E-Paper
Advertisement

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది! కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!

ఢిల్లీ సీక్రెట్ కొంప ముంచింది!  కేసీఆర్ స‌భ ఆప‌రేష‌న్ స‌క్సెస్ .. పేషెంట్ డెడ్‌!
Advertisement

కేసీఆర్ స‌భ‌పై అంద‌రికీ అంచ‌నాలున్నాయి. ఆస‌క్తీ ఉంది. పార్టీల‌క‌తీతంగా అంతా ఎదురు చూశారు. ఏం మాట్లాడుతాడోన‌ని. బాగానే మాట్లాడారు కేసీఆర్. రెండేండ్ల పాల‌న‌లో ఏం చేశార‌ని నిల‌దీశారు. హామీల‌పై ప్ర‌శ్నించారు. హైడ్రా వ‌ద్ద‌న్నారు. ద‌రిద్ర‌పు పాల‌న్నారు. కాంగ్రెస్‌ను పార‌దోలే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం చేయాల‌ని పిలుపునిచ్చారు. రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణకు పూనుకోవాల‌ని కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ స‌భ‌లో ఇద్ద‌రు కీల‌క నేత‌లు మిస్స‌య్యారు. కేటీఆర్, హ‌రీశ్ రావు. ఎక్క‌డికెళ్లారు? ఢిల్లీకి వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఈ సీక్రెట్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్క‌డే గండి ప‌డ్డ‌ది .. కేసీఆర్ స‌భ‌కు.

అందుకే ఆప‌రేష‌న్ స‌క్సెస్.. పేషెంట్ డెడ్ అన్న‌ది. కేసీఆర్ స‌భ స‌క్సెస‌య్యంది. రేవంత్ బిజీ బిజీ ప‌ర్య‌ట‌న కూడా విజ‌య‌వంత‌మైంది. కానీ రేవంత్ ప‌ర్య‌ట‌న క‌న్నా.. కేసీఆర్ స‌భ‌పైనే జ‌నం ఎక్కువ‌గా ఫోక‌స్ చేశారు. బాగా రోజుల త‌రువాత ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. భారీ బ‌హిరంగ స‌భ‌.. జీవ‌న్‌రెడ్డి చేరిక చిన్న‌దే. కానీ ఆ పేరుతో చేప‌ట్టిన స‌భ‌.. కేసీఆర్ మాట్లాడే మాట‌లే ప్రాధాన్యంగా చూశారు. కేసీఆర్ త‌న‌క‌ల‌వాటైన దోర‌ణిలోనే ప్ర‌సంగించారు. ప్రసంగంలోని కొన్ని చోట్ల ఆవేశానికీ లోన‌య్యారు. త‌న చావు కోరుకుంటున్నార‌న్న ఆయ‌న‌.. ఇంకా వెయ్యేండ్ల దాకా చావ‌ను.. అని అన‌డం ఆయ‌న ఎంత‌గా ఆవేద‌న చెందారో అర్థం చేసుకోవ‌చ్చు.

Advertisement

ఇక రేవంత్ పేరు ఉచ్చ‌రించని ఆయ‌న‌.. బాడీ షేమింగ్‌కు దిగారు. కాకికి పెడ‌దామంటే కంకెడు లేవు.. పిట్ట‌కు పెడ‌దామంటే పిడికెడు లేవు అని రేవంత్‌నుద్దేశించి అన్నారు కేసీఆర్. కేటీఆర్ కూడా చాలా సంద‌ర్బాల్లో పొట్టోడా అని రేవంత్‌ను అన‌డం కామ‌న్ అయిపోయింది. దీన్ని కేసీఆర్ ఇలా సామెత రూపంలో చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు మేడిగ‌డ్డ సంద‌ర్శ‌న పెట్టుకున్న రోజునే.. కేసీఆర్ స‌భ పెట్టుకోవ‌డం కాక‌తాళీయ‌మేమీ కాదు. మేడిగ‌డ్డ ప్రోగ్రం ముందుగా అనుకున్న‌ది. ఆ త‌రువాతే జ‌గిత్యాల ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ అదే రోజు.. హ‌రీశ్‌రావు ఢిల్లీకి సీక్రెట్‌గా పోవ‌డం.. కేటీఆర్ క‌నిపించ‌కుండా పోవ‌డ‌మే ఈ స‌భ స‌క్సెస్ కాకుండా చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించింది.

