E-Paper
Advertisement

మిల్కీ బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందా.. కొత్త కొటేషన్ తో ఆసక్తికర చర్చ!

మిల్కీ బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందా.. కొత్త కొటేషన్ తో ఆసక్తికర చర్చ!
Advertisement

Tamannaah:సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రేమలు , బ్రేకప్ లు, పెళ్లిళ్లు, విడాకులు అత్యంత సర్వసాధారణంగా మారిపోయిన అంశం. మనసుకు నచ్చితే డేటింగ్ చేయడం, ప్రేమించడం.. నచ్చకపోతే బ్రేకప్ చెప్పుకోవడం ఇలాంటి అంశాలను సెలబ్రిటీలు చాలా తేలికగా తీసుకుంటున్నారు అనే కామెంట్లు కూడా ఎప్పటికప్పుడు నెటిజన్స్ నుండి వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటే.. మరి కొంతమంది పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్న సమయంలో విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఆ తర్వాత కొత్త తోడును వెతుక్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్న తమన్నా – విజయ్ వర్మల జంట బంధం అంతే త్వరగా ముగిసిపోయింది. అప్పటినుండి వీరి ప్రేమ వ్యవహారంపై ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇకపోతే తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకి తమన్నా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినా మళ్లీ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం.

జీవితంలో కొత్త తోడు వెతుక్కోవడం తప్పుకాదు..

Advertisement

అయితే ఇలాంటి సమయంలో తాజాగా తమన్నా చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఈమె మళ్లీ ప్రేమలో పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవితంలో కేవలం ఒక్కరితోనే ప్రేమలో ఉండాలనే నియమం లేదు. ఎన్నిసార్లు అయినా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది అంటూ ఆమె చేసిన కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బంధాల గురించి తమన్నా మాట్లాడుతూ.. రిలేషన్ షిప్స్ అనేవి మనల్ని బంధించేవిగా ఉండకూడదు. మన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి” అంటూ అభిప్రాయపడింది. ఇక సరైన బంధం దొరికే వరకు కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదు అన్నట్లుగా తమన్నా వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి అయితే విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత తమన్నా నుంచి ఇలాంటి మాటలు రావడంతో ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు రకరకాల చర్చలు మొదలయ్యాయి.

పెళ్లి కాదు.. స్వేచ్ఛ కావాలి..

తమన్నా పెళ్లి విషయానికి వస్తే.. ప్రస్తుతానికి తనకు వివాహం చేసుకునే ఆలోచన లేదని.. తన కెరియర్, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తూ సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ..ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తన మాటల ద్వారా క్లారిటీ ఇచ్చింది.

Advertisement

also read:అప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్.. ఇప్పుడు విజయ్..తొలి ప్రయత్నంలోనే సత్తా చాటిన హీరోలు!

తమన్నా సినిమాలు..

తమన్నా సినిమాల విషయానికి వస్తే.. చివరిగా తెలుగులో ఓదెల 2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్ వంటి అగ్ర నటులతో కలిసి అతీంద్రియ, థ్రిల్లర్, యాక్షన్, జానపద, పౌరాణిక చిత్రాలతో పాటు విభిన్న జానర్లలో పనిచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా.. వరుస అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దగుమ్మ.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×