E-Paper
Advertisement

చెల్లి వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా.. TRS పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..

చెల్లి వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా..  TRS పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..
Advertisement

వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ప‌న్న‌డంలో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు. రాజ‌కీయ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించి.. ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించిన ఆయ‌న గురించి చెప్పుకుంటారు. కొమ్ములు తిరిగిన ఆంధ్రా నేత‌లు, ప్ర‌భుత్వాల మెడ‌లు వంచేలా ఎత్తుగ‌డలు వేసి అనుకున్న ల‌క్ష్యాన్ని చేరే క్ర‌మంలో ఎలా విజ‌యం సాధించారో అంతా చూశాం. ఇప్పుడు ఆయ‌న త‌న‌య కూడా అంత‌కు మంచిన చాణాక్యాన్నే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆమె పార్టీలో భాగ‌మై ఉన్నాన్నాళ్లు త‌న గ‌ళాన్ని బ‌య‌ట‌కు రానీయ‌లేదు. కొత్త పార్టీతో త‌న వేదిక తాను ఏర్పాటు చేసుకున్న నాటి నుంచే ఆమెలోని స‌హ‌జ‌సిద్ద‌మైన‌, అనుభ‌వంతో కూడిన‌, తండ్రి నుంచి వ‌చ్చిన‌.. రాజ‌కీయ చ‌తుర‌త బ‌య‌ట ప‌డుతున్న‌ది.

ఆమె తొలిగా త‌న రాజ‌కీయ వ్యూహాన్ని ప్ర‌ద‌ర్శించింది.. బీఆరెస్ పార్టీపైనే. అదీ అన్న కేటీఆర్‌పైనే. అవును .. టీఆరెస్ పార్టీ కోసం ఆమె వేసిన ఎత్తుల‌కు కేటీఆర్ చిత్త‌య్యాడు. స్వ‌యంగా ఆమె ఇవాళ తన వ్యూహాన్ని ఒప్పుకున్నారు మీడియా స‌మ‌క్షంలో. పార్టీ ఆవిర్భావం తేదీని ప్ర‌క‌టించిన రోజు త‌మ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆరెస్‌)గా పేర్కొన్నారు. కానీ నిజానికి ఆమె కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది మాత్రం తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌. ఇక్క‌డే అన్న కేటీఆర్ తప్పులో కాలేసిట‌ట్టు చేశారు క‌విత‌. టీఆరెస్ ప్ర‌క‌టించ‌గానే.. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది బీఆరెస్ పార్టీ. బాహాటంగా కొంద‌రు నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి దీనిపై అభ్యంత‌రంగా మాట్లాడటం కూడా అందులో భాగ‌మే. నకిలీ పార్టీ అని.. మేమే ఒరిజిన‌ల్ అని బీఆరెస్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌చారం చేసింది.

Advertisement

కానీ అక్క‌డ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుకు, ఇక్క‌డ క‌విత చెప్పిన పార్టీ పేరుకు సంబంధమే లేదు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయింది. ర‌క్ష‌ణ సేన‌కే క్లియరెన్స్ ఇచ్చేసింది. దీంతో టీఆరెస్ పార్టీ పేరుకు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. మొత్తానికి ఆమె త‌న కొత్త పార్టీ పేరు టీఆరెస్ కావాల‌నుకున్నారు. అది సాధించారు. ఈ క్ర‌మంలో దీనిపై అడ్డంకులు వ‌స్తాయ‌ని ఆమెకు ముందే తెలుసు. ఎందుకంటే అంత‌కుముందే కేటీఆర్.. మ‌ళ్లీ పాత పేరే తీసుకోవాల‌నుకుంటున్నాం.. అని మీడియా ముఖంగా ప్ర‌స్తావించారు. ఈ పేరును క‌విత తీసుకోవ‌ద్ద‌నే ఉద్దేశ్యంతోనే ఆ విధ‌మైన కామెంట్ల చేశాడు కేటీఆర్‌.

ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు పార్టీ పేరును మార్చుకోవ‌డానికి ఒప్పుకోడు. ఎందుకంటే.. ఒక్క‌సారి త‌ను తీసుకున్న నిర్ణ‌యం మంచైనా చెడైనా.. అది లాభం చేసినా నిండా ముంచినా దాని నుంచి వెన‌క్కి వ‌చ్చే అల‌వాటు లేదు. దీంతో బీఆరెస్ పార్టీ పేరే దానికి ఎప్ప‌టికీ ఉంటుంది. కేటీఆర్ చెల్లెకు హింట్ ఇచ్చి.. మేము తీసుకోబోతున్నాం.. కాబ‌ట్టి టెక్నిక‌ల్‌గా ఇది మీకు చెంద‌దు అనే విధంగా మీడియాతో అన్నాడు. కానీ చెల్లె .. అన్న‌ను ఏకంగా పేరే త‌ప్పు చెప్పి బోల్తా కొట్టించేసింది. రాజ‌కీయ వ్యూహంలో తండ్రి త‌రువాత త‌నే అని నిరూపించుకున్న‌ది. ఆదిలోనే ఇలా ఉంటే మున్ముందు ఇంకా రాజ‌కీయ ప‌రంగా ఆమెను త‌ట్టుకోవ‌డం కేటీఆర్ త‌రం కాద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది.

Advertisement

మ‌రి ఈ నెల రోజుల అభ్యంత‌రాల గ‌డువులో ఏమైనా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉంటాయా? అనే అనుమానాల‌ను కూడా ఆమె బ్రేక్ చేసింది. ఇక ఎలాంటి ఇబ్బందులు.. అభ్యంత‌రాలు లేవ‌న్నారు. అంటే.. అక్క‌డ క్లియ‌ర్‌గా అన్ని రెడీ చేసుకుని.. అప్పుడు బాహాటంగా ఆమె తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితిగా సీఈసీకి స‌మ‌ర్పించిన లేఖ‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇప్పుడు దీనిపై కేటీఆర్ అండ్ టీమ్ అభ్యంత‌రాలుకు పోతే.. వ‌చ్చే న‌ష్టం బీఆరెస్‌కే. అందుకే కేటీఆర్ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ.. ఎన్నో పార్టీలు వ‌స్తాయి…పోతాయి.. అంటూ దెబ్బ‌తిన్న అహం క‌నిపించ‌కుండా మాట్లాడారు.

 

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×