E-Paper
Advertisement

ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌.. హోం మినిష్ట‌ర్‌! ప్ర‌క‌టించేసుకున్న‌ కేటీఆర్‌.. ఇంకెవ‌రెవ‌రికి ఏ శాఖ‌లో..! ఆల‌సించిన ఆశాభంగం!

ఆరెస్ ప్ర‌వీణ్ కుమార్‌.. హోం మినిష్ట‌ర్‌! ప్ర‌క‌టించేసుకున్న‌ కేటీఆర్‌.. ఇంకెవ‌రెవ‌రికి ఏ శాఖ‌లో..! ఆల‌సించిన ఆశాభంగం!
Advertisement

ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్‌… ఇప్పుడిదో కొత్త రోగం వ‌చ్చిన‌ట్టుంది కేటీఆర్‌కు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ అంటుంటారు కేటీఆర్‌ది శాడిష్టిక్ ప్లెజ‌ర్ మెంటాలిటీ అని. కానీ తాజాగా ఈ కొత్త రోగం కూడా ఉంద‌ని తేలింది. ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్ అంటే.. ముందే అధికారంలోకి వ‌చ్చిన‌ట్టు ఊహించ‌డం. అధికారంలో ఉన్న‌ట్టుగానే అహంకారంతో మాట్లాడ‌టం. ఇప్పుడిదే రోగం ప‌ట్టుకున్న‌ట్టుంది కేటీఆర్‌కు. బండి భ‌గీర‌థ్ ఫోక్సో కేసు విష‌యంలో తాజాగా ఆయ‌నో ప్రెస్‌మీట్ పెట్టాడు. రేవంత్‌రెడ్డిని తిట్టీ తిట్టీ.. మా ప్ర‌వీణ్‌కుమార్ ఈ కేసును మొత్తం త‌వ్వి తీశాడు. ఆయ‌న వ‌ల్లే మీరు భ‌గీర‌థ్‌ను అరెస్టు చేయాల్సి వ‌చ్చింది.. అన్నాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇంత‌లోనే త‌న‌లోని ప్రెజెంప్ష‌న్ ఆఫ్ ప‌వ‌ర్ రోగం మేల్కొంది. త్వ‌ర‌లోనే నీకు పాఠాలు చెప్పే లెవ‌ల్‌కు పోబోతున్నాడు మా ప్ర‌వీణ్ అన్నాడు. ఎవ‌రికీ అర్థం కాలేదు. అదెంతో దూరంలో లేదు. క‌చ్చితంగా ఆయ‌న.. నీకు గ‌ట్టి బుద్ది చెబుతాడు. నీ బొక్క‌లిర్గొడ‌తాడు.. అనే విధంగా మాట్లాడాడు. అయినా ఎవ‌రికీ అర్థం కాలేదు. కానీ కొంచెం లేటుగానైనా అర్థ‌మైన‌దేమిటంటే.. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు బీఆరెస్ ప్ర‌భుత్వంలో హోం మంత్రిని చేస్తున్నార‌ని. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చేసిన‌ట్టుగా.. కేటీఆర్ సీఎం అయిన‌ట్టుగా.. త‌నే అంద‌రికీ చ‌క‌చ‌కా శాఖ‌లు పంచేసిన‌ట్టుగా.. అందులో హోం శాఖ‌ను ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు ఇచ్చేసిన‌ట్టుగా కేటీఆర్ క‌ల‌లు క‌నేశాడు. త‌ను క‌న్న క‌ల‌ల‌ను… కాదు కాదు ఆయ‌న ప‌రిభాష‌లో జ‌ర‌గ‌బోయే వాస్త‌వాల‌ను ఇలా మీడియా ముందు పెట్టాడ‌న్న‌మాట‌.

