E-Paper
Advertisement

కింగ్ మేకర్ కాదు, డైరెక్ట్ కింగే.. తమిళనాట విజయ్ ప్రభంజనం.. పవన్‌కు నేర్పిన పాఠాలు!

కింగ్ మేకర్ కాదు, డైరెక్ట్ కింగే.. తమిళనాట విజయ్ ప్రభంజనం.. పవన్‌కు నేర్పిన పాఠాలు!
Advertisement

Vijay vs Pawan Kalyan: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ సత్తా చాటారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించబోతోంది. పొత్తులు, ఇతర సమీకరణాలు కలిసివస్తే.. విజయ్ సీఎం కావడం దాదాపుగా ఖాయమన్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో చర్చకు తావిస్తోంది. టీడీపీ, బీజేపీతో పొత్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే.. అదే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్ సింగిల్ గా పోటీ చేసి.. ఏకంగా సీఎం కాబోతున్నారంటూ పలువురు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే పవన్ చేసిన పొరపాట్లు, విజయ్ నేర్పిన పాఠాలు అంటూ రాజకీయంగా చర్చ మెుదలైంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

భిన్నమైన పొలిటికల్ వ్యూహాలు

దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇద్దరు అగ్ర కథానాయకులు పవన్ కళ్యాణ్, విజయ్. ఇద్దరి లక్ష్యం ప్రజాసేవే అయినప్పటికీ.. వారు ఎంచుకున్న మార్గాలు, పొందిన ఫలితాలు భిన్నంగా మాత్రం ఉన్నాయి. ఏపీలో 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్.. తన పార్టీకి తక్కువ సీట్లు కేటాయించినప్పటికీ రాజీపడి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా ఆయన ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరోవైపు విజయ్ ఇందుకు భిన్నమైన వైఖరిని రాజకీయంగా అవలభించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా సింగిల్ గానే పోటీ చేసి చరిత్ర సృష్టించారు. పవన్ తరహాలో కాకుండా ఎటువంటి ప్రధాన పార్టీలతో పొత్తు లేకుండా, ఒంటరిగా బరిలోకి దిగి డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK)వంటి బలమైన శక్తులను ఢీకొట్టి ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు.

పవన్ చేసిన పొరపాట్లు..?

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సక్సెస్ అయిన నేపథ్యంలో సహజంగానే కొందరు పవన్ తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఆయన రాజకీయంగా కొన్ని పొరపాట్లు చేశారని ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపన అనంతరం ప్రారంభంలో పవన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు 2014లో కూటమికి మద్దతు, ఆ తర్వాత కొద్దికాలానికి కూటమికి వ్యతిరేకంగా విమర్శలు, 2019లో ఒంటరి పోరు, మళ్లీ 2024లో పొత్తు.. పవన్ నిర్ణయాల్లో అస్థిరత్వాన్ని సూచించాయని అంటున్నారు.

పవన్ తన బలాన్ని నమ్మలేదా?

క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం కంటే, తన వ్యక్తిగత చరిష్మాపైనే పవన్ ఎక్కువగా ఆధారపడ్డారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2024 ఏపీ ఎన్నికల్లో తన సొంత బలాన్ని నమ్మకుండా విపక్ష ఓటు చీలితే వైసీపీ అధినేత జగన్ మళ్లీ సీఎం అవుతారన్న భయం పవన్‌ను పొత్తు వైపు నడిపించిందని అంటున్నారు. దీనివల్ల జనసేన కేవలం 21 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా పాలిటిక్స్, సినిమాలు ఒకేసారి బ్యాలెన్స్ చేస్తుండటం వల్ల.. ఆయనలో ప్రజాసేవ పట్ల అంకిత భావం లోపించిందన్న విమర్శలు సైతం ప్రత్యర్థుల నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది.

విజయ్ గెలుపు పాఠాలు..!

Advertisement

తమిళనాట విజయ్ సాధించిన అద్భుతమైన విజయం నుంచి పవన్ కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విజయ్ మొదటి నుంచీ ఒంటరి పోరు అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ఎక్కడా రాజీ పడకుండా తన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని పేర్కొంటున్నారు. విజయ్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సినిమాలకు స్వస్తి పలికి, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. ఇది ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచింది. పాత ద్రవిడ పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ.. కొత్త తరం ఓటర్లను ఆకర్షించేలా విజయ్ వ్యూహాలు రచించారు.

Also Read: Kerala Elections: కేరళ ఫలితాల్లో రేవంత్ మార్క్.. పనిచేసిన తెలంగాణ ఫార్ములా.. కాంగ్రెస్ ఖాతాలో మరో స్టేట్!

పవన్ ‘త్యాగం’.. విజయ్ ‘ధైర్యం’

పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సీట్లను త్యాగం చేయగా.. విజయ్ మాత్రం అధికారాన్ని చేజిక్కించుకుంటేనే మార్పు సాధ్యమని భావించి పోరాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ‘విధేయత’, ‘త్యాగానికి’ నిదర్శనంగా నిలిస్తే.. విజయ్ ‘ధైర్యం, రాజీలేని పోరాటానికి కేరాఫ్ గా మారారు. ఏపీలో కూటమి ధర్మాన్ని పాటిస్తూ పవన్ పాలిస్తుంటే, తమిళనాడులో విజయ్ సరికొత్త శకానికి నాంది పలికారు. పవన్ తన తదుపరి లక్ష్యం వైపు అడుగులు వేయడానికి విజయ్ గెలుపును ఒక కేస్ స్టడీగా తీసుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలా చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఆయన ఎదుగుతారని అభిప్రాయపడుతున్నారు.

Also Read: బెంగాల్లో బద్దలైన దీదీ కోట.. 15 ఏళ్ల పాలనకు శుభంకార్డ్.. ఫలించిన మోదీ-షా వ్యూహం!

 

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×