E-Paper
Advertisement

మందుగ‌మ‌నంలో మ‌నం మ‌నం..! మీది తెనాలె.. మాది తెనాలె..! తాగి ఊగుడు పై కేటీఆర్ స్పంద‌న‌..!

మందుగ‌మ‌నంలో మ‌నం మ‌నం..! మీది తెనాలె.. మాది తెనాలె..! తాగి ఊగుడు పై కేటీఆర్ స్పంద‌న‌..!
Advertisement

రేవంత్ తాగుడు కామెంట్స్‌పై .. దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు కేటీఆర్‌! అన్నింటినీ నాశ‌నం చేసిన కేసీఆర్.. ఒక్క తాగుడు క‌ల్చ‌ర్‌ను మాత్రం బాగా అల‌వాటు చేసి పోయాడ‌ని తీవ్ర‌మైన ఆరోప‌ణ చేసిన విష‌యం తెలిసిందే. ఎక్క‌డ చూసినా బెల్ట్ షాపులేన‌న్నాడు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు.. కేసీఆర్ సీఎం కాక ముందు.. అంత‌గా తాగుడు అల‌వాటు లేకుండెన‌న్నాడు. ఆయ‌న ప‌దేళ్ల పాల‌న‌లో విప‌రీత‌మైన తాగుడు అల‌వాటు చేసి పోయాడ‌ని, గ‌ల్లీకొక బెల్ట్ షాపు పెట్టి.. ప‌దారేండ్ల పోర‌డి ద‌గ్గ‌ర్నుంచి తాగి ఊగుడు నేర్పించి పోయాడ‌న్నాడు.

అంతేకాదు.. కేసీఆర్‌కు తాగుడు త‌ప్ప ఏదీ తెల‌వ‌ద‌ని, ఫుల్ బాటిల్‌ను త‌న మోచేతి సైగ ద్వారా చూపించి మ‌రీ విమ‌ర్శించాడు. ఇది చ‌ర్చ‌కు తెర తీసింది. గ‌తంలో అసెంబ్లీలో కూడా రేవంత్ ఓ సంద‌ర్భంలో కేసీఆర్‌ను ఉద్దేశించి ఇవే మాట‌ల‌న్నాడు. హ‌రీశ్ హాఫ్ బాట‌లైతే.. కేసీఆర్ ఫుల్ బాటిల్ అని ఆరోపించ‌డం కూడా వివాద‌మైంది. నిన్న ఈ తాగుడు మాట‌ల‌పై కేటీఆర్ ఇవాళ స్పందించాడు.

Advertisement

మ‌రి మీరెందుకు బెల్టు షాపులు కంటిన్యూ చేస్తున్నారు. మీరు బంద్ చేయొచ్చుగా? మీ పాల‌న ఒక్క మందుగ‌మ‌నంలో ముందుంది.. అంతా మంద‌గ‌మ‌న‌మే..! అని విమ‌ర్శించాడు. అంతే కాదు.. నీకు అంత‌గా బాధైతే.. మ‌ద్య‌పాన నిషేధం విధించుకో..! ఎవ‌రొద్ద‌న్నారు..? అని కూడా ఓ ఉచిత స‌ల‌హా ఇచ్చాడు.

ఈ మాట‌ల వెనుక లోతైన అర్థాలే వ‌దిలాడు కేటీఆర్‌. ఇందులో త‌న నిజాయితీ కూడా క‌నిపించింది. ప్రాక్టిక‌ల్ లీడ‌ర్‌గా ఆయ‌న ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడిన‌ట్టే అనిపించింది. దీంట్లో మ‌సిపూసి మారేడు కాయ చేయ‌కుండా, మ‌ద్యం .. స‌ర్కార్‌ను ఎలా నిల‌బెడుతుందో.. చెప్ప‌క‌నే చెప్పాడు త‌న మాట‌ల ద్వారా కేటీఆర్‌.

Advertisement

అంటే త‌మ ప‌దేళ్ల పాల‌నలో మ‌ద్యాన్ని ఏరులై పారించామ‌ని ఒప్పుకున్నాడు. బెల్ట్ షాపుల‌ను పుట్ట‌గొడుగుల్లా ఎక్క‌డ‌బడితే అక్క‌డ పెట్టించామ‌ని కూడా అంగీక‌రించాడు. మ‌ద్యం విష‌యంలో తాము చేసిన త‌ప్పిదాన్ని ఒప్పుకుంటూనే.. మీరు చేస్తున్న‌దీ అదే క‌దా? అని కూడా నిల‌దీశాడు. అంత‌కు మించి కూడా ఏం చేయ‌లేరు..!అనే వాస్త‌వాన్ని ముందుంచాడు.

మ‌ద్యం మీదే స‌ర్కార్‌కు వ‌చ్చే ఆదాయం అధిక‌మ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మ‌ని.. బ‌హిరంగంగానే చెప్పేశాడు. ద‌మ్ముంటే మీరు మ‌ద్యాన్ని అమ్మ‌కుండా ఉంటారా? అని నిల‌దీశాడు. మ‌ద్య‌పాన నిషేధం పెట్ట‌రాదూ..! అని ఎగ‌తాళి చేసిన‌ట్టుగా మాట్లాడాడు. అంటే దీని అర్థమేమిటీ? అది నీతో కాదు.. ఎవ‌రితో కాదు..! అని ఆయ‌న వెట‌కారం జోడించిన మాట‌ల ప‌ర‌మార్ధం అన్న‌మాట‌.

అంటే..ఆ తాగుడు మేము అలవాటు చేశామ‌ని బ‌ట్ట‌కాల్చి మీదేసుడు ఎందుకు? ఇప్పుడు నీ స‌ర్కార్‌లో కూడా చేస్తుంద‌దే క‌దా? అంటే మేము తాగుబోతుల‌ను చేస్తే.. నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తున్నావ్‌..! అంతే క‌దా? కానీ తాగుడు మాన్పించ‌లేక‌పోతున్నావ్‌..! ఆ తాగుడు బంద్ కూడా చేయ‌లేపోతున్నావ్‌..! అని విపులంగా చెప్ప‌డం కేటీఆర్ ఉద్దేశ్యం.

అదే చెప్పాడు. ఎందుకు అన‌వ‌స‌రంగా మ‌మ్మ‌ల్ని బ‌ద్నాం చేస్తావ్‌..? మేమూ అదే చేశాం.. మీరు అదే చేస్తున్నారు…! మందుగ‌మ‌నంలో మ‌నం మ‌నం ఒక్క‌టే.. మాది తెనాలె.. మీది తెనాలె.. మ‌ధ్య‌లో ప్ర‌జ‌లే తాగుబోతులు. వాళ్లు ఎంత తాగితే అంత స‌ర్కార్‌కు కిక్కు.. ఎంత ఊగితే అంత ఖ‌జానాకు మ‌త్తు..! ఇదీ కేటీఆర్ మాట‌ల ప‌ర‌మార్థం..!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×