E-Paper
Advertisement

మైండ్ గేమ్ తో వస్తున్న పృథ్వీరాజ్.. ఐ, నోబడీ టీజర్ రిలీజ్!

మైండ్ గేమ్ తో వస్తున్న పృథ్వీరాజ్.. ఐ, నోబడీ టీజర్ రిలీజ్!
Advertisement

Prithviraj Sukumaran: ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకవైపు ఇతర భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో అదరగొడుతూనే.. మరొకవైపు మాతృభాష మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ హీరోగా, టాలెంటెడ్ నటి పార్వతీ తిరువోతు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఐ , నోబడీ. రోషాక్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రయోగాత్మక దర్శకుడు నిసామ్ బషీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మరి పృథ్విరాజ్ హీరోగా మైండ్ గేమ్ తో వస్తున్న ఈ అఫీషియల్ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఐ, నోబడీ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?

తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. సినిమా కథాంశం ఒక వ్యక్తి తన అస్తిత్వం కోసం చేసే పోరాటం లేదా రహస్యం చుట్టూ తిరుగుతోందని మాత్రం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఒక సాధారణ ఉద్యోగి అనుకోకుండా కొన్ని కష్టమైన పరిస్థితులలో చిక్కుకుంటాడు.. ఆ ప్రమాదం నుండి తనను తాను కాపాడుకుంటూనే తన కుటుంబాన్ని కూడా ఎలా రక్షించుకున్నాడు? తన మైండ్ గేమ్తో సమస్యల నుండి ఎలా బయటపడగలిగాడు? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశంగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా జోక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం సినిమా టీజర్ కు ప్రాణం పోసింది. ఇందులో పృథ్వీరాజ్ సరికొత్త లుక్కులో కనిపించారు. అటు పార్వతీ నటన సినిమాపై ఊహించని అంచనాలను పెంచేసింది. ఇక ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా అద్భుతంగా, చక్కగా తెరకెక్కించారు. మొత్తానికైతే టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

also read:ఓటీటీలోకి గాయపడ్డ సింహం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

పృథ్వీరాజ్ సుకుమారన్ కెరియర్..

పృథ్వీరాజ్ సుకుమారన్ విషయానికి వస్తే దర్శకుడిగా విభిన్నమైన కథలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు పనిచేశారు.ఇక అంతేకాదు నటుడిగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ చిత్రాలలో విస్తృతంగా పనిచేస్తూ పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ది గోట్ లైఫ్ సినిమాతో నటుడిగా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కుంభ అనే పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమార్.

Advertisement

ఇకపోతే పృథ్వీరాజ్ నటుడి గానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 2019లో వచ్చిన లూసీఫర్, 2022లో వచ్చిన బ్రో డాడీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే తొమ్మిది, కడువ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా పనిచేశారు. ఇక ఈయన తదుపరి చిత్రాల విషయానికి వస్తే ఖలీఫా, సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం, విలాయత్ బుద్ధ వంటి చిత్రాలలో నటించనున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×