హ‌రీశ్‌రావు ఒక్క‌డే ఢిల్లీకి పోయాడా? ఇద్ద‌రూ క‌లిసి పోయారా తెలియ‌దు.. కానీ..హ‌రీశ్ ఒక్క‌డే ఆగ‌మాగం.. హ‌డావుడి పోతున్న ఎయిర్‌పోర్టు విజువ‌ల్స్ టీవీల్లో క‌నిపించాయి. దీన్నే రేవంత్ రెడ్డి హైలెట్ చేశారు. మాంత్రికుడి ప్రాణాలు చిలుక‌లో ఉన్న‌ట్టు.. మేడిగ‌డ్డలో కాళేశ్వ‌రం కుంగుబాటు.. సీబీఐ ఎంక్వైరీలో భాగంగా బీజేపీతో ములాక‌త్ విష‌యాన్ని సీఎం రేవంత్ బ‌య‌ట పెట్ట‌డం సభ ఫ‌లితాన్ని గులాబీ శ్రేణుల‌కు ద‌క్క‌కుండా చేసింది. ఆరెసెస్ నేత‌లను క‌ల‌వ‌డానికి పోయినట్టు సీఎం ఆరోపించ‌డం కూడా చ‌ర్చ‌కు తెర తీసింది. తాను ఎంక్వైరీ చేయిస్తాన‌ని అన‌డం అక్క‌డ ఢిల్లీలో ఏం జ‌రుగుతుందో.. అంత హ‌డావుడిగా అర్జెంటుగా ఎందుకు డిల్లీ పోయార‌నే విష‌యాల‌పై తెలంగాణ జ‌నం చ‌ర్చించుకునేలా చేసింది.

Advertisement

సీబీఐ ఎంక్వైరీ జ‌ర‌గ‌కుండా.. అరెస్టులు కాకుండా నిలువ‌రించేందుకే బీజేపీ పెద్ద‌ల‌తో క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ట్టు రేవంత్ ఆరోపించ‌డం.. ఆ పార్టీని డ్యామేజీ చేసింది. దీంతో స‌భ హైలెట్ అయినా.. పార్టీకి డ్యామేజీ త‌ప్ప‌లేదు. ఈ రెండు స‌భ‌ల్లో ఒక‌రికొక‌రు మాత్రం చాలెంజ్ విసురుసుకున్నారు. క్లారిటీ ఇచ్చుకున్నారు. వంద అడుగుల లోతులో కేసీఆర్‌ను పాతిపెడ‌తాన‌ని రేవంత్ అంటే.. వంద శాతం బీఆరెస్ స‌ర్కారే వ‌స్తుంద‌ని కేసీఆర్ అన్నారు. మ‌ళ్లీ అధికారంలోకి మేమే వ‌స్తాం.. చాలెంజ్‌.. కాస్కో అని రేవంత్ స‌వాల్ విరిసితే.. రేవంత్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించే దాకా తెలంగాణ పున‌ర్మిరాణ య‌జ్జం ఆగ‌ద‌ని కేసీఆర్ అన్నారు. మొత్తానికి ఈ రెండు స‌భ‌ల‌తో తెలంగాణ రాజ‌కీయం వేడెక్కింది. ఇదిక్క‌డే ఆగ‌దు. ఇక దూకుడు పెరుగుతుంది. జ‌నం కోసం ఆస‌క్తిగా చూస్తున్నారు. ఎవ‌రేం చేస్తారు.? ఏం జ‌రుగుతుంది రాష్ట్రంలో అని.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×