాట్లాడాలి కానీ నా PR కాదు’ అని నమ్మిన స్టార్ గురించి, ఒక PR సినిమా చూసినట్టు అనిపించింది. తమ్మి.. స్క్రీన్ మీద మైఖేల్ పాటలు, ఆ డ్యాన్స్ మూవ్స్ చూడటానికి బాగున్నాయి కానీ.. బయోపిక్ గా మాత్రం ఇది ఒక అరకొర ప్రయత్నమే! మైఖేల్ జాక్సన్ అనే మహా సముద్రంలో ఇది కేవలం ఒక చిన్న నీటి చుక్క మాత్రమే. మరి ఏమంటారు ? కింగ్ ఆఫ్ పాప్ బయోపిక్ మీకు నచ్చిందా? సినిమా ఎలా ఉందనేది కామెంట్ చెయ్యండి.. ఇకపోతే సినిమాకు సీక్వెల్ గా మరికొన్ని సినిమాలు వస్తాయా? అన్నది తెలియాలంటే వెయిట్ చెయ్యాల్సిందే..

రేటింగ్: 2.5/5

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×