E-Paper
Advertisement

కాంగ్రెస్ కోటలో ప్రధాని చిచ్చు.. అసలు స్కెచ్ ఏంటి?

కాంగ్రెస్ కోటలో ప్రధాని చిచ్చు.. అసలు స్కెచ్ ఏంటి?
Advertisement

Modi Offer: స్వేచ్ఛ బ్యూరో: సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కోటలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నరనరలా జీర్ణించుకున్న ‘కట్టర్’ నాయకుల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.తాజాగా హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నేరుగా సీఎం రేవంత్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. “దేశం కోసం పనిచేయాలనుకునే వారికి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉన్నాయి” అంటూనే …తనతో కలిసి పని చేయాలని పీ ఎం మోడీ నేరుగానే ఆహ్వానించారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది​ఈ ‘ఓపెన్ ఆఫర్’ వెనుక ఉన్న అసలు వ్యూహం.. కాంగ్రెస్ క్యాడర్‌లో అయోమయం సృష్టించడమేనా? లేక నిజంగానే కొందరు అసమ్మతి నేతలతో బీజేపీ టచ్‌లో ఉందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

గాంధీభవన్‌లో హాట్ టాపిక్..

​ప్రధాని వ్యాఖ్యలు వెలువడిన గంటల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ వేదికగా అంతర్గత చర్చలు మొదలయ్యాయి.
పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న కొందరు నేతలు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.ఇక క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ పరిణామాలను ఎలా చూడాలి అనే అయోమయంలో ఉన్నారు.మరో వైపు ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కొంత జాప్యం చేసిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Also read: మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి!

సీనియర్ లు ఆరా?

​​ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా పార్టీలోని కురువృద్ధులు రంగంలోకి దిగి పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు.
​”కాంగ్రెస్ సిద్ధాంతం మీద గౌరవం ఉన్నవారెవరూ అటువైపు చూడరు. ప్రధాని మాటలు కేవలం మైండ్ గేమ్ మాత్రమే,” అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించినప్పటికీ, లోలోపల మాత్రం ‘స్క్రీనింగ్’ మొదలైనట్లు సమాచారం.ఆపరేషన్ ఆకర్ష్‌ను కొత్త పుంతలు తొక్కించడం లో భాగం గానే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని చర్చ రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.కాంగ్రెస్ రక్షణ అసమ్మతి నేతలను బుజ్జగించడం, క్యాడర్‌లో భరోసా నింపడం వంటివి ఇప్పుడు సీనియర్ నాయకులు బాధ్యత తీసుకునేలా వ్యవహరించడం గమనార్హం. అయితే, ప్రధాని స్థాయిలో ఒక నేత నేరుగా ఆహ్వానం పలకడం వెనుక ఖచ్చితంగా బలమైన రాజకీయ కారణాలు ఉండే ఉంటాయి. ఇది కాంగ్రెస్‌ను బలహీనపరిచే ఎత్తుగడా? లేక ఎన్నికల ముందస్తు వ్యూహమా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం గాంధీభవన్ గోడల మధ్య “ఎవరు వెళ్తారు? ఎవరు ఉంటారు?” అనే టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

ALSO Read: ఏపీకి పారిశ్రామిక కళ.. సింగపూర్ దిగ్గజాలతో లోకేష్ భేటీ.. ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×