E-Paper
Advertisement

పెద్ది ఓటీటీ ఫ్యాన్స్‌కి షాక్.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ మారబోతుందా?

పెద్ది ఓటీటీ ఫ్యాన్స్‌కి షాక్.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ మారబోతుందా?
Advertisement

Peddi OTT: థియేటర్ లోకి వచ్చేసిన ఏ పెద్ద సినిమా గురించైనా వినిపించే ఒకే ఒక మాట ..ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని.నచ్చిన సినిమాని ,మెచ్చిన హీరోని మళ్ళీ మళ్ళీ చూడాలని ఎవరికుండదు.ఆ క్రమంలోనే చరణ్ పెద్ది సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని వెయిట్ చేశారు మెగా ఫ్యాన్స్.ఇక సినిమా జులై 2న నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపొయెసరికి మురిసిపోయారంతా.అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా డిజిటల్ ఎంట్రీ డేట్ మారినట్టు తెలుస్తుంది.

జులై2 కాకుండా జూలై 16కి మార్పు 

అవును 400 కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇపుడు జులై2 కాకుండా జూలై 16కి మారిందని సమాచారం.అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇక ఒకవైపు థియేటర్ లలో పెద్ద సినిమాలు లేకపోవడం,మరో వైపు పెద్ది ఇంకా సాలిడ్ వసూళ్లతో రన్ అవుతుండటం వంటి కారణాలతో థియేటర్ లో చూడని ఆడియన్స్ కోసం సినిమాని మరిన్ని రోజులు ఆడించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

Advertisement

ఇక ఇందులో భాగంగా సింగిల్ స్క్రీన్ లలో చూసే ఆడియన్స్ కోసం టికెట్స్ రేట్స్ ని కూడా తగ్గించడం విశేషం.
అవును ..తెలంగాణలో సినిమా టికెట్ ధరను కేవలం రూ. 105 గా ఫిక్స్ చేశారు మేకర్స్.అలాగే అలాగే లోయర్ క్లాస్ టికెట్ ధరను కూడా కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేవిధంగా కేవలం రూ. 50కే ఫిక్స్ చేయడం ఇక్కడ మరో విశేషం

గట్టిగా డిసైడ్ అయిన మేకర్స్ 

ఇదిలా ఉంటె ఈ సినిమా హిందీలో స్ట్రీమింగ్ అయ్యే విషయంలో ఒక క్రేజీ అప్ డేట్ సర్క్యులేట్ అవుతుంది .జులై 16న తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో సినిమాని జులై 16న వదిలినా, ఒక్క హిందీలో మాత్రం జులై 30న రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.దేనికి కారణం ఇంకా నార్త్ బెల్ట్ లోని కొన్ని సెంటర్స్ లలో సినిమా సాలిడ్ వసూళ్లతో రన్ అవుతుండటమే.మొత్తానికి థియేటర్ లలో వచ్చే ఏ మాత్రం కలెక్షన్స్ ని వదులుకోకూడదని మేకర్స్ గట్టిగా డిసైడ్ అయ్యారన్న మాట.

ఎలాంటి టాక్ ని మూటగట్టుకుంటుందో

Advertisement

గేమ్ చెంజర్ లాంటి అట్టర్ ప్లాప్ తర్వాత చరణ్ కి దొరికిన ఒక బిగ్ రిలీప్ అంటే పెద్ది అనే చెప్పాలి.చరణ్ మాస్ లుక్ అండ్ మెస్మరైజ్ ఫెర్ఫామెన్స్ , బుచ్చి బాబు స్టైల్ మేకింగ్ , ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాని మరి లెవల్ కి తీసుకుపోయాయి.కానీ ఇందులోహీరోయిన్ గా నటించిన జాన్వీ అందాల ఆరబోత వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడం, బుచ్చి రీ ఎడిట్ చేయడం వంటివివి జరక్కపోతే సినిమా అలవోకగా 500 కోట్లు దాటుతుందని కాదనలేని సత్యం. చూడాలి మరి మిక్స్డ్ టాక్ తో బయటపడ్డ పెద్ది డిజిటల్ లో ఎలాంటి టాక్ ని మూటగట్టుకుంటుందో!

also read:‘అంజి’ కష్టాలు రిపీట్ అవుతున్నాయా..? ‘విశ్వంభర’ లేటెస్ట్ లీక్స్‌తో తలపట్టుకుంటున్న ఫ్యాన్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×