Advertisement

చెప్పొద్దూ..! అంతా న‌వ్వుకున్నారంటే న‌మ్మండి. అంటే ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించింది కూడా అందుకేన‌న్న‌మాట‌. వ‌చ్చేది మ‌న‌మే.. నువ్వే కాబోయే హోంమంత్రి.. అని చెప్పేయ‌గానే.. ప్ర‌వీణ్ వ‌చ్చేశాడ‌న్న మాట‌. ఇక అప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ను ప్ర‌వీణ్ కుమార్ తిట్టిన తిట్లు, పాస్‌పోర్టు బ్రోకర్ అని అన్న మాట‌లు.. ఇవేనా డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లు.. అని ఎద్దేవా చేసిన కామెంట్లు.. నీ గ‌డీలు కూల్చుతామ‌ని చేసిన శ‌ప‌థాలు.. అన్నీ అన్నీ బారాఖూన్ మాఫీలాగా.. మాఫీ చేసేసి.. ఫామ్‌హౌజ్ పాఠాలు వ‌ళ్లెవేస్తున్నాడ‌న్న‌మాట.

న‌వ్విపోదురు గాక‌ నాకేటి సిగ్గు అన్న‌ట్టుగా. ఇక్క‌డ ఇంకో అనుమానం… ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు కూడా ఈ రోగం ప‌ట్టుకున్న‌దేమో అనిపిస్తున్న‌ది. స‌హ‌వాస దోషం క‌దా! త‌నూ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. హుందాత‌నం గాలికొదిలేశాడు. హ‌ద్దులు దాటి మ‌రీ మాట్లాడుతున్న వైనం అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మీదున్న ఆ కొంచెం మ‌ర్యాద కూడా పోయేట్టు చేస్తుంది. తన పాత పోలీసు మెంటాలిటీ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌కొచ్చిందా? లేక తాను హోం మంత్రిని అయిన‌ట్టే.. అయిపోయిన‌ట్టేన‌ని ఊహాలోకంలో ఉండి మాట్లాడుతున్నాడా తెలియ‌దు..! మ‌రీ ఓవ‌ర్ అనుకో. ఇట్ల చేస్తేనే రేవంత్ తిడ‌తాడు.. రేవంత్ తిడితే త‌మ బాసుల దృష్టిలో ప‌డొచ్చు. ప‌డితేగానీ ఇలా ముందే బ‌హిరంగ వేదిక‌ల మీద త‌న‌ను హోం మంత్రి చేసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌రు అని కూడా అనుకొని ఉంటాడేమో! ఇంత‌టితో క‌థ ముగియ‌లేదు.

Advertisement

ఆ మాన‌సిక రోగం కేటీఆర్‌ను కుదురుగా ఒక్క‌చోట ఉండ‌నిస్తుందా? అందుకే ఆయ‌న ఒక్క‌రితోనే స‌రిపెట్ట‌లేదు.. మంత్రిత్వ శాఖ‌ల‌న్నీ పంచే ప‌నిలో ఉన్నాడ‌ట. బాల్క సుమ‌న్‌కు ఓ శాఖ‌, క్రిశాంక్‌కు మ‌రో శాఖ‌.. ఇలా త‌న‌ గ్రూపు మెంబ‌ర్స్‌గా ఉండే భ‌జ‌న బ్యాచ్‌.. (సీనియ‌ర్లు ఇందులో లేరు… )కు శాఖ‌లు పంచే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఇక మిగిలిన వారు కూడా తొంద‌ర‌ప‌డండి. ఆల‌సించిన ఆశాభంగం! మంచి మంచి ఫోర్టు ఫోలియోలు పోయిన త‌రువాత గగ్గోలు పెడితే ఏం లాభం.? మల్లారెడ్డి లెక్క కార్మిక శాఖ‌ల్లాంటివే ఉంటాయి అడుగుకు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఈ మంత్రుల శాఖ‌ల కేటాయింపుల‌పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతుందంట‌. రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌బ‌డుతుంటే.. ఫిడేలు వాయించిన‌ట్టు.. జ‌నం స‌మ‌స్య‌లేమీ లేన‌ట్టు.. బండి భ‌గీర‌థ్‌.. బండి సంజ‌య్.. ఫోక్సో కేసు.. మేమే ప‌ట్టిచ్చినం.. మంత్రి ప‌ద‌వులు.. శాఖ‌లు..! తిట్ల దండ‌కాలు.. బూతుల పంచంగాలు.. ఇదీ ఇప్పుడు తెలంగాణ భ‌వ‌న్ న్యూ ట్రెండ్స్‌!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×